‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 18th, 05:00 am
ముందుగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం గోథెన్‌బర్గ్‌లో జరగడం నాకు సంతోషంగా ఉంది. ఈ నగరం ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందినది. ఈ నగరం యూరప్ తయారీ రంగ స్ఫూర్తికి చిహ్నంగానూ నిలుస్తుంది.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ని (ఈఆర్‌టీ) ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
May 17th, 12:12 am
గోథెన్‌బర్గ్‌లో 2026 మే 17న నిర్వహించిన 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' (ఈఆర్‌టీ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. వోల్వో గ్రూప్ నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ఐరోపా కమిషన్ అధ్యక్షులు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఐరోపాకు చెందిన సీనియర్ పారిశ్రామిక ప్రముఖులు, ప్రముఖ యూరోపియన్- భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.నెదర్లాండ్స్‌లో సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రధాని ప్రసంగం
May 16th, 10:00 pm
ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు నిలయాలైన కొన్ని కంపెనీల అధినేతల నడుమ ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు 300కు పైగా డచ్ కంపెనీలు భారత్ ప్రస్థానంలో భాగమయ్యాయి. భారత్ పట్ల మీకున్న సానుకూల దృక్పథం, విశ్వాసం వల్లే.. ఐరోపా నుంచి భారత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా, రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నెదర్లాండ్స్ నిలిచింది.ఐఏ ఇంపాక్ట్ సమ్మిట్‌లో నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్‌లో బాధ్యతాయుత కృత్రిమ మేధ పట్ల ప్రపంచ నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధానమంత్రి
February 19th, 10:05 pm
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్ ఫలితాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. ఏఐ), సాంకేతికతలతో పాటు నవకల్పన రంగాలకు చెందిన అగ్రగామి ఆసక్తిదారులు ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.