రోజ్ గార్ మేళా కింద 51,000 పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 26th, 11:23 am

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 51,000 మందికి పైగా యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను ఈరోజు జారీ చేశాం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మీ యువతకు బాధ్యతల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం మీ కర్తవ్యం. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మీ కర్తవ్యం. కార్మికుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవడం మీ కర్తవ్యం. మీరు మీ విధులను ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రయాణంపై దాని ప్రభావం మరింత గణనీయంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారని నేను విశ్వసిస్తున్నాను.

ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

April 26th, 11:00 am

ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన వారికి 51,000కి పైగా నియామక పత్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించారు. భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో యువతకు కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్గత భద్రతను పెంపొందించటం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడటం, కార్మికుల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు తీసుకురావడం వీరి బాధ్యతలని పేర్కొన్నారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో చూపించే చిత్తశుద్ధి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రధానంగా పేర్కొన్నారు. విధుల నిర్వహించే విషయంలో ఈ యువత అత్యంత అంకితభావంతో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇండియా స్టీల్ 2025 కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

April 24th, 02:00 pm

నేటి నుంచి రెండు రోజుల వరకు, భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ఉక్కు రంగ సామర్థ్యం, అవకాశాల గురించి విస్తృతమైన చర్చల్లో మనం పాల్గొనబోతున్నాం. దేశాభివృద్ధికి వెన్నెముకగా వికసిత్ భారత్ కు బలమైన పునాదిగా దేశాభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని ఈ రంగం లిఖిస్తుంది. ఇండియా స్టీల్ 2025కు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. నూతన ఆలోచనలు పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఓ మంచి వేదికగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. స్టీలు రంగంలో నూతన అధ్యాయ ప్రారంభానికి ఇది పునాది వేస్తుంది.

ఇండియా స్టీల్ 2025 కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 24th, 01:30 pm

ముంబయిలో నిర్వహిస్తున్న ఇండియా స్టీల్ 2025 కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. భారత్‌లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్తులో విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలున్న ఉక్కు రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ వచ్చే రెండు రోజులపాటు చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రంగం భారత పురోగతికి పునాది వేస్తుందని, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేలా భారత మూలాలను బలోపేతం చేస్తుందని, విప్లవాత్మకమైన మార్పుల దిశగా దేశంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా స్టీల్- 2025 కార్యక్రమానికి ప్రతి ఒక్కరికీ ఆయన ఆహ్వానం పలికారు. కొత్త ఆలోచనలను పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రయోగ వేదికగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఉక్కు రంగంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

Our government places utmost importance on 'Samman' and 'Suvidha' for women: PM Modi in Navsari, Gujarat

March 08th, 11:50 am

PM Modi launched various developmental works in Navsari, Gujarat and addressed the gathering on the occasion of International Women's Day. PM extended his best wishes to all the women of the country and remarked that women are excelling in every sector. He highlighted the launch of two schemes, G-SAFAL and G-MAITRI in Gujarat. Shri Modi acknowledged Navsari district as one of the leading districts in Gujarat for rainwater harvesting and water conservation. He spoke about Namo Drone Didi campaign that is revolutionizing agriculture and the rural economy.

గుజరాత్‌లోని న‌వ్‌సారిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 08th, 11:45 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని న‌వ్‌సారిలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తల్లులు, సోదరీమణులు, కుమార్తెల ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున దేశంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహా కుంభమేళాలో గంగా మాత ఆశీస్సులు పొందానని, ఈ రోజు మాతృశక్తి మహా‌ కుంభమేళాలో ఆశీర్వాదం పొందానని ఆయన తెలిపారు. ఈ రోజు గుజరాత్‌లో జీ-సఫాల్ (జీవనోపాధిని పెంపొందించడానికి అంత్యోదయ కుటుంబాల కోసం గుజరాత్ పథకం), జీ-మైత్రి (గ్రామీణ ఆదాయాన్ని పెంచేందుకు ప్రజలకు గుజరాత్ అందించే మెంటార్‌షిప్ అండ్ యాక్సిలరేషన్) అనే రెండు పథకాలను ప్రారంభించిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వివిధ పథకాల నిధులను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశామని, ఈ విషయంలో ప్రతిఒక్కరిని అభినందిస్తున్నట్లు తెలిపారు.

మార్చి 1న జరిగే ‘వ్యవసాయం, గ్రామీణ సంక్షేమం’ అంశంపై బడ్జెట్‌ అనంతర వెబినార్లో పాల్గొనున్న ప్రధాని

February 28th, 07:32 pm

మార్చి 1, మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభమయ్యే ‘వ్యవసాయం, గ్రామీణ సంక్షేమం’ అనే అంశంపై బడ్జెట్ అనంతరం నిర్వహించే వెబినార్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు- 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 24th, 10:35 am

ముందుగా నేను ఇక్కడికి రావడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరుతున్నాను. 10, 12వ తరగతి విద్యార్థులకు ఈ రోజు పరీక్షలున్నాయని నిన్న నేనిక్కడికి వచ్చినప్పుడు తెలిసింది. వారి పరీక్షల సమయం, రాజ్ భవన్ నుంచి నేను బయలుదేరే సమయం ఒకేసారి ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా రోడ్లను మూసేస్తే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడతారు. వారికి అసౌకర్యం కలగకుండా విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నాకే రాజ్ భవన్ నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆలస్యమైంది. అలా కావాలనే నేను నా ప్రయాణాన్ని 15-20 నిమిషాలు ఆలస్యం చేశాను. ఇది మీకు కొంత అసౌకర్యాన్ని కలిగించింది. నన్ను మన్నించాలని మరోసారి మీ అందరినీ కోరుతున్నాను.

మధ్యప్రదేశ్ భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు-2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 24th, 10:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యప్రదేశ్ భోపాల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్-2025 (జీఐఎస్)ను ప్రారంభించారు. సదస్సుకు ఆలస్యంగా చేరుకున్నందుకు క్షమాపణలు తెలియచేసిన ప్రధాని, బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10వ, 12వ తరగతి విద్యార్థులు, తన రాక కోసం ఇదే మార్గంలో చేసే భద్రతాపరమైన ఏర్పాట్ల వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆలస్యంగా బయలుదేరినట్లు చెప్పారు. భోజరాజు పాలించిన ప్రాంతంలో ఏర్పాటైన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు మదుపర్లను, వ్యాపారవేత్తలను ఆహ్వానించడం తనకు గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వికసిత్ మధ్యప్రదేశ్ కీలకం కాబట్టి నేటి కార్యక్రమం ముఖ్యమైందని ప్రధాని అన్నారు. సదస్సు నిర్వహణ కోసం అద్భుతమైన ఏర్పాట్లను చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా శ్రీ మోదీ అభినందించారు.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం

February 06th, 04:21 pm

భారత్ సాధించిన విజయాలను, భారత్ పట్ల ప్రపంచ అంచనాలను, 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణం కోసం దేశంలోని సామాన్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంకల్పాన్ని గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎంతో చక్కగా వివరించారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా సాగిన వారి ప్రసంగం మనందరికీ భవిష్యత్ కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది, ఈ సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి ప్రసంగానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్యస‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మాధానం

February 06th, 04:00 pm

పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, భారత్‌పై ప్రపంచం అంచనాలు, వికసిత భారత్‌ సంకల్ప సాకారంలో సామాన్యుల ఆత్మవిశ్వాసంవగైరాలను రాష్ట్రపతి ప్రసంగం విశదీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో స్ఫూర్తిదాయకం, ప్రభావవంతమైన ఈ ప్రసంగం భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేసేదిగా ఉందని అభివర్ణించారు. ఇంతటి ఉత్తేజకర ప్రసంగం చేసినందుకుగాను రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.

Till 2029 the only priority should be the country, its poor, farmers, women and the youth: PM Modi

July 22nd, 10:30 am

Prime Minister Modi addressed the media before the Parliament's Budget session. He stated that the upcoming budget is crucial for the Amrit Kaal and will set the direction for the government's third term. The PM urged political parties to use the dignified platform of Parliament to fulfill the hopes and aspirations of the common people.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడాని కన్నా ముందు ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

July 22nd, 10:15 am

బడ్జెటు సమావేశాలు ఆరంభం కావడానికి కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసార మాధ్యమాలకు ఒక ప్రకటనను చేశారు.

రాబోయే సంవత్సరాల లోభారతదేశాన్ని మరింత గా అభివృద్ధి పరచేందుకు సంబంధించిన దృష్టి కోణాన్ని ప్రముఖం గాప్రకటించిన రాష్ట్రపతి ప్రసంగం: ప్రధాన మంత్రి

January 31st, 05:28 pm

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ రోజు న చేసిన ప్రసంగం భారతదేశం లోని 140 కోట్ల మంది పౌరుల సామూహిక శక్తి ని ప్రముఖం గా ప్రకటించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ప్రధాని ప్రసంగం పాఠం

January 31st, 10:45 am

గత పదేళ్లలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా పార్లమెంటులో ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకుపోయారని ఆశిస్తున్నాను. . అయితే ప్రజాస్వామిక విలువలను ధ్వంసం చేసే దుష్ప్రచారానికి అలవాటు పడిన అటువంటి చెల్లుబాటయ్యే ఎంపీలందరూ ఈ రోజు చివరి సెషన్‌లో సమావేశమైనప్పుడు, అలాంటి గుర్తింపు పొందిన ఎంపీలందరూ పదేళ్లలో ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకుంటారని, తమ పార్లమెంటరీ నియోజకవర్గంలో 100 మందిని కూడా అడగాలని నేను ఖచ్చితంగా చెబుతాను. ఎవరికీ గుర్తుండదు, ఆ పేరు ఎవరికీ తెలియదు, ఇంత హడావుడి ఎవరు చేసేవారు. అయితే నిరసన గళం పదునైనదైనా, విమర్శలు పదునైనవే అయినా సభలో మంచి ఆలోచనలతో సభకు లబ్ధి చేకూర్చిన వారిని ఇప్పటికీ చాలా మంది గుర్తుంచుకుంటారు.

పార్లమెంటుసమావేశాలు మొదలవడాని కి పూర్వం ప్రసార మాధ్యమాల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

January 31st, 10:30 am

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, క్రొత్త పార్లమెంటు యొక్క ఒకటో సమావేశాన్ని గుర్తుకు తీసుకు వస్తూ, ఆ తొలి సమావేశం లో తీసుకొన్నటువంటి ముఖ్య నిర్ణయాన్ని గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘విమెన్ ఎమ్‌పవర్‌మెంట్ ఎండ్ ఎడ్యులేశన్ యాక్టు కు ఆమోదం లభించడం మన దేశ ప్రజల కు ఒక మహత్తరమైనటువంటి క్షణాని కి సూచిక గా నిలచింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26 వ తేదీ నాటి గణతంత్ర దినం సంబురాల ను గురించి ఆయన పేర్కొంటూ, దేశం నారీ శక్తి తాలూకు బలాన్ని, పరాక్రమాన్ని మరియు దృఢ సంకల్పాన్ని అక్కున చేర్చుకొంది అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగం మరియు ఆర్థిక మంత్రి నిర్మల సీతారమణ్ గారు సమర్పించబోయేటటువంటి మధ్యంతర బడ్జెటు ల ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ, ఈ ఘటన క్రమాలు మహిళా సాధికారిత ను చాటిచెప్పే వేడుక వంటివి అంటూ అభివర్ణించారు.