అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 20th, 10:30 am

ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.

ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం

October 20th, 10:00 am

ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.

బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్, టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవం మరియు బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

January 19th, 03:15 pm

కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారు, ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య గారు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆర్ అశోక్ గారు, భారతదేశంలో బోయింగ్ కంపెనీ సిఒఒ స్టెఫానీ పోప్, ఇతర పరిశ్రమ భాగస్వాములు, మహిళలు మరియు పెద్దమనుషులు!

అత్యధునాతనమైన బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ కేంపస్ ను కర్నాటక లోని బెంగళూరు లోప్రారంభించిన ప్రధాన మంత్రి

January 19th, 02:52 pm

అత్యధునాతనమైనటువంటి బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (బిఐఇటిసి) కేంపసు ను కర్నాటక లోని బెంగళూరు లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,600 కోట్ల రూపాయల పెట్టుబడి తో నిర్మాణం పూర్తి అయిన ఈ 43 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటైన కేంపస్ యుఎస్ఎ కు వెలుపల బోయింగ్ పెట్టిన అతి పెద్ద పెట్టుబడి అని చెప్పాలి. శరవేగం గా వృద్ధి చెందుతున్నటువంటి దేశ విమానయాన రంగం లో భారతదేశం లో వివిధ ప్రాంతాల యువతులు అధిక సంఖ్య లో ప్రవేశించడాని కి వీలుగా వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యం తో రూపుదిద్దిన బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

బోయింగ్ ప్రెసిడెంట్, సీఈవో డేవిడ్ కాలన్ తో ప్రధాని భేటీ

June 24th, 07:21 am

ప్రధాని మోదీ, కాలన్ ఇద్దరూ భారతదేశంలో వైమానిక రంగంలో విమానాల నిర్వహణ, మరమ్మతులలో బోయింగ్ ఉనికి గురించి చర్చించారు. అంతరిక్ష రంగంలో కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ప్రధాని ఈ సందర్భంగా బోయింగ్ సంస్థను కోరారు.