గుజరాత్‌లోని నవసారిలో ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగం
September 08th, 02:45 pm
గుజరాత్‌లోని నవసారిలో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఆ ప్రాంతంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే, అనేక సంక్షేమ కార్యక్రమాలను నడిపిస్తున్న సేవా స్ఫూర్తిని, ప్రజా భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు.గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 04:30 pm
విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 04:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ప్రధాని మోదీ బహిరంగ సభకు తిరుచిరాపల్లికి భారీ సంఖ్యలో తరలివచ్చారు
March 11th, 06:00 pm
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరుడు సోదరుల శౌర్యాన్ని గుర్తుచేసుకుంటూ, కార్గిల్ యుద్ధంలో మేజర్ ఎం. శరవణన్ చేసిన త్యాగానికి నివాళులర్పిస్తూ, తిరుచిరాపల్లిని ధైర్యసాహసాల గడ్డగా కొనియాడారు. తిరుచి ధైర్యసాహసాల గడ్డ, అని ఆయన అన్నారు. తమిళనాడు సంస్కృతి, వారసత్వాన్ని కేంద్రం గర్వంగా గౌరవిస్తుందని కూడా ఆయన తెలిపారు. ఈ రాష్ట్ర పుత్రుడైన సి.పి. రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్నారని కూడా ఆయన హైలైట్ చేశారు.గుజరాత్‌లోని సూరత్ లో భారత బుల్లెట్ రైలు ప్రాజెక్టు బృందంతో ప్రధానమంత్రి సంభాషణ
November 16th, 03:50 pm
మీరేమనుకుంటున్నారు? ఈ వేగం ఫర్వాలేదా? మీరు నిర్దేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారమే పనిచేస్తున్నారా, లేక ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?నిర్మాణంలో ఉన్న... సూరత్ బుల్లెట్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 16th, 03:47 pm
గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న సందర్శించారు. ముంబయి–అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ పురోగతిని ఆయన సమీక్షించారు. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ బృందంతో మాట్లాడిన ఆయన… నిర్మాణ వేగం, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే విషయంలో పురోగతితో పాటు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్ట్ సజావుగా ముందుకు సాగుతోందని ప్రాజెక్ట్ నిర్మాణ సిబ్బంది ఆయనకు తెలిపారు.సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్‌ను రేపు సందర్శించనున్న ప్రధానమంత్రి
November 14th, 11:43 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు గుజరాత్‌లో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్‌ను సందర్శిస్తారు. ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ పురోగతినీ ఆయన సమీక్షిస్తారు. ఇది భారత అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు ద్వారా దేశం హై-స్పీడ్ కనెక్టివిటీ యుగంలోకి అడుగుపెడుతోంది.ముంబయి నగరంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 08th, 03:44 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ప్రజాదరణ గల ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ రాందాస్ అథవాలే, శ్రీ కె.ఆర్.నాయుడు, శ్రీ మురళీధర్ మొహోల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ఇతర మంత్రులు, భారత్‌లో జపాన్ రాయబారి శ్రీ కెయిచీ ఓనో, ఇతర ప్రముఖ అతిథులు, సోదరీసోదరులారా!నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
October 08th, 03:30 pm
నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మహారాష్ట్రలోని ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులనూ ప్రారంభించిన ఆయన వాటిని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి హజారైన ప్రముఖులందరినీ స్వాగతిస్తూ.. వారందరికీ శ్రీ మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన విజయదశమి, కోజాగరి పూర్ణిమ వేడుకలను ఆయన గుర్తు చేసుకున్నారు. రాబోయే దీపావళి పండగ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.రాజస్థాన్‌లోని బికనీర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
May 22nd, 12:00 pm
రాజస్థాన్ గవర్నర్ హరిభావు భాగ్డే, ప్రజాదరణ సొంతం చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ భజన్ లాల్, మాజీ ముఖ్యమంత్రి, సోదరి వసుంధర రాజే, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వనీ వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి, ప్రేమ్ చంద్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇతర మంత్రులకు, సహ పార్లమెంట్ సభ్యుడు మదన్ రాథోడ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియ సోదర, సోదరీమణులకు..రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ.26,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 22nd, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ.26,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వారినీ, అలాగే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆన్‌లైన్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారినీ స్వాగతించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రజాప్రతినిధుల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులకు, పౌరులకు అభినందనలు తెలియజేశారు.తమిళనాడులోని రామేశ్వరంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం
April 06th, 02:00 pm
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, డాక్టర్ ఎల్.మురుగన్ గారు… తమిళనాడు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదరసోదరీమణులారా నమస్కారం.తమిళనాడులోని రామేశ్వరంలో రూ.8,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 06th, 01:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని రామేశ్వరంలో రూ.8,300 కోట్లకు పైగా విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ముందుగా, ఆయన భారత్‌లో తొలి వెర్టికల్ లిఫ్ట్ సముద్ర రైలు వంతెన అయిన కొత్త పంబన్ రైలు వంతెనను ప్రారంభించారు. రోడ్ బ్రిడ్జ్ వద్ద నుంచి ఒక రైలును, ఓ నౌకను ప్రారంభించారు. వంతెన కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూశారు. అనంతరం రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈరోజు శ్రీరామనవమి శుభదినమని అన్నారు. ఈరోజు ఉదయం అయోధ్యలోని భవ్య రామ మందిరంలో రామ్ లల్లా నుదుటిన సూర్యుని దివ్య కిరణాలు మహత్తర తిలకంగా అభిషేకించాయని తెలిపారు. “భగవాన్ శ్రీరాముని జీవితం, ఆయన ఉత్తమ పాలనా స్ఫూర్తి దేశ నిర్మాణానికి ఒక గొప్ప పునాది” అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని సంగం నాటి సాహిత్యంలో కూడా భగవాన్ శ్రీరాముడి ప్రస్తావన ఉందని ఆయన అన్నారు. రామేశ్వరంలోని పవిత్ర భూమి నుంచి దేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.గుజరాత్‌లో సూరత్ ఆహార భద్రతా సంతృప్త ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 07th, 05:34 pm
పేరెన్నికగన్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయి పటేల్ గారు, కేంద్ర క్యాబినెట్ లో నా సహచరుడు శ్రీ సి.ఆర్. పాటిల్ గారూ, గుజరాత్ రాష్ట్ర మంత్రులు, ఇక్కడ హాజరైన ప్రజలు, సూరత్ లోని నా సోదరసోదరీమణులారా!సూరత్ సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
March 07th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సూరత్‌లోని లింబాయత్‌లో ‘సూరత్ సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో అర్హులైన 2.3 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు సహా వివిధ వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- నిరంతర కృషి, దాతృత్వ స్ఫూర్తి బలమైన పునాదిగాగల సూరత్ నగరం విశిష్టతను ప్రధాని కొనియాడారు. సమష్టి మద్దతు, సర్వజన ప్రగతికి నిర్వచనంగా రూపొందిన నగరం స్వభావాన్ని విస్మరించజాలమని వ్యాఖ్యానించారు.సిల్వస్సాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
March 07th, 03:00 pm
మీరంతా ఎలా ఉన్నారు? ఈ రోజు ఇక్కడ చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చిన కేంద్రపాలిత ప్రాంత సిబ్బందికి నా కృతజ్ఞతలు. చాలా మంది పాత మిత్రులకు నమస్కారం చెప్పే అవకాశం వచ్చింది.కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 02:45 pm
కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అంతకుముందు సిల్వస్సాలో నమో ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే కేంద్రపాలిత ప్రాంతంతో అనుసంధానం కావడానికి, సన్నిహితంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కడి అంకితభావం కలిగిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి ప్రజలతో తనకు ఉన్న సాన్నిహిత్యం, దీర్ఘకాలిక సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ ప్రాంతంతో తన అనుబంధం దశాబ్దాల నాటిదని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం సాధించిన పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే సామర్థ్యాన్ని ఆధునికత, పురోగతి దిశగా మార్చిన విధానాన్ని ఆయన వివరించారు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ‘వికసిత భారత్ యువ నాయక చర్చాగోష్ఠి-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 02:15 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీమన్సుఖ్ మాండవీయ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ జయంత్ చౌదరి, శ్రీమతి రక్షా ఖడ్సే, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు సహా దేశం నలుమూలల నుంచి హాజరైన నా యువ మిత్రులారా!‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 12th, 02:00 pm
స్వామి వివేకానంద జయంతిని స్మరించుకొంటూ పాటించే జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 3,000 మంది చురుకైన యువ నాయకులతో ఆయన మాట్లాడారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మన దేశంలో యువతలో గొప్ప హుషారైన శక్తి నిండి ఉందంటూ, ఈ శక్తి భారత్ మండపానికి జవ జీవాలనిచ్చిందన్నారు. దేశ యువతపై అపార నమ్మకం పెట్టుకొన్న స్వామి వివేకానందను యావత్తు జాతి స్మరించుకొంటూ, ఆయనకు నివాళులు అర్పిస్తోందని ప్రధాని అన్నారు. స్వామి వివేకానంద తన శిష్యులు యువతరం నుంచే వస్తారనీ, వారు ప్రతి ఒక్క సమస్యనూ సింహాల్లా పరిష్కరిస్తారని నమ్మారనీ శ్రీ మోదీ అన్నారు. యువతపై స్వామీజీ నమ్మకాన్ని ఉంచినట్లే స్వామీజీ పట్లా, ఆయన విశ్వాసాల పట్లా తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ప్రధాని తెలిపారు. ఆయననూ, ప్రత్యేకించి యువత విషయంలో ఆయనకున్న దృష్టి కోణాన్నీ తాను పూర్తిగా నమ్మినట్లు ప్రధానమంత్రి చెప్పారు. స్వామి వివేకానంద ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే, 21వ శతాబ్ది యువజనంలో శక్తి జాగృతమై, వారు చేస్తున్న చురుకైన ప్రయత్నాలను చూసి స్వామి వివేకానందలో ఒక కొత్త విశ్వాసం తొణికిసలాడేదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM
January 09th, 10:15 am
PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.