బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

December 01st, 06:18 pm

బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు చెక్కుచెదరని సంకల్పాన్నీ, అత్యున్నత వృత్తి నైపుణ్యాన్నీ బీఎస్ఎఫ్ సూచిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది సేవలందిస్తారు. వారి శౌర్యంతోపాటు మానవతా స్ఫూర్తి కూడా అసాధారణమైనది అని మోదీ అన్నారు.

అక్టోబర్ 30,31 తేదీల్లో గుజరాత్‌లో ప్రధాని పర్యటన

October 29th, 10:58 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 30, 31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు. అక్టోబర్ 30 సాయంత్రం 5:15 సమయంలో కేవడియాలోని ఏక్తానగర్లో ఈ-బస్సులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు ఏక్తానగర్‌లో రూ.1,140 కోట్లకు పైగా విలువైన వివిధ మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.

'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

October 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 20th, 10:30 am

ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.

ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం

October 20th, 10:00 am

ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.

భోపాల్‌లోని దేవి అహిల్యాబాయి మహిళా సశక్తీకరణ్ మహా సమ్మేళన్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 31st, 11:00 am

మధ్యప్రదేశ్ గవర్నర్ గౌరవనీయ శ్రీ మంగు భాయ్ పటేల్, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, సాంకేతిక మాధ్యమాల ద్వారా పాలు పంచుకుంటున్న కేంద్ర మంత్రులు- ఇండోర్ నుంచి శ్రీ తో ఖాన్ సాహు, దాటియా నుంచి శ్రీ రామ్మోహన్ నాయుడు, సత్నా నుంచి శ్రీ మురళీధర్ మోహుల్, వేదికను అలంకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ జగదీష్ దేవ్డా, శ్రీ రాజేంద్ర శుక్లా, లోక్‌సభలో నా సహచరులు శ్రీ వి.డి.శర్మ, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీ సోదరులారా!

లోకమాత దేవీ అహల్యా బాయి హోల్కర్ 300వ జన్మదినోత్సవ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళనంలో ప్రధానమంత్రి ప్రసంగం

May 31st, 10:27 am

లోకమాత దేవి అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భోపాల్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా 'మా భారతి'కి నివాళులు అర్పిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, భారత మహిళా శక్తి గొప్పతనాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు, వారు ఈ కార్యక్రమానికి రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు లోకమాత దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమైన సందర్భం, జాతి నిర్మాణంలో గొప్ప ప్రయత్నాలకు మద్దతునిచ్చే క్షణంగా ఈ సందర్భాన్ని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేవి అహల్యాబాయిని ఉటంకిస్తూ, నిజమైన పాలన అంటే ప్రజలకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడం అని ఆయన పునరుద్ఘాటించారు. నేటి కార్యక్రమం అహల్యాదేవి దార్శనికతను ప్రతిబింబిస్తూ, ఆమె ఆదర్శాలను ముందుకు తీసుకువెళుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండోర్ మెట్రో ప్రారంభంతో పాటు, దాటియా, సత్నాలకు విమాన కనెక్టివిటీని జోడించడాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులు మధ్యప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తాయని, అభివృద్ధిని వేగవంతం చేస్తాయని అలాగే కొత్త ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

ఆదంపూర్ వైమానిక స్థావరం వద్ద ధైర్యవంతులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ తెలుగు అనువాదం

May 13th, 03:45 pm

ఈ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసింది. భారత్ మాతా కీ జై! అన్నది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథం. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుంది. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ . భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేసినప్పుడు శత్రువుకు కనిపించింది ఒక్కటే... అదే ‘భారత్ మాతా కీ జై! అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’.

ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

May 13th, 03:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అదంపూర్‌లోని వైమానిక దళ కేంద్రాన్ని సందర్శించి ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో సంభాషించారు. వారితో మాట్లాడుతూ.. ‘భారత్ మాతా కీ జై’ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసిందన్నారు. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథమని వ్యాఖ్యానించారు. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక అని స్పష్టం చేశారు. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుందన్నారు. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుందన్నారు. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ అంటూ భారత సైనిక పాటవాన్ని కొనియాడారు. భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేయగల సమర్థత మన దేశానికి ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు. అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’ అని ఆయన ప్రకటించారు.

సరిహద్దు భద్రతా దళం ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

December 01st, 08:52 am

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బీఎస్ఎఫ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో కీలక పాత్రను పోషిస్తూ, ధైర్య-సాహసాలకు, అంకితభావానికి, అసామాన్య సేవకు ప్రతీకగా ఉంటున్నందుకుగాను బీఎస్ఎఫ్‌ను ఆయన ప్రశంసించారు.

బిఎస్ఎఫ్ స్థాపనదినం సందర్భం లో శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి

December 01st, 10:16 am

‘‘బిఎస్ఎఫ్ యొక్క స్థాపన దినం నాడు, మనం ఈ యొక్క ఉత్కృష్ఠమైన బలగాన్ని ప్రశంసించుదాం; ఈ దళం మన సరిహద్దుల కు ఒక సంరక్షకురాలు గా తనదైన ముద్ర ను వేసింది. మన దేశ ప్రజల ను రక్షించడం లో వారు చాటుతూ వస్తున్న పరాక్రమం మరియు మొక్కవోనటువంటి ఉత్సాహం వారి యొక్క సమర్పణ భావాని కి ప్రమాణం గా ఉన్నది. ప్రాకృతిక విపత్తుల వేళల్లో రక్షణ మరియు సహాయం సంబంధి కార్యకలాపాల లో బిఎస్ఎఫ్ పోషించినటువంటి పాత్ర ను కూడా నేను ప్రశంసించదలచుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి 51 ,000 కు పైగా నియామక లేఖల ను- రోజ్ గార్ మేళా లో భాగం గా- ఆగస్టు 28 వ తేదీ నాడు పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి

August 27th, 07:08 pm

ఉద్యోగాల లో నూతనం గా నియమింపబడిన వారికి సంబంధించిన 51,000 కు పైచిలుకు నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 28 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

బిఎస్ఎఫ్ లో మౌలిక సదుపాయాల ను మెరుగుపరచడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

May 09th, 11:20 pm

జాయింట్ అవుట్ పోస్టుల ను నాలుగింటి ని ప్రారంభించడం ద్వారా బిఎస్ఎఫ్ మరింత దృఢతరం గా రూపుదిద్దుకొందని హోం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తం 108.3 కోట్ల రూపాయల విలువ కలిగిన ఇతర ప్రాజెక్టుల తో పాటే రెండు నివాస భవన సముదాయాల ను మరియు ఒక ఆఫీసర్స్ మెస్ ను కూడా ప్రారంభించడం జరిగింది.

బిఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో బిఎస్ఎఫ్ సిబ్బంది కి శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

December 01st, 09:07 am

బిఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో బిఎస్ఎఫ్ సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. భారతదేశాన్ని రక్షించడం లో మరియు మన దేశ ప్రజల కు అత్యంత తత్పరత తో సేవల ను అందించడం లో బిఎస్ఎఫ్ కు విశిష్టమైనటువంటి ట్రేక్ రెకార్డు ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

గుజరాత్ లోని దియోదర్ లో బనస్ డెయిరీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

April 19th, 11:02 am

మీరంతా బాగున్నారని భావిస్తాను. నేను హిందీలో ప్రసంగించాల్సివచ్చినందుకు మొదట మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. కాని మీడియా మిత్రులు హిందీలో నేను మాట్లాడితే బాగుంటుందని అభ్యర్థించారు గనుక వారి అభ్యర్థనను మన్నించాలని నేను నిర్ణయించాను.

బనాస్ కాంఠా లోని దియోదర్ లో బనాస్ డెయరి సంకుల్ లో అనేక అభివృద్ధి పథకాలను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి; మరికొన్ని అభివృద్ధి పథకాల కు ఆయనశంకుస్థాపన చేశారు

April 19th, 11:01 am

గుజరాత్ లోని బనాస్ కాంఠా జిల్లా లో గల దియోదర్ లో 600 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మాణం జరిగిన ఒక కొత్త డెయరి కాంప్లెక్స్ ను మరియు బంగాళాదుంపల ప్రోసెసింగ్ ప్లాంటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ నూతన డెయరి కాంప్లెక్స్ ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు గా ఉంది. ఇది రోజు కు దాదాపు 30 లక్షల లీటర్ ల పాల ను ప్రోసెస్ చేయడానికి, సుమారు 80 టన్నుల వెన్న ను, ఒక లక్ష లీటర్ ల ఐస్ క్రీమ్ ను, 20 టన్నుల ఘనీకృత పాల (ఖోయా) ను మరియు 6 టన్నుల చాక్ లెట్ ల ఉత్పత్తి కి వీలు కల్పిస్తుంది. పొటాటో ప్రోసెసింగ్ ప్లాంటు లో ఫ్రెంచ్ ఫ్రైజ్, ఆలూ చిప్స్, ఆలూ టిక్కీ, పేటీ లు మొదలైన ప్రోసెస్డ్ పొటాటో ప్రోడక్ట్ స్ ను తయారు చేసేందుకు ఏర్పాటు లు ఉన్నాయి. వీటి లో చాలా వరకు ఇతర దేశాల కు ఎగుమతి అవుతాయి. ఈ ప్లాంటు లు స్థానిక రైతుల కు సాధికారిత ను కల్పించి, ఆ ప్రాంతం లోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను బలపరుస్తాయి. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేశను ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. వ్యవసాయాని కి, పశుపాలన కు సంబంధించిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి సమాచారాన్ని రైతుల కు అందించడం కోసం ఈ సాముదాయిక రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేయడమైంది.

గుజరాత్‌లోని రాష్ట్రీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌య చేసిన స్నాత‌కోత్సవంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పాఠం

March 12th, 12:14 pm

గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, హోం మంత్రి శ్రీ అమిత్ షా, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విమల్ పటేల్ జీ, అధికారులు, ఉపాధ్యాయులు, యూనివర్సిటీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

రాష్ర్టీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌య భ‌వ‌నం జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి, స్నాత‌కోత్సవంలో ప్ర‌సంగం

March 12th, 12:10 pm

అహ్మ‌దాబాద్ లో రాష్ర్టీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌యంలోని ఒక భ‌వ‌నాన్ని ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేయ‌డంతో పాటు ఆ సంస్థ తొలి స్నాత‌కోత్స‌వంలో కూడా ప్ర‌సంగించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌, స‌హకార శాఖ‌ల మంత్రి శ్రీ అమిత్ షా, గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌వ్ర‌త్‌, ముఖ్య‌మంత్రి శ్రీ భూపేంద్ర‌భాయ్ ప‌టేల్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Parivarvadi groups looted poor's ration, BJP ended their game: PM Modi in Barabanki

February 23rd, 12:44 pm

Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”

PM Modi campaigns in Uttar Pradesh’s Barabanki and Kaushambi

February 23rd, 12:40 pm

Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”