PM chairs CCS Meeting to review the situation in context of ongoing West Asia Conflict

July 30th, 07:38 pm

Prime Minister Shri Narendra Modi today chaired a meeting of the Cabinet Committee on Security (CSS) to review the situation in the context of ongoing West Asia conflict and measures taken by various Ministries and Departments. This was the 4th special CCS meeting on the issue.

టీఎంసీ అండతో తలదాచుకున్న నేరస్తులకు శిక్ష తప్పదు: పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో ప్రధాని మోదీ

April 24th, 11:45 am

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ మొదటి దశ పోలింగ్‌లో ప్రజల భారీ భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. మొదటి దశలో టీఎంసీ (TMC) కనీసం ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు; అలాగే, అభివృద్ధి చెందిన బెంగాల్ కోసం బీజేపీకి నిర్ణయాత్మక తీర్పునివ్వాలని రెండో దశ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జాదవ్‌పూర్ యూనివర్సిటీ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, ప్రజలను ప్రభావితం చేస్తున్న స్థానిక సమస్యల గురించి కూడా ప్రస్తావించారు.

టీఎంసీ పాలనలో బెంగాల్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు నాశనమయ్యాయి: డమ్ డమ్‌లో ప్రధాని మోదీ

April 24th, 11:35 am

పశ్చిమ బెంగాల్‌లోని డమ్ డమ్‌లో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆయన చేసిన ఉత్సాహభరితమైన ప్రసంగం బెంగాల్ ప్రజల మదిలో బలంగా నాటుకుపోయింది. స్పష్టంగా కనిపిస్తున్న మార్పు పవనానికి ఆయన పౌరులను అభినందించారు. మొదటి దశ పోలింగ్ ఇప్పటికే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో నిర్ణయాత్మక మార్పుకు సంకేతాలు ఇచ్చిందని ఆయన నొక్కి చెప్పారు.

డమ్ డమ్‌ మరియు జాదవ్‌పూర్‌లలో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగాలు

April 24th, 11:30 am

పశ్చిమ బెంగాల్‌లోని దు డమ్ డమ్‌ మరియు జాదవ్‌పూర్‌లలో జరిగిన భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు; ఆయన చేసిన ఉత్సాహభరితమైన ప్రసంగాలు అక్కడి ప్రజలలో బలమైన స్పందనను కలిగించాయి. రాష్ట్రంలో కనిపిస్తున్న మార్పు గాలిని చూసి ప్రజలను అభినందించిన ఆయన, మొదటి దశ పోలింగ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ఒక నిర్ణయాత్మక మార్పుకు సంకేతంగా నిలిచిందని నొక్కి చెప్పారు.

కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణ దృష్ట్యా తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు పీఎం అధ్యక్షతన సీసీఎస్ సమావేశం

April 01st, 10:04 pm

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన లోక కల్యాణ్ మార్గ్, 7లో భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం జరిగింది. దీనిలో వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు చేపట్టిన చర్యలను సమీక్షించి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

‘ఈటీ నౌ’ అంత‌ర్జాతీయ వాణిజ్య స‌ద‌స్సు-2026లో ప్రధానమంత్రి ప్రసంగం

February 13th, 08:30 pm

ఈ అంతర్జాతీయ వాణిజ్య సదస్సుకు హాజరైన మీకందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు” అనే ఇతివృత్తం ప్రాతిపదికగా మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. వినీత్ గారి ప్రసంగం విన్న తర్వాత, నా పని చాలా సులభమైందని భావిస్తున్నాను. అయితే, నాదొక చిన్న అభ్యర్థన- మీకు దీనిపై ఇప్పటికే అవగాహన ఉంది కాబట్టి, కొన్ని సందర్భాల్లో అది ‘ఈటీ’లోనూ ప్రతిబింబిస్తూంటుంది.

‘ఈటీ నౌ’ అంత‌ర్జాతీయ వాణిజ్య స‌ద‌స్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

February 13th, 08:00 pm

న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభమైన ‘ఈటీ నౌ’ (ET Now) అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సదస్సుకు హాజరైన వారందరికీ తొలుత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సదస్సు ఇతివృత్తం “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు”ను ప్రస్తావిస్తూ- ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత దశాబ్దంలో అసాధారణ అవరోధాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. వీటిలో మహమ్మారి కరోనా సహా ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం వంటివి ప్రపంచ సమతౌల్యాన్ని అతలాకుతలం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి సంక్షోభాలే ఒక దేశ వాస్తవ శక్తిసామర్థ్యాలను తేటతెల్లం చేస్తాయని చెప్పారు. ఇలాంటి అవరోధాలెన్నో ఎదురైనా, ఒక దశాబ్ద కాలంలో బలమైన పనితీరు, ప్రజాస్వామ్య బలోపేతానికి సాగిన కృషి ఫలితంగా భారత్‌ అద్భుత ప్రగతి సాధించిందని సగర్వంగా ప్రకటించారు. గత దశాబ్దారంభంలో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ 11వ స్థానంలో ఉండేదని, గందరగోళ పరిస్థితుల నడుమ పతనం తప్పదేమోన్న ఆందోళన దోబూలాడేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. కానీ, గడ్డు కాలాన్ని అధిగమిస్తూ నేడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా శరవేగంతో పురోగమిస్తున్నదని చెప్పారు. ఈ పరిణమాశీల శతాబ్దానికి భారత్‌ కీలక మూలస్తంభంగా నిలుస్తుందని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఆ మేరకు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్‌ వాటా 16 శాతానికిపైగా ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అంతేగాక ఏటికేడు ఈ వాటా పెరుగుతూనే ఉంటుందన్న ఆశాభావం వెలిబుచ్చారు. అంతర్జాతీయ వృద్ధికి సారథ్యం వహిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకంగా ఆవిర్భవించగలదని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి అధ్యక్షతన సీసీఎస్ సమావేశం

April 23rd, 09:00 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో భద్రత విషయాల మంత్రివర్గ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించారు. పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.