థాయ్‌లాండ్‌లో జరిగిన బిమ్స్‌టెక్ ఆరో సదస్సులో పాల్గొన్న ప్రధాని

April 04th, 12:54 pm

థాయ్‌లాండ్‌లో నిర్వహించిన బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) ఆరో సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రస్తుతం థాయ్‌లాండ్ అధ్యక్షత వహిస్తోంది. ‘‘బిమ్స్‌టెక్: సంక్షేమం, స్థిరత్వం, బహిరంగం’’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. బిమ్స్‌టెక్ ప్రాంత నాయకుల ప్రాధాన్యాలు, ప్రజల ఆకాంక్షలను ఇది ప్రతిపలిస్తుంది. అలాగే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో ఉమ్మడి వృద్ధి సాధిండచంలో బిమ్స్‌టెక్ ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.