జోహాన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
November 23rd, 09:41 pm
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రి గౌరవనీయ శ్రీ మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ఇద్దరూ భారత్, కెనడా భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు.Joint statement by the Government of India, the Government of Australia and the Government of Canada
November 22nd, 09:21 pm
India, Australia, and Canada have agreed to enter into a new trilateral partnership: the Australia-Canada-India Technology and Innovation (ACITI) Partnership. The three sides agreed to strengthen their ambition in cooperation on critical and emerging technologies. The Partnership will also examine the development and mass adoption of artificial intelligence to improve citizens' lives.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైన కెనడా విదేశాంగ మంత్రి
October 13th, 02:42 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు సమావేశమయ్యారు.ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9వ సంచికను అక్టోబరు 8న ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 07th, 10:27 am
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 పరంపరలో 9వ సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8న ఉదయం సుమారు 9:45 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభిస్తారు. ఇది ఆసియాలో టెలికం, మీడియా, టెక్నాలజీ రంగాలకు సంబంధించిన భారీ కార్యక్రమం.‘స్థానికులకు స్వరం’ – మన్ కీ బాత్ లో, ప్రధాన మంత్రి మోదీ స్వదేశీ గర్వంతో పండుగలను జరుపుకోవాలని కోరారు
August 31st, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన వారికి సహాయం అందించిన భద్రతా దళాలు మరియు పౌరులకు ప్రధాన మంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ & కాశ్మీర్‌లో క్రీడా కార్యక్రమాలు, సౌరశక్తి, ‘ఆపరేషన్ పోలో’ మరియు భారతీయ సంస్కృతి యొక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. పండుగ సీజన్‌లో మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు పరిశుభ్రతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని పౌరులకు గుర్తు చేశారు.బీహార్ లోని శివాన్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 20th, 01:00 pm
అందరికీ నమస్కారం. బాబా మహేంద్రనాథ్, బాబా హంసనాథ్, సోహగరా ధామ్, తావే భవానీమాత, అంబికా భవానీ మాత, భారత మొదటి రాష్ట్రపతి దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ల పవిత్ర భూమిపై మీ అందరికి హార్దిక స్వాగతం!బీహార్లోని సివాన్లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 20th, 12:00 pm
బీహార్లోని సివాన్లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాబా మహేంద్రనాథ్, బాబా హన్స్‌నాథ్‌లను స్మరించుకున్నారు. అలాగే పవిత్రమైన సోగర ధామ్ ప్రాశస్థ్యాన్ని గుర్తుచేశారు. థావే భవానీ మాత, అంబికా భవానీ మాతకు వందనం సమర్పించారు. దేశానికి తొలి రాష్ట్రపతిగా సేవలందించిన దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను ఆయన గౌరవపురస్సరంగా తలచుకున్నారు.జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడితో భేటీ అయిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 18th, 05:03 pm
జూన్ 17న కననాస్కిస్ లో జరిగిన జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ఆంటోనియో కోస్టాతో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, అర్ధవంతమైన చర్చలు జరిపారు.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
June 18th, 03:17 pm
కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యాంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, గ్రీన్ హైడ్రోజన్, నౌకా నిర్మాణంతో పాటు మరిన్ని రంగాల్లో భారత్, కొరియా రిపబ్లిక్ కలసి పనిచేయాలని కోరుకొంటున్నాయని శ్రీ మోదీ అన్నారు.జీ-7 సమావేశాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాధ్యక్షులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 03:05 pm
జూన్ 17న కెనడా కననాస్కిస్ లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలతో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజా, బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వాతో భేటీ కావడమే కాకుండా, సుహృద్భావపూర్వక వాతావరణంలో అర్ధవంతంగా చర్చలు జరిగాయి.జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కమిషన్ అధ్యక్షురాలితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 03:04 pm
జూన్ 17న కెనడా… కననాస్కిస్ లో జరిగిన జీ-7 సమావేశాల్లో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలవంతమైన చర్చలు నిర్వహించారు.జీ-7 సమావేశాల నేపథ్యంలో జపాన్ ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 18th, 03:00 pm
జూన్ 17న కెనడా కననాస్కిస్ వేదికగా జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని శ్రీ షిగేరు యిషిబాతో సమావేశమై లోతైన చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరిన్ని రంగాలకు విస్తరించాలన్న నిబద్ధతకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు.జీ-7 సమావేశాల నేపథ్యంలో ఇటలీ ప్రధానమంత్రితో భేటీ అయిన ప్రధానమంత్రి శ్రీ మోదీ
June 18th, 02:59 pm
కెనడా దేశం కననాస్కిస్ లో జూన్ 17న జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ మోదీ, ఇటలీతో బలమైన స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని, ఈ బంధం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం కలిగించగలదని పేర్కొన్నారు.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
June 18th, 02:55 pm
కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ కైర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్, బ్రిటన్‌ల సంబంధాలు దృఢతరంగా మారుతున్నాయనీ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మన రెండు దేశాలూ ఎంతగా పురోగమించిందీ ఈ పరిణామం చాటిచెబుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షునితో ప్రధానమంత్రి మాటామంతీ
June 18th, 02:51 pm
ఈ నెల 17న కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 02:49 pm
ఈ నెల 17వ తేదీన కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంధోనీ అల్బనీజ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడి మధ్య టెలిఫోన్ సంభాషణపై విదేశాంగ కార్యదర్శి ప్రకటన
June 18th, 12:32 pm
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావాల్సి ఉంది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే అమెరికాకు తిరిగిరావాల్సి వచ్చింది. దీంతో సమావేశం జరగలేదు.జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 18th, 11:15 am
జీ-7 శిఖరాగ్ర సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి.. అపూర్వ స్వాగతం పలికిన ప్రధానమంత్రి కార్నీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీ-7 కూటమి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంలో మా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.Prime Minister Narendra Modi addresses the G7 Outreach Session
June 18th, 11:13 am
PM Modi participated in the Outreach Session of the G7 Summit in Kananaskis and addressed a Session on 'Energy Security.' The PM highlighted that energy security was among the leading challenges facing future generations. While elaborating on India's commitment to inclusive growth, he noted that availability, accessibility, affordability and acceptability were the principles that underpinned India's approach to energy security.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 08:02 am
అల్బెర్టాలోని కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఈ రోజు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.