1996 శ్రీలంక క్రికెట్ జట్టుతో ప్రధానమంత్రి ప్రత్యేక సంభాషణ
April 05th, 10:25 pm
ప్రశంసించారో నేను గమనించాను. శ్రీలంక ప్రజలు ఎదుర్కొన్న కష్టాల్ని చూసి, వారిని వారి కర్మకు వదలివేయకూడదనుకొని భారత్ సిసలైన క్రీడాస్ఫూర్తిని చాటింది. దానికి బదులు, మేమన్నాం కదా ‘‘రండి, మనం బయలుదేరి వెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుందో ’’ అని.1996 శ్రీలంక క్రికెట్ జట్టుతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
April 05th, 10:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1996 సంవత్సరపు శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో శ్రీలంకలో నిన్న మాట్లాడారు. అరమరికల్లేకుండా సాగిన ఈ సంభాషణ క్రమంలో, క్రికెటర్లు ప్రధానిని కలుసుకొన్నందుకు సంతోషాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశారు. వారిని కలుసుకొన్నందుకు ప్రధానమంత్రి కూడా తన సంతోషాన్ని ప్రకటించారు. ఈ టీమ్ కనబర్చిన చక్కని ఆట తీరు భారతీయులకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందని, ముఖ్యంగా ఆ మరపురాని గెలుపు చెరగని ముద్ర వేసిందని ఆయన అన్నారు. వారి విజయం ఇంకా దేశంలో మారుమోగుతూనే ఉందని ఆయన అభివర్ణించారు.