డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్: శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

December 06th, 09:27 am

ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. సమానత్వ సాధన కోసం, మానవ ఆత్మ గౌరవాన్ని పరిరక్షించడం కోసం డాక్టర్ అంబేద్కర్ అలుపెరుగక చేసిన పోరాటం తరాల తరబడి ప్రేరణను అందిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

స్మారకాల ద్వారా జాతీయాభిమాన ప్రబోధం

January 31st, 07:52 am

‘‘సర్దార్ పటేల్ మనకు అఖండ భారతాన్ని ఇచ్చారు’’ అని 2016వ సంవత్సరం అక్టోబరు 31వ తేదీ న ‘‘ఒకే భారతం – శ్రేష్ఠ భారతం’’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఇక శ్రేష్ఠ భారతాన్ని రూపొందించడం 125 కోట్ల మంది భారతీయుల సమష్టి కర్తవ్యం’’ అని కూడా నిర్దేశించారు. భారత ప్రధాన మంత్రి గా బాధ్యతల ను స్వీకరించడానికి ముందు కూడా నరేంద్ర మోదీకి మార్గనిర్దేశం చేసింది ఈ సూత్రమే.

డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఆంబేడ్క‌ర్ మ‌హాప‌రినిర్వాణ్ దివ‌స్ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ణామం చేసిన ప్ర‌ధాన మంత్రి

December 06th, 09:16 am

డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఆంబేడ్క‌ర్ మ‌హాప‌రినిర్వాణ్ దివ‌స్ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు ప్ర‌ణ‌మిల్లారు.