నిరంతర సముద్ర బీమా రక్షణను సులభతరం చేయడానికి రూ. 12,980 కోట్ల సార్వభౌమ హామీతో 'భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్' (బీఎంఐ పూల్) ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి వర్గం

April 18th, 03:10 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్' (బీఎంఐ పూల్) ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం లభించింది. నిరంతర సముద్ర బీమా కవరేజీని కల్పించేందుకు రూ. 12,980 కోట్ల సార్వభౌమ హామీతో ఈ పూల్ ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయంగా సముద్ర మార్గాల్లో అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ భారతీయ వాణిజ్యానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటమే దీని ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ ఓడరేవుల నుంచి భారతీయ ఓడరేవులకు సరుకు రవాణా చేసే నౌకలతో పాటు భారత్‌ నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు సరుకు రవాణా చేసే నౌకలకు అస్థిరమైన సముద్ర మార్గాల్లో ప్రయాణించేటప్పుడు కూడా సరసమైన ధరలో బీమా సౌకర్యం అందుబాటులో ఉండేలా ఈ పూల్ భరోసా ఇస్తుంది.

అసోంలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

February 18th, 12:31 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అస‌మ్ లో ‘మ‌హాబాహు-బ్రహ్మ‌పుత్ర‌’ ను ప్రారంభించారు; రెండు వంతెన‌ లకు ఆయన శంకుస్థాప‌న కూడా చేశారు. ఈ సందర్బం లో రోడ్డు ర‌వాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, చ‌ట్టం & న్యాయం, క‌మ్యూనికేశన్స్, ఎల‌క్ట్రానిక్స్ & స‌మాచార‌ సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర‌ మంత్రి, నౌకాశ్ర‌యాలు, శిప్పింగ్‌, జ‌ల‌ మార్గాల శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త‌) ల‌తో పాటు అస‌మ్‌, మేఘాల‌య ల ముఖ్య‌మంత్రులు కూడా పాల్గొన్నారు.

అస‌మ్ లో ‘మ‌హాబాహు-బ్రహ్మ‌పుత్ర‌’ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; రెండు వంతెన‌ లకు ఆయ‌న శంకుస్థాప‌న కూడా చేశారు

February 18th, 12:30 pm