Prime Minister extends greetings to the people of Sikkim on Statehood Day
May 16th, 01:32 pm
The Prime Minister, Shri Narendra Modi, today extended greetings to the people of Sikkim on the occasion of the State’s Statehood Day, marking a historic milestone as Sikkim celebrates its 50th Statehood Day this year. Shri Modi remarked that the contribution of Sikkim to India’s development journey is deeply valued and appreciated. Recalling his recent visit to Sikkim during the 50th Statehood Day celebrations, the Prime Minister said that he was deeply touched by the warmth and affection shown by the people of the State.మే 10, 11వ తేదీల్లో గుజరాత్‌లో పీఎం పర్యటన
May 09th, 11:19 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2026 మే 10, 11వ తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. మే 10న రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకుంటారు. మే 11న ఉదయం 10:15 గంటలకు సోమనాథ్ ఆలయంలో జరిగే సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి వడోదరాకు వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు సర్దార్‌ధామ్ హాస్టల్‌ను ప్రారంభిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ప్రసంగిస్తారు.మే 10న కర్ణాటక, తెలంగాణలో పీఎం పర్యటన
May 09th, 11:17 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10, 2026న కర్ణాటక, తెలంగాణల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు బెంగళూరులో జరిగే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 01st, 09:14 am
గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
April 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.Prime Minister extends Easter Greetings
April 05th, 09:02 am
The Prime Minister, Shri Narendra Modi, has extended greetings on the occasion of Easter.గుజరాత్‌లోని పోరుబందరులో మాధవపూర్ మేళా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
March 29th, 10:23 am
గుజరాత్‌లోని పోరుబందరులో జరుగుతున్న మాధవ్‌పూర్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సాహభరితమైన వేడుక మన ఘనమైన సంస్కృతిని చాటిచెబుతుందనీ... గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల మధ్య గల శాశ్వత సాంస్కృతిక బంధాన్ని మరింత బలపరుస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, ఈ పండుగ విభిన్న సంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. ప్రజలందరూ ఈ మేళాను సందర్శించాలని నేను పిలుపునిస్తున్నాను! అని శ్రీ మోదీ పేర్కొన్నారు.కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 28th, 02:39 pm
ఈ విశిష్ట సందర్భంలో మీ అందరితో మమేకం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయుర్వేద వైద్య విధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ తన 125 ఏళ్ల ప్రస్థానంలో ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించింది. ఈ నేపథ్యంలో ఆర్య వైద్యశాల వ్యవస్థాపకులైన వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాను. ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 28th, 02:25 pm
కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇటువంటి పవిత్ర సందర్భంలో అందరితోనూ మమేకం కావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుర్వేద వైద్యవిధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన కొనియాడారు. ఈ మేరకు 125 ఏళ్ల ప్రస్థానంలో ఈ సంస్థ ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను స్మరించుకుంటూ, ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.3ఉత్సాహం, జాతీయ గర్వంతో నిండిన గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రశంసించిన ప్రధానమంత్రి
January 26th, 04:50 pm
గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత్ ఎంతో ఉత్సాహంతో, గర్వంతో జరుపుకుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 23rd, 02:12 pm
ఈరోజు మనమందరం ఒక ప్రత్యేక సందర్భానికి సాక్షులుగా నిలుస్తున్నాం. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతున్న ఈ ద్విశతాబ్ది వేడుకలు మనందరికీ దక్కిన అదృష్టం. ఈ పవిత్ర మహోత్సవంలో మనమందరం భాగస్వాములవ్వడం విశేషం. ఈ పుణ్యకాలంలో నేను సాధువులందరికీ ప్రణామం చేస్తున్నాను. ఈ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా భగవాన్ స్వామినారాయణ్ కోట్లాది మంది భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 23rd, 02:00 pm
శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశాన్ని ఇవాళ వీడియో ద్వారా పంచుకున్నారు. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భానికి మనమంతా సాక్షులమని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ద్విశతాబ్ది వేడుకలు జరుపుకోవటం, ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు కావటం అందరికీ దక్కిన అదృష్టమన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో సాధువులకు శిరస్సు వంచి నమస్కరించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ, ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ బోధనలను అనుసరిస్తున్న కోట్ల మంది భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.నవంబరు 26న సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాలు.. పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి
November 25th, 04:19 pm
ఈ నెల 26న ఉదయం సుమారు 11 గంటల వేళకు సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్లో నిర్వహించే రాజ్యాంగ దినోత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాజ్యాంగాన్ని అంగీకరించిన తరువాత ఈ సంవత్సరంతో 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం.నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన
November 18th, 11:38 am
నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.ఢిల్లీ చిత్తరంజన్ పార్క్ దుర్గా పూజా వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి ప్రజలందరీ ఆనందం, క్షేమాన్ని కోరుతూ ప్రార్థన
September 30th, 09:24 pm
మహాష్టమి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌లో నిర్వహించిన దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్నారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
August 07th, 03:31 pm
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన ప్రధానమంత్రి
July 26th, 06:47 pm
మాల్దీవుల దేశంలో అధికారిక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు ముయిజు ఆతిథ్యం ఇచ్చిన ప్రభుత్వాధినేత లేదా దేశ నాయకుడు కూడా ప్రధాని మోదీనే కావటం విశేషం.శ్రీ నారాయణ గురు-మహాత్మాగాంధీల సంభాషణ శతాబ్ది ఉత్సవాలను రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి
June 23rd, 05:24 pm
ఆధ్యాత్మికత, నైతిక విలువలను బోధించిన గొప్ప నాయకులు శ్రీ నారాయణ గురు - మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రాత్మక సంభాషణ శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.మారిషస్ అధికారిక పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి ముందస్తు సందేశం
March 10th, 06:18 pm
నా మిత్రుడు, మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం ఆహ్వానం మేరకు ఆ దేశ 57వ జాతీయ దినోత్సవంలో పాలు పంచుకునేందుకు నేను రెండు రోజుల అధికారిక పర్యటన చేపట్టబోతున్నాను.ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా సాధికారిత కల్పించే జాతీయ ఓటర్ల దినోత్సవం... ఓ ప్రజాస్వామ్య వేడుక: ప్రధానమంత్రి
January 25th, 08:45 am
ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. మన శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకోవడం, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సాధికారతను కల్పించడం జాతీయ ఓటర్ల దినోత్సవం ఉద్దేశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈసందర్భంగా అన్నారు.