The party governing Punjab today has neither clean intentions nor honesty: PM Modi in Jalandhar
July 17th, 04:31 pm
PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.PM addresses an energy-packed public rally in Jalandhar, Punjab
July 17th, 04:30 pm
PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.అధికారిక విందు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 11th, 12:32 pm
గతేడాది భారత్‌లో ప్రధాని లక్సన్ చేపట్టిన పర్యటన.. మన ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాల్లోనూ కొత్త శక్తిని నింపింది. ఆయన నాయకత్వమూ, స్పష్టమైన దార్శనికతా, దృఢమైన అంకితభావమూ.. భారత్, న్యూజిలాండ్ మధ్య ఉన్న స్నేహానికి కొత్త వేగాన్నీ, నూతన దిశనూ అందించాయి. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నాకంటే ముందు వచ్చిన వారు నా కోసం ఎన్నో మంచి పనులను వదిలి వెళ్లారు. వాటిని పూర్తి చేసే భాగ్యం నాకు దక్కిందని నేను తరచూ చెబుతూ ఉంటాను. మిత్రులారా, ఇది మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతోంది.''భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం'' ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధాని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
July 11th, 12:30 pm
భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ హాజరయ్యారు. రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక, క్రీడా, కళా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత్-న్యూజీలాండ్ వాణిజ్య కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 11th, 08:20 am
నేటి ఈ సమావేశానికి మీరంతా హాజరు కావడం న్యూజీలాండ్ వాణిజ్య, ఆవిష్కరణల స్ఫూర్తిని, దూరదృష్టి గల విధానాలను ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తరఫున మా 140 కోట్ల మంది ప్రజల ఆశలు-ఆకాంక్షలను నాతోపాటు తెచ్చాను.Prime Minister addresses business leaders in New Zealand
July 11th, 08:16 am
PM Modi interacted with leading CEOs and business leaders from India and New Zealand, highlighting the vast opportunities for trade, investment and innovation. He invited New Zealand businesses to partner India's growth story and help achieve the shared goal of doubling bilateral trade to NZD 7 billion by 2030.ఎకనామిక్ రోడ్‌మ్యాప్ వాణిజ్య సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
July 09th, 06:15 am
ఇప్పుడు ఈ సరికొత్త మార్గం ద్వారా పెట్టుబడులు, ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయి. ఈ భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉంది.Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event
July 09th, 06:00 am
PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.రాజస్థాన్‌లోని బలోత్రాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పీఎం ప్రసంగం
July 04th, 12:50 pm
ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.భారత్ - జపాన్ వాణిజ్య ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 02nd, 03:35 pm
కొద్దిసేపటి క్రితమే, హర్యానాలోని ఖార్ఖోడాలో మారుతి సుజుకి నూతన తయారీ కర్మాగారాన్ని మేం ప్రారంభించాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుజుకి కార్లలో దాదాపు మూడింట రెండు వంతులు భారతదేశంలోనే తయారవుతున్నాయి. అవి 100 పైగా దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి.ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల త్రివిధ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
June 21st, 12:51 pm
ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. యావత్ ప్రపంచమూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఇలాంటి విశిష్ట సందర్భంలో పవిత్ర బెంగాల్ భూమికి వచ్చే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. భారత దేశ ఆలోచనలకు కొత్త దిశను అందించిన, భారత దేశ పునరుజ్జీవాన్ని వేగవంతం చేసిన, సముద్ర మార్గాల ద్వారా శతాబ్దాలుగా దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించిన భూమి ఇది. ఈ రోజు ఇదే మట్టిపై ఆత్మనిర్భర్ భారత్, సురక్షిత భారత్, వికసిత భారత్ లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఓ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. కొంతసేపటి క్రితమే ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టాం. జూన్ 21ని ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవంగా నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. అదే రోజున భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక ఐఎన్ఎస్ సంశోధక్‌ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం కాకతాళీయం. ఈ సందర్భంగా భారత నౌకాదళానికి, ఈ ప్రాజెక్టులకు పనిచేసిన శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ, కార్మికులకూ, నా ప్రియమైన దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రే యుద్ధ నౌకలను నావికాదళంలోకి ప్రవేశపెట్టిన ప్రధాని
June 21st, 12:50 pm
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన మూడు యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. వీటిలో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ 'ఐఎన్ఎస్ దూనగిరి', పెద్ద సర్వే నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్’, జలాంతర్గామి నిరోధక నౌక 'ఐఎన్ఎస్ అగ్రే'లు ఉన్నాయి. ఈ నౌకల చేరిక భారత కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచడమే కాకుండా సముద్రాలపై నిఘాను బలోపేతం చేస్తుంది. అలాగే భౌగోళిక రాజకీయ ముప్పుల నుంచి మన తీరప్రాంత జలాలకు రక్షణను మరింత పటిష్ఠం చేస్తుంది. ఈ మూడు నౌకలను భారత నావికాదళానికి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో' రూపొందించగా కోల్‌కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్' (జీఆర్ఎస్‌ఈ) సంస్థ నిర్మించింది. వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్ఎంఈలతో కూడిన భారతీయ పరిశ్రమలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యాయి. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం లేదా పరికరాలను కలిగి ఉన్న ఈ నౌకలు 'ఆత్మనిర్భరత' పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.న్యూఢిల్లీలో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' ప్రోత్సాహకాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 19th, 05:15 pm
నా మంత్రివర్గ సహచరులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, సోదరి శోభ గారు, దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, సాంకేతికతతో అనుసంధానమైన ప్రముఖులందరికీ, నిర్వాహకులకు, ప్రస్తుతం 200 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన సుమారు రెండు లక్షల మందికి... నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారిశ్రామిక రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన యువ మిత్రుల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కింద సుమారు రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి
June 19th, 05:00 pm
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, భాగస్వాములనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. భారత యువతకు సాధికారత కల్పించడానికి, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎం-వీబీఆర్‌వై అమలులో భాగంగా... అన్ని రంగాలకు సామాజిక భద్రతా పరిధిని విస్తరించడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ ప్రోత్సాహకం దేశవ్యాప్తంగా 15 లక్షల ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడింది.స్లోవాక్ పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి సమావేశం
June 15th, 09:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి గౌరవనీయ రాబర్ట్ ఫికోతో కలిసి ఇవాళ ఆ దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో సమావేశమయ్యారు. రైల్వే, రక్షణ, ఆటోమోటివ్స్, ఇంధనం, ఐటీ, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత్ - స్లొవేకియా సంయుక్త ప్రకటన
June 15th, 05:32 pm
గౌరవ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరకు.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూన్ 15న అధికారికంగా ఆ దేశంలో పర్యటించారు.India and Slovakia are moving forward in close coordination on the global stage: PM Modi at the India-Slovakia Joint Press Meet
June 15th, 03:00 pm
At the joint press meet in Bratislava, PM Modi and Slovak Prime Minister Robert Fico announced the elevation of India-Slovakia ties to a Comprehensive Partnership. PM Modi highlighted growing cooperation in trade, technology, defence, space, digital innovation and mobility, saying the upgraded partnership reflects shared priorities, shared trust and a shared vision for the future.ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
June 14th, 04:36 pm
ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం
June 14th, 03:00 pm
ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.