సమాజానికి పోప్ ఫ్రాన్సిస్ చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: ప్రధానమంత్రి
April 26th, 01:00 pm
భారత ప్రజల తరఫున పోప్ ఫ్రాన్సిస్ కు గౌరవ రాష్ట్రపతి నివాళులు అర్పించారని, పోప్ ఫ్రాన్సిస్ సమాజానికి చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం.. ప్రధానమంత్రి సంతాపం
April 21st, 02:20 pm
పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరని తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.భారత కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
December 23rd, 09:24 pm
మూడు నాలుగు రోజుల కిందటే కేంద్ర మంత్రి అయిన నా సహచరుడు జార్జ్ కురియన్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను. ఈవేళ మీ అందరి మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నాను. భారత క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (సీబీసీఐ) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా క్రిస్మస్ వేడుకలో మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. ఇది మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా నిలవబోతోంది. సీబీసీఐ స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా సీబీసీఐకి, దానితో సంబంధమున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
December 23rd, 09:11 pm
క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ), న్యూడిల్లీలోని సీబీసీఐ కేంద్రం ఆవరణలో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. క్యాథలిక్ చర్చి ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ తరహా కార్య్రమానికి ఓ ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే తొలిసారి. కార్డినల్స్, బిషప్‌లు, చర్చిలో ప్రధాన నాయకులతో పాటు క్రైస్తవ సమాజానికి చెందిన ముఖ్యమైనవారితో ప్రధాని సంభాషించారు.ప్రధానమంత్రితో ‘కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధి బృందం సమావేశం
July 12th, 09:53 pm
కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైంది.