భారత్-న్యూజీలాండ్ వాణిజ్య కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

July 11th, 08:20 am

నేటి ఈ సమావేశానికి మీరంతా హాజరు కావడం న్యూజీలాండ్‌ వాణిజ్య, ఆవిష్కరణల స్ఫూర్తిని, దూరదృష్టి గల విధానాలను ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ తరఫున మా 140 కోట్ల మంది ప్రజల ఆశలు-ఆకాంక్షలను నాతోపాటు తెచ్చాను.

Prime Minister addresses business leaders in New Zealand

July 11th, 08:16 am

PM Modi interacted with leading CEOs and business leaders from India and New Zealand, highlighting the vast opportunities for trade, investment and innovation. He invited New Zealand businesses to partner India's growth story and help achieve the shared goal of doubling bilateral trade to NZD 7 billion by 2030.

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద ప్రైవేట్ భాగస్వామికి దీర్ఘకాలిక లైసెన్స్ ద్వారా నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయ ఉన్నతీకరణ-ఆధునికీకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

May 13th, 03:41 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)తోపాటు మిహాన్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్‌) సంస్థకు ఇచ్చిన భూమి లీజు కాలాన్ని 06.08.2039 తర్వాత కూడా పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. తద్వారా నాగ్‌పూర్ విమానాశ్రయాన్ని వాణిజ్య కార్యకలాపాల ఆరంభ తేదీ (సీఓడీ) నుంచి 30 ఏళ్ల పాటు ఒప్పంద సంస్థ ‘జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్’ (జీఎన్‌ఐఏఎల్‌)కు నిర్వహణ లైసెన్స్ కింద ‘ఎంఐఎల్‌’ అప్పగిస్తుంది.

టీఎంసీ ప్రభుత్వాన్ని గూండాలు నడుపుతున్నారు లేదా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మాత్రమే నడుపుతున్నారు: పశ్చిమ బెంగాల్‌లోని ఆరాంబాగ్‌లో ప్రధాని మోదీ

April 26th, 01:50 pm

పశ్చిమ బెంగాల్‌లోని ఆరాంబాగ్‌లో జరిగిన విజయ సంకల్ప్ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 15 ఏళ్ల బెదిరింపుల తర్వాత బెంగాల్ ప్రజలు ఇప్పుడు అన్యాయాన్ని ఓడించడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కోర్టు జోక్యం తర్వాత మాత్రమే టీఎంసీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. భయం, అవినీతి, సిండికేట్ నియంత్రణ లేని ప్రభుత్వం మాత్రమే బెంగాల్ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయగలదని పేర్కొంటూ, ప్రజలు బీజేపీకి నిర్ణయాత్మకంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ 15 ఏళ్ల సిండికేట్ టీఎంసీ పాలనకు మే 4తో ముగింపు: పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్‌లో ప్రధాని మోదీ

April 26th, 01:30 pm

పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ, టీఎంసీ అవినీతి, సిండికేట్ పాలన, భయ రాజకీయాలపై తీవ్ర సందేశం ఇచ్చారు. టీఎంసీ పాలనలో నారీ శక్తి అత్యంత తీవ్రంగా ప్రభావితమైందని పేర్కొంటూ, మార్పుకు నాయకత్వం వహించాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి, భద్రత, శ్రేయస్సు కోసం బీజేపీ రోడ్‌మ్యాప్‌ను కూడా ఆయన వివరించి, శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారసత్వాన్ని గుర్తుచేసుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్, ఆరాంబాగ్‌లలో ప్రధాని మోదీ ప్రభావవంతమైన ర్యాలీలు

April 26th, 01:24 pm

పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి, భద్రత, శ్రేయస్సు కోసం బీజేపీ రోడ్‌మ్యాప్‌ను వివరిస్తూ, టీఎంసీ అవినీతి, సిండికేట్ రాజ్, భయ రాజకీయాలకు వ్యతిరేకంగా గట్టి సందేశం ఇస్తూ, బంగావ్, ఆరాంబాగ్‌లలో జరిగిన భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 14th, 02:15 pm

గవర్నర్ ఆర్ ఎన్ రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శంతను ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, నా తోటి పార్లమెంటు సభ్యులు శమిక్ భట్టాచార్య గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, సోదరీ సోదరులారా!

PM Modi lays foundation stone, inaugurates various development works worth Rs.18,700 crore in Kolkata, West Bengal

March 14th, 02:00 pm

Inaugurating development works worth over ₹18,000 crore in Kolkata, West Bengal, PM Modi said a new chapter of development is being written for the state and Eastern India. The projects span key sectors such as roads, railways and ports. These initiatives will benefit farmers, traders, entrepreneurs, students and every section of society, laying the foundation for a developed Bengal.

హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా 2026లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 28th, 06:00 pm

కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రులు రామ్మోహన్ నాయుడు, మురళీధర్ మొహోల్, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడి వచ్చిన గౌరవ మంత్రులకు, అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ దిగ్గజాలకు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

January 28th, 05:45 pm

తెలంగాణలోని హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామిక దిగ్గజాలకు, నిపుణులకు, పెట్టుబడిదారులకు సాదరంగా స్వాగతం పలికారు. విమానయాన రంగంలో రాబోయే కాలం కొత్త ఆశయాలతో నిండి ఉంటుందని, ఇందులో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని ఆయన పేర్కొన్నారు. విమానాల తయారీ, పైలట్ శిక్షణ, అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ వంటి రంగాల్లో భారత్ ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తోందని ప్రధాని వివరించారు. ప్రపంచ విమానయాన మార్కెట్లో భారతదేశం ఇప్పుడు ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని ఆయన చెప్పారు. విమానయాన రంగానికి చెందిన భాగస్వాములందరికీ ఈ 'వింగ్స్ ఇండియా' సదస్సు ఒక ముఖ్యమైన వేదిక అని ప్రధాని తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 18th, 03:30 pm

నిన్న నేను మాల్దాలో ఉన్నాను, ఈరోజు హుగ్లీలో మీ అందరి మధ్యకు వచ్చే భాగ్యం కలిగింది. వికసిత భారత్ కోసం తూర్పు భారత్ అభివృద్ధి - లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. నిన్నటి, నేటి కార్యక్రమాలు ఈ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ క్రమంలో, పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే, అంకితం ఇచ్చే అవకాశం నాకు లభించింది. నిన్న దేశ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమైంది. బెంగాల్‌కు సుమారు అరడజను కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందాయి. ఈరోజు మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక రైలు నా పార్లమెంటు నియోజకవర్గం కాశీ బనారస్‌తో బెంగాల్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇవే కాకుండా, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా మొదలయ్యాయి. అంటే, పశ్చిమ బెంగాల్ రైలు అనుసంధానానికి గత 24 గంటలు అపూర్వమైనవి. బహుశా గత 100 ఏళ్లలో 24 గంటల వ్యవధిలో ఇంతటి పని జరగలేదు.

పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో 830 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

January 18th, 03:00 pm

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా సింగూర్‌లో ఈ రోజు 830 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయగా, కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నిన్న తాను మాల్దాలో ఉండగా ఈ రోజు హుగ్లీ ప్రజల మధ్య ఉండే భాగ్యం కలిగిందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశం కోసం తూర్పు భారత్‌ అభివృద్ధి అత్యంత ఆవశ్యకమని.. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన ప్రధానంగా చెప్పారు. నిన్నటి, నేటి కార్యక్రమాలు ఈ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని ప్రధానమంత్రి అన్నారు.

ముంబైలో జరిగిన మారిటైమ్ లీడర్స్ కాంక్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

October 29th, 04:09 pm

మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు సర్బానంద సోనోవాల్ జీ, శంతను ఠాకూర్ జీ, కీర్తి వర్ధన్ సింగ్ జీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే జీ, అజిత్ పవార్ జీ, షిప్పింగ్, ఇతర పరిశ్రమల నాయకులు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, పెద్దలు,

PM Modi addresses Maritime Leaders Conclave at India Maritime Week 2025 in Mumbai

October 29th, 04:08 pm

In his address at the Maritime Leaders Conclave in Mumbai, PM Modi highlighted that MoUs worth lakhs of crores of rupees have been signed in the shipping sector. The PM stated that India has taken major steps towards next-gen reforms in the maritime sector this year. He highlighted Chhatrapati Shivaji Maharaj’s vision that the seas are not boundaries but gateways to opportunity, and stated that India is moving forward with the same thinking.

రానున్న దశాబ్దంపై భారత్‌-జపాన్ ఉమ్మడి దృక్కోణం: ఎనిమిది లక్ష్యాలతో ప్రత్యేక వ్యూహాత్మక-ప్రపంచ భాగస్వామ్యానికి సారథ్యం

August 29th, 07:11 pm

ఇండో-పసిఫిక్ ప్రాంతంపై భార‌త్‌, జ‌పాన్‌ దేశాలది ఉమ్మ‌డి దృక్కోణం. ఈ ప్రాంతం చట్టబద్ధ పాలన సహిత స్వేచ్ఛ, సౌహార్ద‌ం, శాంతి, సౌభాగ్యాలతో ఘ‌ర్ష‌ణ ర‌హితంగా పురోగ‌మించాల‌న్న‌ది రెండు దేశాల అభిమతం. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర సహాయకారిగా మెలగుతాయి. వనరులు, సాంకేతికత, ఉత్పత్తి వ్యయం రీత్యా పోటీతత్వంలో రెండింటికీ ప్రత్యేక బలాలున్నాయి. దీంతోపాటు సుదీర్ఘ సుహృద్భావ, చారిత్రక స్నేహబంధం ఉన్నందువల్ల ఇకపైనా జంటగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే దశాబ్దంలో మన దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్పులు, అవకాశాలు అందిరానున్నాయి. వీటన్నిటి సద్వినియోగం దిశగా సంయుక్త సారథ్యానికి మేం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ప్రకటిస్తున్నాం. జాతీయ లక్ష్యాల సాధనతో్పాటు మన దేశాలను, భవిష్యత్తరం పౌరులను మునుపటికన్నా చేరువ చేయడానికి మా నాయకత్వం తోడ్పడుతుంది.

ఆంధ్రప్రదేశ్ (తిరుపతి), ఛత్తీస్ గఢ్ (భిలాయ్), జమ్మూ కాశ్మీర్ (జమ్మూ), కర్ణాటక (ధార్వాడ్), కేరళ (పలక్కడ్) లోని అయిదు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల విద్యా, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం

May 07th, 12:10 pm

ఆంధ్రప్రదేశ్ (ఐఐటి తిరుపతి), కేరళ (ఐఐటి పలక్కడ్), ఛత్తీస్‌గఢ్ (ఐఐటి భిలాయి), జమ్మూ కాశ్మీర్ (ఐఐటి జమ్మూ), కర్ణాటక (ఐఐటి ధార్వాడ్) లలో ఏర్పాటైన అయిదు కొత్త ఐఐటీలలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు (ఫేజ్-బి నిర్మాణం) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రోజ్ గార్ మేళా కింద 51,000 పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 26th, 11:23 am

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 51,000 మందికి పైగా యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను ఈరోజు జారీ చేశాం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మీ యువతకు బాధ్యతల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం మీ కర్తవ్యం. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మీ కర్తవ్యం. కార్మికుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవడం మీ కర్తవ్యం. మీరు మీ విధులను ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రయాణంపై దాని ప్రభావం మరింత గణనీయంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారని నేను విశ్వసిస్తున్నాను.

ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

April 26th, 11:00 am

ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన వారికి 51,000కి పైగా నియామక పత్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించారు. భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో యువతకు కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్గత భద్రతను పెంపొందించటం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడటం, కార్మికుల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు తీసుకురావడం వీరి బాధ్యతలని పేర్కొన్నారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో చూపించే చిత్తశుద్ధి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రధానంగా పేర్కొన్నారు. విధుల నిర్వహించే విషయంలో ఈ యువత అత్యంత అంకితభావంతో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 15th, 11:08 am

జనవరి 15వ తేదీని సైనిక దినోత్సవంగా జరుపుకొంటాం. దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి వీర సైనికుడికి నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను, ఈ రోజున భరతమాత రక్షణలో నిమగ్నమైన సైనికులను, మహిళలను నేను అభినందిస్తున్నాను.

PM Modi dedicates frontline naval combatants INS Surat, INS Nilgiri & INS Vaghsheer to the nation

January 15th, 10:30 am

PM Modi dedicated three frontline naval combatants, INS Surat, INS Nilgiri and INS Vaghsheer, to the nation on their commissioning at the Naval Dockyard in Mumbai. “It is for the first time that the tri-commissioning of a destroyer, frigate and submarine was being done”, highlighted the Prime Minister. He emphasised that it was also a matter of pride that all three frontline platforms were made in India.