ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయిలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 29th, 11:35 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, బ్రజేష్ పాఠక్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జితిన్ ప్రసాద గారు, పంకజ్ చౌదరి గారు, యూపీ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన నా ప్రియమైన సోదరసోదరీలారా!ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో సరికొత్త 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
April 29th, 11:30 am
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో కొత్తగా నిర్మిస్తున్న 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. నరసింహ పుణ్యక్షేత్రానికి, కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ప్రవహిస్తున్న గంగామాత దివ్య సన్నిధికి నమస్కరిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతమంతా గంగామాత ఆధ్యాత్మిక శోభతో, మాతృత్వాన్ని పంచే జీవధారతో పునీతమైన పుణ్యక్షేత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి ఉత్తరప్రదేశ్‌కు లభించిన వరం. సాక్షాత్తు గంగామాత ఆశీర్వాదమే ఇది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి ద్వారా పవిత్ర పుణ్యక్షేత్రాలకు చేరుకునే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చని వివరించారు.ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 12:15 pm
ప్రారంభోత్సవం అయిపోయిందా? ప్రారంభోత్సవం అయిపోయిందా ? లేదు.. సగం పనే పూర్తయింది. నేను కేవలం ఆ కర్టెన్‌ను (తెరను) మాత్రమే తొలగించాను. కానీ నేడు ఇక్కడ ఉన్న మీ అందరి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీ మొబైల్ ఫోన్లను బయటకు తీయండి. మీ ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఆన్ చేయండి.. మీరే దీనిని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించినట్లుగా ఈ విమానాశ్రయాన్ని నేడు ప్రారంభిస్తున్నారు. ఇది మీ ఆస్తి, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ కష్టం.. అందుకే దీని ప్రారంభోత్సవం కూడా మీ చేతుల మీదుగానే జరుగుతోంది. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ మీ చేతులెత్తి, ఫ్లాష్‌లైట్లను పూర్తిగా చూపించండి. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయింది.సుమారు రూ. 11,200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ తొలి దశను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 28th, 12:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తపరుస్తూ.. వికసిత్ యూపీ, వికసిత్ భారత్ అభియాన్‌లో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. ఈ విమానాశ్రయానికి తానే శంకుస్థాపన చేసి, నేడు తానే ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ భారీ విమానాశ్రయం పేరు ఉత్తరప్రదేశ్‌తో ముడిపడి ఉండటం మరో విశేషమని చెబుతూ.. నన్ను ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపిన ఈ రాష్ట్ర గుర్తింపు, ఇప్పుడు ఈ అద్భుతమైన విమానాశ్రయంతో ముడిపడి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
January 25th, 02:00 pm
ఉత్తర ప్రదేశ్ గవర్నరు ఆనందీబెన్ పటేల్ గారు, గౌరవనీయ యుపి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ జీ, కేంద్ర మంత్రి శ్రీ వి.కె.సింగ్ గారు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర చౌదరి గారు, విశిష్ట ప్రతినిధులు, మరియు బులంద్ షహర్ యొక్క నా ప్రియమైన సోదర సోదరీమణులు!పంతొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయల కు పైచిలుకువిలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన కూడాచేసిన ప్రధాన మంత్రి
January 25th, 01:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 19,100 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో ఈ రోజు న ప్రారంభించడం తో పాటు శంకుస్థాపనలను కూడా చేశారు. ఆయా ప్రాజెక్టు లు రేల్ వే, రహదారులు, చమురు, ఇంకా గ్యాస్, పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.జనవరి 25 వ తేదీ నాడు బులంద్‌శహర్ ను మరియు జయ్‌పుర్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
January 24th, 05:46 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 25 వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ ను మరియు రాజస్థాన్ లో జయ్‌పుర్ ను సందర్శించనున్నారు. 19,100 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి బులంద్‌శహర్ లో మధ్యాహ్నం పూట దాదాపు గా ఒక గంట నలభై అయిదు నిమిషాల వేళ కు ప్రారంభించడం తో పాటు వాటి ని దేశ ప్రజల కు అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు లు రేల్ వే, రహదారి, చమురు మరియు గ్యాస్, ఇంకా పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.బీజేపీకి ఉత్తరప్రదేశ్ మొత్తం కుటుంబమే: ప్రధాని మోదీ
February 06th, 01:31 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని మధుర, ఆగ్రా & బులంద్‌షహర్‌లలో వర్చువల్ జన్ చౌపాల్‌ని ఉద్దేశించి ప్రసంగించారు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, ఆ ప్రముఖ గాయని మన దేశంలో ఎప్పటికీ పూరించలేని శూన్యతను మిగిల్చారని అన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మధుర, ఆగ్రా & బులంద్‌షహర్‌లలో వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు
February 06th, 01:30 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని మధుర, ఆగ్రా & బులంద్‌షహర్‌లలో వర్చువల్ జన్ చౌపాల్‌ని ఉద్దేశించి ప్రసంగించారు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, ఆ ప్రముఖ గాయని మన దేశంలో ఎప్పటికీ పూరించలేని శూన్యతను మిగిల్చారని అన్నారు.Prime Minister interacts with BJP Karyakartas from five Lok Sabha seats
November 03rd, 06:53 pm
The Prime Minister Narendra Modi, today interacted with BJP booth workers from Bulandshahr, Kota, Korba, Sikar and Tikamgarh Lok Sabha constituencies, through video conferencing. The interaction was sixth in the series of ‘Mera Booth Sabse Mazboot’ program.