కేంద్ర మాజీమంత్రి శ్రీ చమన్‌లాల్ గుప్తా మృతికి ప్రధానమంత్రి సంతాపం
May 18th, 01:54 pm
కేంద్ర మాజీమంత్రి శ్రీ చమన్‌లాల్ గుప్తా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌ద్వారా సందేశమిస్తూ- ‘‘అనేక సామాజిక సంక్షేమ సేవా కార్యక్రమాల్లో శ్రీ చమన్‌లాల్ గుప్తాగారి కృషి చిరస్మరణీయం. ఆయన అంకితభావంగల చట్టసభ సభ్యులు మాత్రమే కాకుండా జమ్ముకశ్మీర్‌లో బీజేపీని బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన మృతి వార్త నన్నెంతో విచారానికి గురిచేసింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను… ఓం శాంతి’’ అని పేర్కొన్నారు.