హుల్ దివస్ సందర్భంగా వీర యోధులకు ప్రధానమంత్రి నివాళులు
June 30th, 06:10 pm
నేడు హుల్ దివస్ సందర్భంగా విదేశీ పాలన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన సిదో-కన్హూ, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి వీర యోధులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గిరిజన ఆత్మగౌరవం, మర్యాదను కాపాడటం కోసం వారు చేసిన పోరాటం, త్యాగాల గాథ దేశ ప్రజల హృదయాల్లో నిరంతరం సరికొత్త శక్తిని నింపుతూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.హూల్ దివస్ సందర్భంగా గిరిజన వీరులకు ప్రధానమంత్రి నివాళులు
June 30th, 02:28 pm
ఆరాధనీయ ‘హూల్ దివస్’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత గిరిజనుల అజేయ ధైర్య, సాహసాలతో పాటు వారి అసాధారణ పరాక్రమానికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించారు. చరిత్రాత్మక సంథాల్ తిరుగుబాటును ప్రధానమంత్రి స్మరించుకొంటూ సిదో-కాన్హూ, చాంద్-భైరవ్‌లతో పాటు ఫూలో-ఝానోలతో పాటు వలస పాలకుల పీడనకు వ్యతిరేకంగా పోరాడుతూ జీవనాన్ని త్యాగం చేసిన పూజనీయ స్వాతంత్ర్య వీరులు, వీరాంగనలందరి శాశ్వత వారసత్వానికి జోహార్లు అర్పించారు.