ఢిల్లీలోని కరియప్ప పెరేడ్ మైదానంలో ఎన్‌సిసి ర్యాలీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రిమండలిలోని నా సహచరులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ సంజయ్ సేథ్, ‘సిడిఎస్’ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణశాఖ కార్యదర్శి గారు, ‘ఎన్‌సిసి’ డీజీగారు, ఇతర అతిథులు నా ప్రియ ‘ఎన్‌సిసి’ యువ మిత్రులారా!వార్షిక ‘ఎన్‌సిసి పిఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 04:30 pm
దేశ రాజధాని ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఇవాళ నిర్వహించిన వార్షిక ‘నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సిసి) పీఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించడంతోపాటు ఉత్తమ కేడెట్లకు పురస్కార ప్రదానం చేశారు. ‘ఎన్‌సిసి దినోత్సవం’ నేపథ్యంలో సభికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ- 18 మిత్రదేశాల నుంచి దాదాపు 150 మంది కేడెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారందరినీ స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ‘మేరా యువ భారత్’ (మై భారత్) పోర్టల్ ద్వారా దేశం నలుమూలల నుంచి ఆన్‌లైన్‌లో పాల్గొన్న యువతను కూడా ఆయన అభినందించారు.జనవరి 27న ఢిల్లీలో కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి ఇతివృత్తం: యువశక్తి… వికసిత్ భారత్
January 26th, 07:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 27న సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ తరహా ర్యాలీని ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు.