ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి
December 17th, 12:02 am
పరిమిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో వారు పాల్గొన్నారు. శతాబ్దాల నాటి నాగరికత పునాదులపై ఏర్పడి, ప్రజాసంబంధాలతో బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. వీటికి ప్రాధాన్యమిస్తూ.. భారత్-ఇథియోపియా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడానికి నాయకులిద్దరూ అంగీకరించారు. గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి రెండు దేశాల కృషిని కొనసాగించాలని నిర్ణయించారు. 2023లో జీ20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు ఈ కూటమిలో సభ్యత్వం ఇవ్వడం భారతదేశానికి దక్కిన గౌరవమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడంతో పాటు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసిన ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇథియోపియాలో ప్రధానమంత్రికి ప్రత్యేక స్వాగతం
December 16th, 06:21 pm
ఇథియోపియాతో తొలి ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అడ్డిస్ అబాబా చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇథియోపియా ప్రధానమంత్రి శ్రీ డాక్టర్ అబీ అహ్మద్ అలీ నుంచి ప్రత్యేకమైన, ఆత్మీయమైన స్వాగతం లభించింది.మాల్దీవుల అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ
July 25th, 08:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాలేలోని అధ్యక్షుడి కార్యాలయంలో మాల్దీవుల దేశాధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీకి రిపబ్లిక్ స్క్వేర్‌లో అధ్యక్షుడు ముయిజు ఘనంగా సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్యనున్న లోతైన స్నేహ బంధాన్ని, హృదయపూర్వక వాతావరణాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది.