న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్ 2025లో ప్రధాని ప్రసంగం
October 31st, 06:08 pm
న్యూఢిల్లీలోని రోహిణిలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనం 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు విన్న మంత్రాల శక్తిని అందరూ ఇంకా అనుభూతి చెందుతున్నారన్నారు. తానెప్పుడు ఈ సమావేశాలకు వచ్చినా.. దివ్యమైన, అసాధారణ అనుభవం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్వామి దయానందుడి ఆశీస్సుల వల్లే ఈ భావన ఎల్లవేళలా సాధ్యమవుతోందన్నారు. స్వామి దయానందుడి ఆదర్శాలు పూజనీయమైనవన్నారు. అక్కడున్న చింతనాపరులందరితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం వల్లే వారిలో ఒకరిగా ఉండే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కుతోందన్నారు. వారిని కలిసి, మాట్లాడినప్పుడల్లా.. ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని, తనలో ప్రేరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు.భోపాల్‌లోని దేవి అహిల్యాబాయి మహిళా సశక్తీకరణ్ మహా సమ్మేళన్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 31st, 11:00 am
మధ్యప్రదేశ్ గవర్నర్ గౌరవనీయ శ్రీ మంగు భాయ్ పటేల్, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, సాంకేతిక మాధ్యమాల ద్వారా పాలు పంచుకుంటున్న కేంద్ర మంత్రులు- ఇండోర్ నుంచి శ్రీ తో ఖాన్ సాహు, దాటియా నుంచి శ్రీ రామ్మోహన్ నాయుడు, సత్నా నుంచి శ్రీ మురళీధర్ మోహుల్, వేదికను అలంకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ జగదీష్ దేవ్డా, శ్రీ రాజేంద్ర శుక్లా, లోక్‌సభలో నా సహచరులు శ్రీ వి.డి.శర్మ, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీ సోదరులారా!లోకమాత దేవీ అహల్యా బాయి హోల్కర్ 300వ జన్మదినోత్సవ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళనంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 31st, 10:27 am
లోకమాత దేవి అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భోపాల్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా 'మా భారతి'కి నివాళులు అర్పిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, భారత మహిళా శక్తి గొప్పతనాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు, వారు ఈ కార్యక్రమానికి రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు లోకమాత దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమైన సందర్భం, జాతి నిర్మాణంలో గొప్ప ప్రయత్నాలకు మద్దతునిచ్చే క్షణంగా ఈ సందర్భాన్ని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేవి అహల్యాబాయిని ఉటంకిస్తూ, నిజమైన పాలన అంటే ప్రజలకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడం అని ఆయన పునరుద్ఘాటించారు. నేటి కార్యక్రమం అహల్యాదేవి దార్శనికతను ప్రతిబింబిస్తూ, ఆమె ఆదర్శాలను ముందుకు తీసుకువెళుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండోర్ మెట్రో ప్రారంభంతో పాటు, దాటియా, సత్నాలకు విమాన కనెక్టివిటీని జోడించడాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులు మధ్యప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తాయని, అభివృద్ధిని వేగవంతం చేస్తాయని అలాగే కొత్త ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 30th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-Our government places utmost importance on 'Samman' and 'Suvidha' for women: PM Modi in Navsari, Gujarat
March 08th, 11:50 am
PM Modi launched various developmental works in Navsari, Gujarat and addressed the gathering on the occasion of International Women's Day. PM extended his best wishes to all the women of the country and remarked that women are excelling in every sector. He highlighted the launch of two schemes, G-SAFAL and G-MAITRI in Gujarat. Shri Modi acknowledged Navsari district as one of the leading districts in Gujarat for rainwater harvesting and water conservation. He spoke about Namo Drone Didi campaign that is revolutionizing agriculture and the rural economy.గుజరాత్‌లోని నవ్‌సారిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
March 08th, 11:45 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని నవ్‌సారిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తల్లులు, సోదరీమణులు, కుమార్తెల ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున దేశంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహా కుంభమేళాలో గంగా మాత ఆశీస్సులు పొందానని, ఈ రోజు మాతృశక్తి మహా కుంభమేళాలో ఆశీర్వాదం పొందానని ఆయన తెలిపారు. ఈ రోజు గుజరాత్‌లో జీ-సఫాల్ (జీవనోపాధిని పెంపొందించడానికి అంత్యోదయ కుటుంబాల కోసం గుజరాత్ పథకం), జీ-మైత్రి (గ్రామీణ ఆదాయాన్ని పెంచేందుకు ప్రజలకు గుజరాత్ అందించే మెంటార్‌షిప్ అండ్ యాక్సిలరేషన్) అనే రెండు పథకాలను ప్రారంభించిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వివిధ పథకాల నిధులను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశామని, ఈ విషయంలో ప్రతిఒక్కరిని అభినందిస్తున్నట్లు తెలిపారు.ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్ బివై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్ డబ్ల్యుబిసిఐఎస్) మార్పులకు మంత్రివర్గం ఆమోదం
January 01st, 03:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.69,515.71 కోట్ల వ్యయంతో ( 2021-22 నుంచి 2025-26 వరకూ) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 2025-26 వరకు దేశవ్యాప్తంగా రైతులకు అనివార్య ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను రక్షించడానికి సహాయపడుతుంది.కెన్ – బెత్వా నదీ అనుసంధాన జాతీయ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా మధ్యప్రదేశ్ లోని కజురహోలో ప్రధాని ప్రసంగం
December 25th, 01:00 pm
వీరభూమి అయిన బుందేల్ ఖండ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవనీయ మధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, కార్యశీలుడైన ముఖ్యమంత్రి- సోదరుడు మోహన్ యాదవ్, కేంద్ర మంత్రులు సోదరులు శివరాజ్ సింగ్, వీరేంద్ర కుమార్, సీఆర్ పాటిల్, ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవడా, రాజేంద్ర శుక్లా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశిష్ట అతిథులు, పూజనీయ సాధుసంతులు, ప్రియమైన మధ్రప్రదేశ్ సోదరీ సోదరులు... అందరికీ నా శుభాకాంక్షలు.మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కెన్-బెత్వా నదుల అనుసంధాన జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన
December 25th, 12:30 pm
మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా ఈ రోజు మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన వారిని ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగించారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి డా. మోహన్ యాదవ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది కాలంలో వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పథకాలను అమలు చేయడంతో పాటు, అభివృద్ధి కార్య్రమాలు వేగం పుంజుకున్నాయని ఆయన అన్నారు. చరిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు, దౌధన్ డ్యామ్‌కు, మధ్యప్రదేశ్‌లో మొదటి సౌర విద్యుత్ ప్లాంట్ అయిన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 04:00 pm
వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన
October 28th, 03:30 pm
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగలు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగమన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ
September 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.No power can stop the country whose youth is moving ahead with the resolve of Nation First: PM Modi
January 28th, 01:37 pm
Prime Minister Narendra Modi addressed the National Cadet Corps Rally at Cariappa Ground in New Delhi. The PM talked about the steps being taken to strengthen the NCC in the country in a period when the country is moving forward with new resolutions. He elaborated on the steps being taken to open the doors of the defence establishments for girls and women.కరియప్ప గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి పిఎమ్ ర్యాలీ ని ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి
January 28th, 01:36 pm
కరియప్ప గ్రౌండు లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి పరిశీలించడం తో పాటు గా, ఎన్ సిసి దళాలు జరిపిన కవాతు ను కూడా ఆయన సమీక్షించారు. సైనిక కార్యాచరణ, స్లిదరింగ్, మైక్రోలైట్ ఫ్లయింగ్, పారా సెయిలింగ్, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల లో ఎన్ సిసి కేడెట్ లు వారి యొక్క నైపుణ్యాల ను ప్రదర్శించడాన్ని కూడా ఆయన గమనించారు. ఉత్కృష్ట కేడెట్ లు ప్రధాన మంత్రి వద్ద నుంచి పతకాన్ని, బేటన్ ను స్వీకరించారు.చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి: ప్రధాని మోదీ
September 26th, 11:30 am
నా ప్రియమైన దేశ వాసులారా! నమస్కారం.. ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం నేను అమెరికా వెళ్లాల్సి ఉందని మీకు తెలుసు. కాబట్టి అమెరికా వెళ్లే ముందు 'మన్ కీ బాత్' రికార్డ్ చేయడం మంచిదని అనుకున్నాను. సెప్టెంబర్‌లో 'మన్ కీ బాత్' ప్రసారం అయ్యే తేదీన మరో ముఖ్యమైన రోజు ఉంది. మనం చాలా రోజులను గుర్తుంచుకుంటాం. వివిధ దినోత్సవాలను జరుపుకుంటాం. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, మీరు వారిని అడిగితే, సంవత్సరం మొత్తంలో ఏ రోజు ప్రాధాన్యత ఏమిటో మీకు పూర్తి జాబితాను చెప్తారు. కానీ మనమందరం గుర్తుంచుకోవలసిన మరో రోజు ఉంది. ఈ రోజు భారతదేశ సంప్రదాయాలకు అనుగుణమైంది. ఇది శతాబ్దాలుగా మన సంప్రదాయాలకు అనుబంధంగా ఉన్న అంశంతో అనుసంధానమైంది. ఇది 'వరల్డ్ రివర్ డే'. అంటే ప్రపంచ నదుల దినోత్సవం.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 05th, 11:05 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీమాన్ శ్రీ నితిన్ గడ్కరీ జీ, నరేంద్ర సింగ్ తోమర్జీ, ప్రకాష్ జవదేకర్ జీ, పీయూష్ గోయల్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, గుజరాత్ లోని ఖేడా పార్లమెంటు సభ్యుడు, దేవుసింగ్ జసింగ్ భాయ్ చౌహాన్ జీ, హర్దోయ్ పార్లమెంటు సభ్యుడు, యుపి, భాయ్ జై ప్రకాష్ రావత్ జీ, పూణే మేయర్ ముర్లీధర్ మహుల్ జీ, పింప్రి చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ సోదరి ఉషా జీ ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,ప్రపంచ పర్యావరణ దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 05th, 11:04 am
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో పెట్రోలియమ్ & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ కలసి శనివారం నాడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా పుణే కు చెందిన ఒక రైతు తో ఆయన మాట్లాడారు. ఆ రైతు సేంద్రియ వ్యవసాయం తాలూకు తన అనుభవాన్ని, వ్యవసాయం లో బయో ఫ్యూయల్ వినియోగాన్ని గురించి వెల్లడించారు.'క్యాచ్ ద రెయిన్' ప్రచార ఉద్యమం ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 22nd, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రపంచ జల దినం అయినటువంటి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నదుల ను ఒకదానితో మరొక దానిని సంధానించడం కోసం ఉద్దేశించినటువంటి జాతీయ ప్రణాళిక లో ఒకటో ప్రాజెక్టు గా కేన్- బేత్ వా లింక్ ప్రాజెక్టు ను కార్యరూపం లోకి తీసుకు రావడం కోసం ఒక ఒప్పంద పత్రం పైన కేంద్ర జల శక్తి మంత్రి, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి సమక్షం లో సంతకాలు చేశారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ లకు చెందిన సర్పంచుల ను, వార్డు ప్రముఖుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడారు.ప్రపంచ జల దినం సందర్భం లో ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 22nd, 12:05 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రపంచ జల దినం అయినటువంటి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నదుల ను ఒకదానితో మరొక దానిని సంధానించడం కోసం ఉద్దేశించినటువంటి జాతీయ ప్రణాళిక లో ఒకటో ప్రాజెక్టు గా కేన్- బేత్ వా లింక్ ప్రాజెక్టు ను కార్యరూపం లోకి తీసుకు రావడం కోసం ఒక ఒప్పంద పత్రం పైన కేంద్ర జల శక్తి మంత్రి, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి సమక్షం లో సంతకాలు చేశారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ లకు చెందిన సర్పంచుల ను, వార్డు ప్రముఖుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడారు.‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్’ ప్రచార ఉద్యమాన్ని ఈ నెల 22న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
March 21st, 12:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ జల దినం అయిన ఈ నెల 22 న మధ్యాహ్నం 12 గంటల ముప్ఫై నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘జల శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి సమక్షం లో, కేన్ బెట్ వా లింక్ ప్రాజెక్టు అమలు కోసం ఉద్దేశించిన చరిత్రాత్మకమైనటువంటి ఒక ఒప్పంద పత్రం పై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానానికి తలపెట్టిన జాతీయ దృష్టికోణ ప్రణాళిక లో ఒకటో ప్రాజెక్టు గా ఉంది.