జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
November 23rd, 02:18 pm
జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ సిరిల్ రామఫోసాను కలిశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చినందుకు... సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు రామఫోసాకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీ జీ20 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడానికి, వాటి ఆధారంగా మరింత పురోగతి సాధనకు దక్షిణాఫ్రికా జీ20 చేసిన ప్రయత్నాలనూ ఆయన అభినందించారు.చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశం
August 31st, 11:00 am
టియాంజిన్‌లో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.సంయుక్త ప్రకటన: ఉన్నత లక్ష్యాలు కలిగిన రెండు గొప్ప దేశాలు.. భారత్, బ్రెజిల్
July 09th, 05:55 am
బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (2025 జులై 8న) బ్రెజిల్‌కు ఆధికారిక పర్యటనకు విచ్చేశారు. ఇది దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి బ్రెజిల్ - ఇండియాల మధ్య మైత్రి, పరస్పర విశ్వాస భావనలను ప్రతిబింబిస్తోంది. ఈ స్నేహ బంధాన్ని 2006లో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించారు.పర్యావరణం, కాప్-30లతో పాటు ప్రపంచ ఆరోగ్యం అంశాలపై బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు.. ప్రసంగించిన ప్రధానమంత్రి
July 07th, 11:38 pm
పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్యసంరక్షణ’’ అంశాలపై సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలతో పాటు పాలుపంచుకోవాల్సిందంటూ ఆహ్వానాన్ని అందుకున్న దేశాలు కూడా పాల్గొన్నాయి. ప్రపంచ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకొని ఇలాంటి అధిక ప్రాధాన్యం కలిగిన అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు బ్రెజిల్‌కు ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పును ఇంధన సమస్యల పరిష్కారం అనే ఒకే అంశంతో ముడిపెట్టి చూడడం భారతదేశం దృక్పథం కాదని, జీవనానికి ప్రకృతికి మధ్య సమతూకాన్ని ప్రభావితం చేసే అంశం ఇదని తమ దేశం భావిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వాతావరణ పరంగా న్యాయాన్ని ఏర్పరచడం అంటే అది ఒక నైతిక బాధ్యత అని, దీనిని తప్పక నిర్వర్తించాల్సిందేనని భారత్ సంకల్పించిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పర్యావరణ సంరక్షణ దిశలో కార్యాచరణను చేపట్టడానికి భారత్ ఎంతో చిత్తశుద్ధితో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజానుకూల, భూగ్రహానికి మిత్రపూర్వక ప్రగతిసాధక విధానాలను ప్రోత్సహించడానికి తీసుకొంటున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయన సమగ్రంగా సభకు వివరించారు. ఈ సందర్భంగా మిషన్ లైఫ్ (పర్యావరణ అనుకూల జీవనం), 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం), అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రేజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), హరిత హైడ్రోజన్ మిషన్, ప్రపంచ జీవ ఇంధన వేదిక, పులుల సంరక్షణ కూటమి (బిగ్ క్యాట్స్ అలయన్స్) తదితర కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్య అంశాలపై ఏర్పాటైన బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 07th, 11:13 pm
బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతాల్లో భాగంగా పర్యావరణ, ఆరోగ్య భద్రత అంశాలకు బ్రెజిల్ అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నాకు సంతోషం కలిగిస్తోంది. ఇవి పరస్పర సంబంధం గల అంశాలే కాక మానవాళి సంక్షేమానికి, ఉజ్జ్వల భవిష్యత్తుకూ ఎంతో ముఖ్యమైనవి.బ్రెజిల్‌లోని రియో డీ జనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఉరుగ్వే అధ్యక్షునితో సమావేశమైన ప్రధాని
July 07th, 09:20 pm
ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అన్ని అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. డిజిటల్ సహకారం, ఐసీటీ, డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలు, యూపీఐ, రక్షణ, రైల్వేలు, ఆరోగ్యం, ఔషధాలు, వ్యవసాయం, ఇంధనం, సాంస్కృతిక సంబంధాలు, మానవ సంబంధాల విషయంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని వారు సమీక్షించారు. కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచటంపై ప్రధానంగా చర్చలు జరిపారు. గరిష్ఠస్థాయిలో ఆర్థిక అవకాశాలకు ద్వారాలు తెరుస్తూ వాణిజ్యపరంగా ఇరు దేశాలకు లబ్ధిచేకూర్చే భారత్-మెర్కోసూర్ ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాన్ని (ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్) విస్తరించటంపై ఇరు దేశాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి.రియో డి జనీరోలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా బొలీవియా అధ్యక్షునితో భేటీ అయిన ప్రధానమంత్రి
July 07th, 09:19 pm
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా అధ్యక్షులు గౌరవ లూయిస్ ఆర్స్ కాటకోరాతో సమావేశమయ్యారు.Rio de Janeiro Declaration- Strengthening Global South Cooperation for a More Inclusive and Sustainable Governance
July 07th, 06:00 am
The leaders of BRICS countries, met in Rio de Janeiro, Brazil for the 17th BRICS Summit. The leaders reaffirmed their commitment to the BRICS spirit of mutual respect and understanding, sovereign equality, solidarity, democracy, openness, inclusiveness, collaboration and consensus. They strongly condemned terrorism and welcomed the inclusion of new countries as BRICS partner countries.బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. క్యూబా అధ్యక్షునితో ప్రధాన మంత్రి భేటీ
July 07th, 05:19 am
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, క్యూబా అధ్యక్షుడు గౌరవ మిగ్వెల్ డియాజ్-కానెల్ బెర్మూడెజ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. 2023లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు క్యూబా ప్రత్యేక ఆహ్వానితురాలుగా ఉన్నప్పుడు కూడా, క్యూబా అధ్యక్షుడు శ్రీ డియాజ్-కానెల్ బెర్మూడెజ్‌తో ప్రధానమంత్రి భేటీ అయ్యారు.బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ సదస్సులో మలేషియా ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
July 07th, 05:13 am
బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మలేషియా ప్రధాని గౌరవ అన్వర్ బిన్ ఇబ్రహీంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.శాంతి, భద్రతలపై బ్రిక్స్ కార్యక్రమం.. ప్రధానమంత్రి ప్రకటన పాఠం
July 06th, 11:07 pm
ప్రపంచంలో శాంతి, భద్రతలు కేవలం ఆదర్శాలు కావు, అంతకంటే అవి మన ఉమ్మడి ప్రయోజనాలతో పాటు మన అందరి భవిష్యత్తుకు బలమైన పునాదులు. మానవ జాతి పురోగతి శాంతియుత, సురక్షభరిత వాతావరణంలో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో బ్రిక్స్‌ది చాలా ముఖ్య పాత్ర. మనమంతా కలిసికట్టుగా, మన సవాళ్లను సమష్టిగా పరిష్కరించుకోవాల్సిన తరుణమిది. మనం తప్పక ఐకమత్యంతో ముందడుగు వేయాలి.బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం: అంతర్జాతీయ పాలనలో సంస్కరణ
July 06th, 09:41 pm
17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రెజిల్ నాయకత్వంలో మన బ్రిక్స్ సహకారం కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని సంతరించుకుంది. మనలో నిండిన ఈ శక్తి ఎస్‌ప్రెసో కాదు.. డబుల్ ఎస్‌ప్రెసో షాట్ లాంటిది. ఈ విషయంలో నేను అధ్యక్షుడు లూలా దార్శనికతను, ఆయన అచంచలమైన విశ్వాసాన్ని అభినందిస్తున్నాను. బ్రిక్స్ కుటుంబంలో ఇండోనేషియా చేరిన నేపథ్యంలో నా స్నేహితుడు, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవోకు భారత్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.బహుపాక్షిక సంబంధాలు, ఆర్థిక-ద్రవ్య సహాయ విషయాల పటిష్ఠీకరణతో పాటు కృత్రిమ మేధపై బ్రిక్స్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రకటన పాఠం..
July 06th, 09:40 pm
బ్రిక్స్ కుటుంబానికి చెందిన మిత్ర దేశాల నేతలతో కలసి ఈ సమావేశంలో పాలుపంచుకొంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. లాటిన్ అమెరికా, ఆఫ్రికాలతో పాటు ఆసియాలోని మిత్రదేశాల నేతలతో నా ఆలోచనలను పంచుకొనేందుకు బ్రిక్స్ అవుట్‌రీచ్ సమ్మిట్‌లో ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలాకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని
July 06th, 09:39 pm
బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. నిన్న ప్రారంభమైన ఈ సదస్సు ఈరోజు కూడా జరుగుతోంది. అంతర్జాతీయ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్ వాణిని విస్తరించడం, శాంతి భద్రతలు, బహుపాక్షిక విధానాన్ని బలోపేతం చేయడం, అభివృద్ధి సమస్యలు, కృత్రిమ మేధతో సహా బ్రిక్స్ అజెండాకు సంబంధించిన వివిధ అంశాలపై నాయకులు ఫలప్రదమైన చర్చలు జరిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఆత్మీయ ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ అధ్యక్షునికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు చేరుకున్న ప్రధాని మోదీ
July 06th, 04:47 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం బ్రెజిల్ చేరుకున్నారు. రియో డి జనీరోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు మరియు అనేక మంది ప్రపంచ నాయకులను కలుస్తారు.ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
July 02nd, 07:34 am
జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)
June 27th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్‌లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలకడం భారతదేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి
January 25th, 05:48 pm
భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆయనతో భారత - ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇండోనేషియా కీలక పాత్ర పోషించిందని, బ్రిక్స్ లో ఇండోనేషియా సభ్యత్వాన్ని భారత్ స్వాగతిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.ఇండోనేషియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 25th, 01:00 pm
భారత తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా మన ముఖ్య అతిథిగా ఉంది. ఇప్పుడు మన 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చిరస్మరణీయ సందర్భంలో భాగం కావడానికి అంగీకరించడం మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా, ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సహా వారి బృందానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం
December 16th, 03:26 pm
శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.