అభివృద్ధి పనులు, దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా అజ్మీర్‌లో ప్రధాని ప్రసంగం

February 28th, 12:00 pm

తీర్థరాజ్ పుష్కర్, సావిత్రీ అమ్మవారికి నిలయమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఈ రోజు మీ మధ్యన నిలిచి ఆశీస్సులు పొందే అవకాశం నాకు లభించింది. సుర్‌సురాలోని తేజాజీధామ్‌కూ, పృథ్వీరాజ్ చౌహాన్ పుణ్యభూమి అయిన అజ్మీర్‌కూ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ వేదికగా దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా ప్రచారం, రూ. 17,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 28th, 11:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అజ్మీర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజస్థాన్ అభివృద్ధి ప్రయాణంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా సుర్సురాలోని తేజాజీ ధామ్ వంటి ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వ కేంద్రాలకు, హైఫా విముక్తిలో కీలక పాత్ర పోషించిన మేజర్ దల్పత్ సింగ్ వీరత్వానికి నివాళులర్పించారు. మేజర్ దల్పత్ సింగ్ ధైర్యసాహసాలు నేటికీ ఇజ్రాయెల్‌లో గౌరవం పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.

బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీ) మూడో దశకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

October 01st, 03:28 pm

బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీ) మూడో దశను కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మూడో దశ (2025-26 నుంచి 2030-31 వరకు), అలాగే తరువాతి ఆరు సంవత్సరాల వరకు (2031-32 నుంచి 2037-38 వరకు) బయోటెక్నాలజీ విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ.. డీబీటీ), బ్రిటన్ కు చెందిన వెల్‌కం ట్రస్ట్ (డబ్ల్యూటీ)లతో పాటు ఎస్‌పీవీ, ఇండియా అలయన్స్‌ల మధ్య భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. రూ.1500 కోట్ల మొత్తం వ్యయంతో 2030-31 వరకు అనుమతించిన ఫెలోషిప్, గ్రాంట్లను మంజూరు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దీనిలో రూ.1,000 కోట్లను డీబీటీ, రూ.500 కోట్లను యూకేకు చెందిన డబ్ల్యూటీ సమకూరుస్తాయి.