ఫిబ్రవరి 13న సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2ని ప్రారంభించనున్న పీఎం
February 12th, 12:02 pm
ఫిబ్రవరి 13, 2026న మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు సేవా తీర్థ్ భవన సముదాయం పేరును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రధానమంత్రి.. సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2లను అధికారికంగా ప్రారంభిస్తారు. సాయంత్రం సుమారు 6 గంటలకు సేవా తీర్థ్ వద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
August 17th, 12:45 pm
కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 17th, 12:39 pm
ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.కర్తవ్య భవన్‌కు 6వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభోత్సవం
August 04th, 05:44 pm
అత్యాధునిక, సమర్థ, పౌర-కేంద్రక పాలనపై ప్రధానమంత్రి దృక్కోణానుగుణ ప్రభుత్వ నిబద్ధతలో కర్వవ్య భవన్ ఓ కీలక ఘట్టంగా నిలుస్తుంది. సెంట్రల విస్టా భవన సముదాయం విస్తృత రూపాంతరీకరణలో ప్రధాని ప్రారంభించనున్న కర్తవ్య భవన్-03 ఒక అంతర్భాగం. పరిపాలన ప్రక్రియల క్రమబద్ధీకరణ, చురుకైన పాలన లక్ష్యంగా నిర్మితమవుతున్న సార్వత్రిక కేంద్ర సచివాలయ భవన సముదాయంలో ఇది మొదటిది.