Prime Minister Narendra Modi to inaugurate Seva Teerth and Kartavya Bhavan-1 & 2

February 12th, 12:02 pm

PM Modi will unveil the name of the Seva Teerth building complex, formally inaugurate Seva Teerth and Kartavya Bhavan-1 & 2 and address a programme on 13 February 2026. The inauguration marks a transformative milestone in India’s administrative governance architecture and reflects the PM’s commitment to building a modern, efficient, accessible and citizen-centric governance ecosystem.

ప్రగతి @ 50: చురుకైన, సాంకేతికత ఆధారిత పాలనను సంస్థాగతీకరించడం

January 02nd, 07:30 pm

ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ప్రగతి యంత్రాంగ (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) సమీక్షా సమావేశ ఫలితాలను కేబినెట్ కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శులు ఈ రోజు మీడియాకు వివరించారు.

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

May 08th, 02:17 pm

జాతిభద్రత విషయమై ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దేశం మొత్తంలో అప్రమత్తత, అంతర మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం వంటి ముఖ్యమైన అంశాలను సమీక్షిస్తూ... వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. మంత్రిత్వశాఖలూ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సందిగ్ధానికి తావులేకుండా చక్కటి సమన్వయం ఉండాలనీ, వ్యవస్థ మొత్తం అత్యంత పటిష్టంగా ఉండాలనీ ఆయన గట్టిగా సూచించారు.

నాలుగేళ్లపాటు ఇ-కోర్టుల మూడో దశకు మంత్రిమండలి ఆమోదం

September 13th, 03:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ రూ.7,210 కోట్ల అంచనా వ్య‌యంతో (2023 నుంచి) నాలుగేళ్లపాటు కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఇ-కోర్టుల ప్రాజెక్ట్ మూడోదశ (ఫేజ్-III)కు ఆమోదం తెలిపింది. గౌరవనీయ ప్రధాని శ్రీ మోదీ ప్రబోధిత “సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌’ సూత్రానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞాన సద్వినియోగం ద్వారా ప్రజలకు న్యాయ సౌలభ్యం కల్పనకు ఉద్యమ తరహాలో ప్రవేశపెట్టిన కీలక పథకం ‘ఇ-కోర్టులు’. భారత న్యాయవ్యవస్థకు ‘ఐసిటి’ సామర్థ్యం కల్పించిన ఈ పథకం జాతీయ ఇ-పరిపాలన ప్రణాళికలో భాగంగా 2007 నుంచి అమలవుతుండగా దీని రెండో దశ (ఫేజ్‌-II) 2023తో ముగిసింది. ఈ నేపథ్యంలో ‘సౌలభ్యం-సార్వజనీనత’ ప్రాతిపదికగా మూడో దశకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

గోధుమల సరఫరా, నిలవలు మరియు ఎగుమతుల స్థితి పై సమీక్ష కోసం జరిగినసమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

May 05th, 09:01 pm

గోధుమల సరఫరా, నిలవ మరియు ఎగుమతుల కు సంబంధించిన వివిధ అంశాల ను సమీక్షించడం కోసం ఏర్పాటైన ఒక సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

జవాద్ చక్రవాతాన్నిఎదుర్కోవడం కోసం సన్నద్ధత ను సమీక్షించడం కోసం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికిఅధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

December 02nd, 03:39 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సైక్లోన్ జవాద్ ఏర్పడే అవకాశం వల్ల తలెత్తే స్థితి ని ఎదుర్కోవడం కోసం రాష్ట్రాలు, కేంద్రం లోని మంత్రిత్వ శాఖలు మరియు సంబంధిత ఏజెన్సీస్ సన్నద్ధం అయ్యాయా అనేది సమీక్షించడానికి గాను ఈ రోజు న జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.

దేశవ్యాప్తం గా ఆక్సీజన్ సరఫరా ను పెంచడం అనే అంశం పై సమీక్షను నిర్వహించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

July 09th, 01:10 pm

దేశమంతటా ఆక్సీజన్ ఉత్పత్తి ని పెంచడం గురించి, ఆక్సీజన్ లభ్యత లో పురోగతి ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సమీక్ష ను నిర్వహించారు.

దేశంలో టీకాల కార్యక్రమం ప్రగతిపై ప్రధానమంత్రి సమీక్ష

June 04th, 08:41 pm

దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమ ప్రగతిపై సమీక్షకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీకాల కార్యక్రమంలోని వివిధ అంశాలపై అధికారులు ఆయనకు సమగ్రంగా నివేదించారు. దేశంలో ప్రస్తుతం టీకాల లభ్యత, ఉత్పత్తి పెంపు దిశగా మార్గ ప్రణాళిక గురించి ప్రధానికి వారు వివరించారు. టీకాల ఉత్పత్తి పెంచడంలో వివిధ సంస్థలకు చేయూతనిస్తూ చేపట్టిన చర్యలను కూడా ఆయనకు తెలిపారు. ఈ మేరకు మరిన్ని ఉత్పత్తి యూనిట్లు, ముడి పదార్థాల సరఫరా, ఆర్థిక తోడ్పాటు వగైరాల రూపంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా సహాయం అందిస్తున్నదని విశదీకరించారు.

సిబిఎస్‌ఇ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు

June 01st, 07:25 pm

సిబిఎస్‌ఇ పన్నెండో తరగతి పరీక్షలకు సంబంధించి సమీక్షా సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, వివిధ భాగస్వాములతో ఇప్పటివరకు నిర్వహించిన విస్తృతమైన సంప్రదింపులపై అధికారులు సవివరంగా తెలియజేసారు.

‘తౌఁటే’ తుపాను సంసిద్ధతపై ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

May 15th, 06:54 pm

‘తౌఁటే’ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడంపై సంబంధిత రాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

దేశంలో కోవిడ్-19 పరిస్థితులపై ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

April 27th, 08:25 pm

దేశవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితులపై సమీక్షకు నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ లభ్యత, మందులు, మౌలిక ఆరోగ్య సదుపాయాలు వగైరాలకు సంబంధించి దేశంలో ప్రస్తుత పరిస్థితులను ఆయన పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా పెంపు నిమిత్తం ఏర్పాటైన సాధికార బృందం దేశమంతటా ఆక్సిజన్ లభ్యత, సరఫరా దిశగా సాగుతున్న కృషి గురించి ప్రధానమంత్రికి వివరించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపు పెంచడం గురించి ప్రధానికి తెలియజేసింది. దేశంలో 2020 ఆగస్టు నాటికి ద్రవీకృత వైద్య ఆక్సిజన్ (ఎల్ఎంఒ) ఉత్పాదన రోజుకు 5,700 మెట్రిక్ టన్నులు కాగా, ప్రస్తుతం (2021 ఏప్రిల్ 25 నాటికి) 8922 మెట్రిక్ టన్నులకు పెరగడం గురించి సమావేశం చర్చించింది. ఈ మేరకు నెలాఖరుకల్లా దేశీయంగా ఉత్పాదన నిత్యం 9250 మెట్రిక్ టన్నులు దాటుతుందని అంచనా వేసింది.

ఫార్మా పరిశ్రమకు చెందిన నాయకులతో సంభాషించిన – ప్రధానమంత్రి

April 19th, 08:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఔషధ పరిశ్రమలకు చెందిన నాయకుల తో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం లో ఫార్మా రంగం పోషించిన కీలక పాత్రను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.

కోవిడ్‌-19పై ప్ర‌జారోగ్య శాఖ సంసిద్ధ‌త‌పై ప్ర‌ధాన‌మంత్రి స‌మీక్ష

April 17th, 09:37 pm

ప్ర‌స్తుత కోవిడ్-19 మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వాల సంసిద్ధ‌త‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ త‌న అధ్య‌క్ష‌త‌న‌ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఔష‌ధాలు, ఆక్సిజెన్‌, వెంటిలేట‌ర్లు, వ్యాక్సినేష‌న్ ల‌భ్య‌త స‌హా ప‌లు అంశాల‌ను ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

PM chaired review meeting on Covid-19 pandemic preparations

July 11th, 02:06 pm

PM Modi reviewed the Covid-19 situation in the country. The PM directed that we must reiterate the need to observe personal hygiene and social discipline in public places.

Prime Minister reviews India’s fight against Covid-19

June 13th, 06:26 pm

PM Modi held a meeting with senior ministers and officials to review India’s response to Covid-19 pandemic. The national level status and preparation in the context of the pandemic were discussed. The meeting also took stock of situation in different states and union territories including Delhi.

PM at the helm of India’s Fight against COVID-19

March 29th, 10:00 am

Prime Minister Shri Narendra Modi is continuing his interactions with various stakeholders in India’s fight against COVID-19.

PM interacts with medical fraternity - doctors, nurses and lab technicians

March 24th, 10:00 pm

Prime Minister Shri Narendra Modi today interacted with the medical fraternity including doctors, nurses and lab technicians from all over the country via video conference.

కోవిడ్-19 పోరాటంలో భాగస్వాములందరితోను ప్రధానమంత్రి సంప్రదింపులు కొనసాగింపు

March 23rd, 07:20 pm

వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా శ్రీ మోదీ ఎలక్ర్టానిక్ మీడియా బృందాలు, భారత కార్పొరేట్ రంగం ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు.

పారిశ్రామిక‌ సంస్థ‌ల ప్ర‌తినిధులనుద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగం

March 23rd, 07:15 pm

ఏక‌తాటిపై నిలిచి అవ్య‌వ‌స్థీకృత రంగ అవ‌స‌రాల గురించి మాట్లాడార‌ని, ఇది ఎంతో గొప్ప విష‌య‌మ‌ని మెచ్చుకుంటూ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ పారిశ్రామిక రంగ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను ప్ర‌శంసించారు. ఆర్ధిక రంగంలో అంద‌రినీ క‌లుపుకొని పోతూ ఒక కొత్త ఉషోద‌యాన్ని ఆవిష్క‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇంటినుంచే ప‌ని చేయ‌డాన్ని ప్రోత్స‌హించడం మంచి నిర్ణ‌య‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఒకే చోటకు చేర‌కుండా ఇంటికి ప‌రిమితం చేయ‌డ‌మ‌నేది (సోష‌ల్ డిస్టెన్సింగ్‌) కోవిడ్ 19పై చేస్తున్న పోరాటంలో అత్యంత శ‌క్తివంత‌మైన ఆయుధ‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. కోవిడ్ -19 కార‌ణంగా ఆయా వ్యాపారాలు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ ఏ సంస్థ కూడా త‌మ ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించ‌కూడ‌ద‌ని ఈ సందర్భంగా ప్ర‌ధాని గ‌ట్టిగా కోరారు. కోవిడ్ -19పై ప్ర‌ధాని నాయ‌క‌త్వంలో జ‌రుగుతున్న పోరాటాన్ని పారిశ్రామిక సంస్థ‌ల ప్ర‌తినిధులు ప్ర‌శంసించారు. ఈ స‌వాల్‌ను ఎదుర్కోవ‌డానికిగాను త‌మ ఆలోచ‌న‌ల్ని, అభిప్రాయాల‌ను ప్ర‌ధానితో పంచుకున్నారు.

Cabinet Secretary reviews COVID-19 status with Chief Secretaries of States; important decisions taken to check the disease

March 22nd, 03:48 pm

A high level meeting was held today morning with Chief Secretaries of all the States by the Cabinet Secretary and the Principal Secretary to the Prime Minister. All the Chief Secretaries informed that there is overwhelming and spontaneous response to the call for Janta Curfew given by the Hon’ble Prime Minister.