Finland is an important partner for India in the Nordic region: PM Modi at the India-Finland Joint Press Meet

March 05th, 11:55 am

In his remarks at the India-Finland joint press meet, PM Modi praised Finland President Alexander Stubb as a respected thinker and appreciated him for completing the Ironman Triathlon. He noted the increasing cooperation across sectors between India and Finland. He highlighted Nokia’s mobile phones, the Numaligarh refinery and the Chenab River railway bridge as hallmarks of the partnership between the two countries.

తమిళనాడు తూత్తుకుడిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

July 26th, 08:16 pm

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, నా కేబినెట్ సహచరులు కింజరపు రామమోహన్ నాయుడు గారు, డా. ఎల్. మురుగన్ గారు, తమిళనాడు మంత్రులు తంగం తెన్నరసు గారు, డా. టి.ఆర్.బి. రాజా గారు, పి. గీతా జీవన్ గారు, అనితా ఆర్. రాధాకృష్ణన్ గారు, ఎంపీ కణిమొళి గారు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మన ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ గారు, తమిళనాడు సోదర సోదరీమణులారా!

తమిళనాడు తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

July 26th, 07:47 pm

తమిళనాడులోని తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రాంతీయంగా అనుసంధానాన్ని విశేషంగా మెరుగుపరచడంతోపాటు.. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంచేలా, శుద్ధ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా వివిధ రంగాల్లో వరుసగా చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా కార్గిల్ వీర సైనికులకు శ్రీ మోదీ నివాళి అర్పించారు. సాహసికులైన వీరయోధులకు ప్రణమిల్లారు. దేశం కోసం ప్రాణత్యాగానికీ వెనుకాడని అమరులకు మనఃపూర్వకంగా అంజలి ఘటించారు.

29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారితో ప్రధానమంత్రి సంభాషణ

June 06th, 03:01 pm

చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారిలో కొందరితో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. దేశ ప్రజలకు ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడంలో తిరుగులేని నిబద్ధతను కనబరిచారంటూ వారిపై శ్రీ మోదీ ప్రశంసలు కురిపించారు.

చినాబ్ రైలు వంతెనపై మువ్వన్నెల జెండా రెపరెపలు: ప్రధానమంత్రి

June 06th, 02:59 pm

ప్రతిష్ఠాత్మక చినాబ్ రైలు వంతెన మీద జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఇది దేశానికి ఎంతో గర్వకారణమైన క్షణం.. అంతేకాదు, అత్యంత దుర్గమ ప్రాంతాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను నిర్మించుకునే సత్తా భారత్‌కు రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఇది ఒక నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

June 06th, 12:50 pm

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారూ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారూ జితేంద్ర సింగ్ గారూ వి. సోమన్న గారూ, ఉప ముఖ్యమంత్రి సురేంద్ర కుమార్ గారూ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునిల్ గారూ, నా పార్లమెంటు సహచరుడు జుగల్ కిషోర్ గారూ, ఇతర ప్రజా ప్రతినిధులూ, ప్రియమైన సోదరీసోదరులరా... వీరుడైన జోరావర్ సింగ్ నడయాడిన గడ్డ ఇది. ఈ నేలకు ప్రణమిల్లుతున్నాను.

జమ్మూ కాశ్మీర్ లో రూ.46,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభం, అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

June 06th, 12:45 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో 46,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. ధైర్యవంతుడైన వీర్ జోరావర్ సింగ్ భూమికి వందనం చేస్తూ, నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప వేడుక అని ఆయన వ్యాఖ్యానించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ లోయ ఇప్పుడు భారతదేశంలోని విస్తారమైన రైల్వే నెట్వర్క్ తో అనునుసంధానితమైందని శ్రీ మోదీ అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో జూన్ 6న ప్రధానమంత్రి పర్యటన

June 04th, 12:37 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 6న) జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంధానానికి పెద్ద పీట వేయాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధాని చినాబ్ వంతెనను ఉదయం 11 గంటలకు ప్రారంభించడమే కాకుండా వంతెనను చూడబోతున్నారు. ఆ తరువాత, ఆయన అంజీ బ్రిడ్జిని సందర్శించడంతో పాటు ఆ వంతెనను కూడా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఆయన వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. అనంతరం, రూ. 46,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కట్‌రాలో ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడంతో పాటు వాటిని జాతికి అంకితమిస్తారు.

రాజస్థాన్‌లోని బికనీర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

May 22nd, 12:00 pm

రాజస్థాన్ గవర్నర్ హరిభావు భాగ్డే, ప్రజాదరణ సొంతం చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ భజన్ లాల్, మాజీ ముఖ్యమంత్రి, సోదరి వసుంధర రాజే, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వనీ వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి, ప్రేమ్ చంద్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇతర మంత్రులకు, సహ పార్లమెంట్ సభ్యుడు మదన్ రాథోడ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియ సోదర, సోదరీమణులకు..

రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ.26,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 22nd, 11:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ.26,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వారినీ, అలాగే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆన్‌లైన్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారినీ స్వాగతించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రజాప్రతినిధుల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులకు, పౌరులకు అభినందనలు తెలియజేశారు.

The transformation in Jammu & Kashmir is a result of the work done by the government in the last 10 years: PM in Srinagar

June 20th, 07:00 pm

PM Modi addressed ‘Empowering Youth, Transforming J&K’ programme in Srinagar. “The transformation in Jammu & Kashmir is a result of the work done by the government in the last 10 years”, the PM said. Pointing out that the women and people from lower income s in the region were deprived of their rights, the PM said that the present government worked towards bringing opportunities and restoring their rights by adopting the mantra of ‘Sabka Saath Sabka Vikas.’

‘‘యువతకు సాధికారత.. జ‌మ్ముక‌శ్మీర్ ప‌రివ‌ర్త‌న‌’’ పేరిట శ్రీనగర్‌లో నిర్వ‌హించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

June 20th, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీనగర్‌లోని ‘షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్’ (ఎస్‌కెఐసిసి)లో ‘‘యువతకు సాధికారత.. జ‌మ్ముక‌శ్మీర్ ప‌రివ‌ర్త‌న‌’’ పేరిట నిర్వ‌హించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి సరఫరా సహా ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,500 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే వ్యవసాయం-అనుబంధ రంగాల్లో పోటీతత్వం మెరుగు (జెకెసిఐపి) లక్ష్యంగా రూ.1,800 కోట్ల విలువైన ప‌థ‌కానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 200 మందికి నియామక ఉత్తర్వులు అందజేసే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, ఈ కేంద్రపాలిత ప్రాంత యువ విజేతలతో కొద్దిసేపు ముచ్చటించారు.

హర్ ఘర్ తిరంగా అభియాన్ పట్లవ్యక్తం అవుతున్న ఉత్సాహం తాలూకు దృష్టాంతాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

August 14th, 02:34 pm

హర్ ఘర్ తిరంగా అభియాన్ ను దేశం అంతటా వేడుక గా జరుపుకొంటున్నటువంటి వివిధ దృష్టాంతాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైలు వంతెన కమాను నిర్మాణం పూర్తిపై ప్రధాని ప్రశంస

April 05th, 08:51 pm

జమ్ముక‌శ్మీర్‌ పరిధిలో చీనాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైలు వంతెన కమాను నిర్మాణాన్ని పూర్తి చేయడంపై భారత రైల్వేశాఖను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దేశ ప్రజల సామర్థ్యం, ఆత్మవిశ్వాసాలు కొన్ని సజీవ ఉదాహరణలను ప్రపంచం ఎదుట ఉంచుతున్నాయని శ్రీ మోదీ అందులో పేర్కొన్నారు. ఆధునిక ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞాన‌ రంగాల్లో భారతదేశం దినదిన ప్రవర్ధమానం కావడాన్ని ఈ నిర్మాణం ఘనంగా చాటుతున్నదని వివరించారు. అంతేకాకుండా ‘‘సంకల్పంతో లక్ష్యసిద్ధి’’ నియమం స్ఫూర్తితో మారుతున్న పని సంస్కృతికీ ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు.

ప్రధాన మౌలిక రంగ రంగాల పనితీరును సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ

April 26th, 12:25 pm

ప్రధాని నరేంద్ర మోదీ రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, డిజిటల్, బొగ్గు వంటి కీలకమైన మౌలిక రంగాల అభివృద్ధిని సమీక్షించారు. ప్రాజెక్టుల హోస్ట్ ల నుండి గణనీయమైన మెరుగుదల చూసింది. గ్రామీణ రహదారుల నిర్మాణానికి, వారి నాణ్యతను సమర్థవంతంగా, కఠినమైన పర్యవేక్షణకు ప్రధాన మంత్రి ఆదేశించారు. రహదారి నిర్మాణంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని ప్రధాని మోదీ ఆదేశించారు.