తమిళనాడులోని మధురైలో వివిధ మౌలిక సదుపాయాల పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
March 01st, 03:30 pm
పవిత్రమైన, చారిత్రక నగరమైన మధురైని సందర్శించడం గౌరవంగా భావిస్తున్నాను. మీనాక్షి అమ్మవారికీ, భగవాన్ సుందరేశ్వరుడికీ భక్తిపూర్వక ప్రణామాలు. తమిళనాడు అభివృద్ధి ప్రస్థానంలో నేటి ఈ కార్యక్రమం గర్వించదగ్గ ఘట్టం. దాదాపు రూ. 4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసుకున్నాం. ఈ ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉద్యోగావకాశాలను కల్పించి, లక్షలాది జీవితాల్లో మార్పును తెస్తాయి. రైతులు మార్కెట్లకు చేరుకోవడానికి మెరుగైన రోడ్లు, భక్తులకూ పర్యాటకులకూ సులభతరమైన ప్రయాణం, వ్యాపారులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించడమంటే ప్రజలను సాధికారత దిశగా నడిపించడమే.మదురైలో రూ.4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభం సహా దేశానికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
March 01st, 03:00 pm
“గడచిన పన్నెండేళ్లుగా తమిళనాడు హైవే నెట్‌వర్క్‌లో కేంద్ర ప్రభుత్వం గణనీయ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో 2014 నుంచి 4 వేల కిలోమీటర్లకు పైగా హైవేలు నిర్మితమయ్యాయి” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మరక్కణం-పుదుచ్చేరి సెక్షన్ 4 వరుసల రహదారితోపాటు తీరప్రాంత పర్యాటకం, వాణిజ్యల బలోపేతానికి రూ.2,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, పరమకుడి-రామనాథపురం మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించేందుకు రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడి పెడతారని పేర్కొన్నారు. ఈ రెండో ప్రాజెక్ట్ వల్ల రామేశ్వరం, ధనుష్కోటి వంటి ప్రదేశాలకు ప్రయాణ సౌలభ్యం గణనీయంగా మెరుగవుతుందని చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల నిరంతర రవాణాకు భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు.మార్చి 1న తమిళనాడు, పుద్దుచ్చేరీల్లో ప్రధాని పర్యటన
February 27th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 1న తమిళనాడు, పుదుచ్చేరిలలో పర్యటిస్తారు. రాజస్థాన్, గుజరాత్ పర్యటన అనంతరం.. ఫిబ్రవరి 28 రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ప్రధానమంత్రి చెన్నై చేరుకుంటారు.మినికాయ్, థుండి బీచ్ లకు మరియు కదమత్బీచ్ కు ‘బ్లూ బీచ్’ ల ప్రతిష్ఠాత్మక సూచీ లో స్థానం దక్కేటట్టు చూసినందుకు గానులక్షద్వీప్ ప్రజల కు అభినందనలను తెలిపినప్రధాన మంత్రి
October 26th, 07:05 pm
మినికాయ్, థుండి సముద్ర తీరాలు మరియు కదమత్ సముద్ర తీరం ‘బ్లూ బీచ్’ ల ప్రతిష్ఠిత సూచీ లో స్థానాన్ని సంపాదించుకొన్నందుకు గాను లక్షద్వీప్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకం గా అభినందనల ను వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన బీచ్ లుగా వీటికి పర్యావరణ గుర్తింపు లభించింది. ప్రధాన మంత్రి భారతదేశపు ఉల్లేఖనీయమైనటువంటి కోస్తా తీరాన్ని గురించి నొక్కిచెప్పడం తో పాటు గా కోస్తా ప్రాంత సంబంధి స్వచ్ఛత ను పెంపొందింపచేయడం లో భారతీయులు ప్రదర్శించిన ఉత్సాహాన్ని మెచ్చుకొన్నారు.వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అనేక పథకాల శంకుస్థాపన సందర్భంగా చెన్నైలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం పూర్తి పాఠం
February 14th, 11:31 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.తమిళనాడులో పలు ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన
February 14th, 11:30 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.ఈ నెల 14న తమిళ నాడు ను, కేరళ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 12th, 06:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 14న తమిళ నాడు, కేరళ రాష్ట్రాల ను సందర్శించనున్నారు. పగటి పూట 11 గంటల 15 నిముషాల కు చెన్నై లో ప్రధాన మంత్రి అనేక కీలకమైన ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం/శంకు స్థాపన చేస్తారు. అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్‌కె-1ఎ)ని సైన్యాని కి అప్పగిస్తారు. సాయంత్రం 3 గంటల 30 నిముషాల కు కొచ్చి లో వివిధ ప్రాజెక్టుల ను దేశానికి అంకితం చేయడంతో పాటు, కొన్ని పథకాల కు శంకు స్థాపన కూడా చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల వృద్ధి గతికి కీలకమైన వేగాన్ని జత పరచడమే కాకుండా, పూర్తి స్థాయి అభివృద్ధి సామర్ధ్యాన్ని సంతరించుకోవడానికి తోడ్పడుతాయి.