సమ్రాట్ పెరుంబిడుగు ముథరైయర్ - II గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి

December 14th, 10:05 pm

సమ్రాట్ పెరుంబిడుగు ముథరైయర్ - II (సువరన్ మారన్) గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు విడుదల చేయడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.

రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సత్కార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 01st, 11:15 am

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సభలోని గౌరవనీయ సభ్యులందరికీ ఇది గర్వకారణమైన రోజు. ఈ సందర్భంగా మీకు మా సాదర స్వాగతం... మీ మార్గదర్శకత్వాన ఈ సభలో కీలకాంశాల చర్చకు, తద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగా మీ అమూల్య మార్గదర్శనం లభించడం మాకందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ మేరకు సభ తరపున, నా తరపున మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గౌరవనీయ సభ్యులందరూ ఈ ఎగువ (రాజ్య)సభ మర్యాదను సదా పరిరక్షిస్తారని, చైర్మన్‌గా మీ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుతారని వాగ్దానం చేస్తున్నాను.. ఇది మీకు నేనిస్తున్న హామీ.

రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌ సన్మాన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

December 01st, 11:00 am

రాజ్యసభకు తొలిసారి అధ్యక్షత వహించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు. గౌరవ రాజ్యసభ సభ్యులందరికీ ఈ రోజు గర్వకారణమని ప్రధానమంత్రి అభివర్ణించారు. చైర్మన్‌కు సాదర స్వాగతం పలుకుతూ.. “సభ తరఫున, నా తరఫున మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా అభినందనలు, శుభకామనలు. అత్యున్నతమైన ఈ సభా మర్యాదను గౌరవ సభ్యులందరూ ఎప్పటి మాదిరే కాపాడతారని, మీతో వారంతా విజ్ఞతతో వ్యవహరిస్తారని అనుకుంటున్నాను. ఇందుకు నాదీ హామీ” అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు ప్రధాని మీడియా ప్రకటన

December 01st, 10:15 am

పార్లమెంటు శీతాకాల సమావేశం కేవలం లాంఛనప్రాయం మాత్రమే కాదు. దేశం పురోగామి పథంలో దూసుకెళ్లేలా తీసుకుంటున్న చర్యలను ఈ శీతాకాల సమావేశాలు మరింత బలోపేతం చేస్తాయన్నది నా దృఢమైన నమ్మకం. భారత్ నిజంగా ప్రజాస్వామ్యాన్ని బతికించింది. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విశ్వాసం మరింత బలపడేలా.. ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఉత్సాహం ఎప్పటికప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలు, అక్కడ నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ శాతం మన ప్రజాస్వామ్యానికి అతి పెద్ద బలం. తల్లులూ, అక్కాచెల్లెళ్ల భాగస్వామ్యం పెరగడం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది, ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఒకవైపు ప్రజాస్వామ్యం బలోపేతమవుతోంది.. మరోవైపు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే మన ఆర్థిక వ్యవస్థ శక్తిమంతమవుతుండడాన్ని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ప్రజాస్వామ్యం విజయాలను సాధించగలదని భారత్ నిరూపించింది. నేడు భారత ఆర్థిక స్థితి కొత్త శిఖరాలకు చేరుకుంటున్న వేగం... మనలో కొత్త విశ్వాసాన్ని నింపడంతోపాటు, ‘వికసిత భారత్’ లక్ష్యం దిశగా పురోగమించేందుకు నవోత్తేజాన్ని అందిస్తోంది.

పార్లమెంటు శీతకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 01st, 10:00 am

శీతకాల సమావేశాలు-2025 ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంటు ప్రాంగణంలో ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశాలు కేవలం ఒక ఆనవాయితీ కాదు.. ఇవి శరవేగంగా ప్రగతి చెందే దిశగా సాగుతున్న దేశ ప్రయాణానికి ఒక కొత్త శక్తిని అందించే ముఖ్య సాధనమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ సమావేశాలు దేశ ప్రగతికి జోరును జోడించడానికి ప్రస్తుతం సాగుతున్న ప్రయత్నాలకు ఒక కొత్త శక్తిని అందిస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాన’’ని శ్రీ మోదీ అన్నారు.

తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం

November 19th, 07:01 pm

తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్. రవి, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ ఎల్. మురుగన్, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్. కె. రామస్వామి, వివిధ వ్యవసాయ సంస్థల నుంచి ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, నా ప్రియమైన రైతు సోదరీ, సోదరులు, డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన లక్షలాదిమంది రైతులు! మీ అందరికీ వణక్కం! నమస్కారం! ముందుగా, ఇక్కడ ఉన్న మీ అందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న నా రైతు సొదరీ, సోదరులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు ఒక గంట ఆలస్యం అయ్యింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నేను సత్య సాయిబాబాకు అంకితం చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తిలో ఉన్నాను. అక్కడ ఆ కార్యక్రమం ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం కొనసాగింది. అందుకే, నేను రావడానికి ఆలస్యం అయ్యింది. దీనివల్ల మీకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలి. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. అందుకే వినయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను.

తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ శిఖరాగ్ర సదస్సు-2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 19th, 02:30 pm

తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ రోజు దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సు-2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన శ్రీ మోదీ... కోయంబత్తూరు పవిత్ర గడ్డపై మరుధమలై మురుగన్‌కు నమస్కరిస్తూ తన వ్యాఖ్యలను ప్రారంభించారు. కోయంబత్తూరు సంస్కృతి, కరుణ, సృజనాత్మకతకు నిలయంగా... దక్షిణ భారత పారిశ్రామిక శక్తికి కేంద్రంగా ఉందన్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థకు నగర వస్త్ర రంగం ప్రధానంగా దోహదపడుతోందని ఆయన స్పష్టం చేశారు. కోయంబత్తూరుకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నందున ఈ నగరానికి మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

దీపావళి సందర్భంగా ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ

October 20th, 07:52 pm

దీపావళి సందర్భంగా, ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రి పండుగ శుభాకాంక్షలను తెలిపారు.

ప్రజాసేవలో 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు

October 09th, 01:42 pm

ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

భారత ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ

September 28th, 09:08 pm

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన భారత ఉపరాష్ట్రపతికి కృత‌జ్ఞత‌లు తెలిపిన ప్రధాని

September 17th, 09:22 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్.. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతికి ప్రధాని కృత‌జ్ఞత‌లను వ్యక్తం చేశారు. ‘‘ దేశప్రజలకు అంకితభావంతో సేవ చేయాలన్న సంకల్పాన్ని మీరందించిన శుభాకాంక్షలు మరింత బలపరుస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

భారత్ ఉపరాష్ట్రపతి‌గా శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి

September 12th, 12:16 pm

భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. శ్రీ రాధాకృష్ణన్ పదవీ కాలం ఫలప్రదం కావాలనీ, ప్రజలకు అంకితభావంతో ఆయన సేవ చేయాలని కోరుకుంటూ ఉపరాష్ట్రపతికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధానమంత్రి భేటీ

September 09th, 11:03 pm

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన శ్రీ సీపీ రాధాకృష్ణన్‌‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచినందుకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.

‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’లో శ్రీ సీపీ రాధాకృష్ణన్ గెలిచిన సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి‌

September 09th, 08:24 pm

‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’లో శ్రీ సీపీ రాధాకృష్ణన్ గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు.

ప్రధాని మోదీని కలిసిన ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

August 18th, 03:14 pm

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి తిరు సీపీ రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా తిరు సి.పి. రాధాకృష్ణన్ జీని

August 17th, 08:54 pm

భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా తిరు సి.పి. రాధాకృష్ణన్ జీని నామినేట్ చేసిన నిర్ణయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు స్వాగతించారు.

ప్రధానమంత్రితో మహారాష్ట్ర గవర్నర్ భేటీ

April 15th, 01:55 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈరోజు ప్రధానమంత్రితో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.

Governor of Maharashtra meets PM Modi

December 27th, 09:31 pm

The Governor of Maharashtra, Shri C. P. Radhakrishnan, met Prime Minister Shri Narendra Modi today.

మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 09th, 01:09 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదర సోదరీమణులారా...

మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన

October 09th, 01:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈవేళ మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీరణ ప‌నుల‌కు, షిర్డీ విమానాశ్రయంలో కొత్త స‌మీకృత టెర్మినల్ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్)-ముంబయి సహా మహారాష్ట్రలో విద్యా వ్య‌వ‌స్థ ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రానికి శ్రీ మోదీ ప్రారంభోత్స‌వం చేశారు.