The party governing Punjab today has neither clean intentions nor honesty: PM Modi in Jalandhar
July 17th, 04:31 pm
PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.PM addresses an energy-packed public rally in Jalandhar, Punjab
July 17th, 04:30 pm
PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.హర్యానాలోని జింద్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 17th, 12:00 pm
హర్యానా గవర్నర్ శ్రీ అసిమ్ ఘోష్ గారు... అత్యంత ప్రజాదరణ కలిగిన, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ గారు... కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు... హాజరైన ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలకు, సాంకేతిక మాధ్యామాల ద్వారా అనేక ప్రదేశాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన హర్యానాలోని నా ప్రియమైన సోదరీ సోదరులందరికీ నమస్కారం!హర్యానాలోని జింద్‌లో సుమారు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 17th, 11:30 am
హర్యానాలోని జింద్‌లో సుమారు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు, జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతానికి రావడం పట్ల ప్రధానమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శక్తి పీఠం మాతా జయంతి ఆశీస్సులు పొందిన ఈ ప్రాంతానికి ఉన్న గొప్ప చారిత్రక, సైనిక, ఆధ్యాత్మిక వారసత్వం గురించి వివరించారు. దశాబ్దాల క్రితం సంస్థాగత కార్యక్రమాల నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు లభించిన ఆప్యాయతను, ముర్రా గేదె పాలు, దేశీ బురా, ఘేవార్ లాంటి స్థానిక వంటకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఇది సాధారణ ప్రదేశం కాదు. ఇది చరిత్ర, ధైర్యం, మతం, అపారమైన గర్వానికి ప్రతీకగా నిలిచే భూమి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పీఎం ప్రసంగానికి తెలుగు అనువాదం
July 06th, 06:47 pm
కేంద్ర క్యాబినెట్లో సహ మంత్రులు అమిత్ భాయ్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బీజేపీ సీనియర్ సభ్యులు, నాలాంటి లక్షలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచే శ్రీ మఖన్‌లాల్ జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శమిక్ భట్టాచార్య, గౌరవ ప్రజా ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 06th, 06:17 pm
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నిర్ణయించిన ప్రయాణాల కారణంగా స్వయంగా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పిన ఆయన.. ఇలాంటి ఒక చరిత్రాత్మక సందర్భంలో భౌగోళిక అడ్డంకులను అధిగమించటంలో డిజిటల్ అనుసంధానత అద్భుతమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. సాంకేతికత సహాయంతో నేను ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మీతో భాగస్వామిని అవుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.రాజస్థాన్‌లోని బలోత్రాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పీఎం ప్రసంగం
July 04th, 12:50 pm
ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.పశ్చిమబెంగాల్... తారకేశ్వర్‌లో జరిగిన పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పీఎం ప్రసంగం
June 20th, 05:13 pm
గవర్నర్ ఆర్.ఎన్.రవి, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, వేదికపైనున్న ఇతర విశిష్ట ప్రతినిధులు, బెంగాల్ సోదరీసోదరులారా.. బాబా తారక్‌నాథ్ కొలువైన ఈ పవిత్ర భూమిపై పశ్చిమబెంగాల్ దినోత్సవం రోజున ఇక్కడ భారీ జన సందోహం... ఎన్నికలు, ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత ఇలా మీ ముందుకు రావటం నాకెంతో గర్వంగా ఉంది. బెంగాల్ గాలిలో తాజాదనం నిండింది. ఇక్కడి ప్రతి అణువూ సరికొత్త పరిమళాన్ని వెదజల్లుతున్నట్లు ఉంది. సంకెళ్ల నుంచి బెంగాల్ విముక్తి పొందినట్లుగా, బెంగాల్ ఆత్మగౌరవం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది. సరికొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలనే బెంగాల్ సంకల్పానికి నేటి కార్యక్రమం, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలే నిదర్శనం. ప్రజల ముఖాల్లోని వెలుగు, ప్రతి గ్రామంలో కనిపిస్తున్న ఆనందం, విశ్వాసం.. మీ సంతోషంలో భాగం పంచుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒక ఓటు, ఒక ఎన్నిక ఎంతటి మార్పు తీసుకురాగలదో బెంగాల్‌లో స‌్పష్టంగా తెలుస్తుంది.‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 20th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.ప్రపంచ సవాళ్ల నడుమ ప్రతి భారతీయునికి ప్రధాని మోదీ గట్టి విజ్ఞప్తి
May 10th, 08:39 pm
హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఇటీవలి సంఘర్షణలు, సరఫరా గొలుసు అంతరాయాల వల్ల తలెత్తిన ప్రపంచ ఆర్థిక సవాళ్ల గురించి మాట్లాడారు. భారతదేశ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి సామూహిక జాతీయ బాధ్యత అవసరమని ఆయన పిలుపునిచ్చారు. దిగుమతులపై ఒత్తిడిని తగ్గించి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించాలని, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పౌరులను కోరారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ
May 10th, 06:05 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు; ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న స్థాయి, బీజేపీ సాధించిన ఇటీవలి ఎన్నికల విజయాల ప్రాముఖ్యత, అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక-రాజకీయ సవాళ్ల నేపథ్యంలో దేశం యొక్క సమిష్టి బాధ్యత గురించి మాట్లాడారు.హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ ర్యాలీ: స్వయం సమృద్ధి మరియు 'వికసిత తెలంగాణ'పై దృష్టి
May 10th, 06:00 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు; ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న స్థాయి, బీజేపీ సాధించిన ఇటీవలి ఎన్నికల విజయాల ప్రాముఖ్యత, అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక-రాజకీయ సవాళ్ల నేపథ్యంలో దేశం యొక్క సమిష్టి బాధ్యత గురించి మాట్లాడారు.కాంగ్రెస్ అధికార దాహపు పుస్తకంలో 'పాలన' అనే అధ్యాయమే లేదు: బెంగళూరులో ప్రధాని మోదీ
May 10th, 09:46 am
కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రశంసిస్తూ, అస్థిరత మరియు కుంభకోణాల కంటే 'స్థిరత్వం, వేగం మరియు పరిష్కారాల'కే దేశ ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారని ఉద్ఘాటించారు. బెంగళూరు గడ్డపై నేడు కాషాయ సూర్యుడు ఉదయించాడని ఆయన పేర్కొన్నారు.కర్ణాటకలోని బెంగళూరులో భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
May 10th, 09:45 am
కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రశంసిస్తూ, అస్థిరత మరియు కుంభకోణాల కంటే 'స్థిరత్వం, వేగం మరియు పరిష్కారాల'కే దేశ ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారని ఉద్ఘాటించారు. బెంగళూరు గడ్డపై నేడు కాషాయ సూర్యుడు ఉదయించాడని ఆయన పేర్కొన్నారు.పుదుచ్చేరి విశ్వాసాన్ని పునరుద్ధరించింది... బీజేపీ-ఎన్డీఏ మరోసారి అధికారాన్ని దక్కించుకుంది
May 04th, 07:08 pm
సుపరిపాలనలో బీజేపీ-ఎన్డీఏ ట్రాక్ రికార్డ్, శ్రీ ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరు ఆధారంగా, పుదుచ్చేరి ప్రజలు మరోసారి బీజేపీ-ఎన్డీఏపై తమ విశ్వాసాన్ని ఉంచి, నూతన తీర్పును అందించారు. ఈ నిరంతర మద్దతు, కేంద్రపాలిత ప్రాంతంలో అభివృద్ధిని మరియు సమర్థవంతమైన పాలనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుంది.తమిళనాడు ప్రజల సంక్షేమం పట్ల బీజేపీ-ఎన్డీఏ నిబద్ధతను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు
May 04th, 07:02 pm
అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ-ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన తమిళనాడు ఓటర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, వారి జీవితాలను మెరుగుపరచడంలో కూటమి ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు... ప్రతిచోటా వికసిస్తున్న కమలం: బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి ప్రధాని మోదీ
May 04th, 07:01 pm
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో ఘన విజయాల అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ క్షణం చారిత్రాత్మకమైనదని, భావోద్వేగభరితమైనదని, ప్రజాస్వామ్యంపై, పనితీరు ఆధారిత పాలనపై నమ్మకానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనమని అభివర్ణించారు. ధోవతితో కూడిన సాంప్రదాయ బెంగాలీ దుస్తులలో కనిపించిన ప్రధాని, బెంగాల్‌తో తనకున్న గాఢమైన సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ, ఆ రాష్ట్రానికి లభించిన చారిత్రాత్మక తీర్పు యొక్క ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచారు.వివిధ రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగం
May 04th, 07:00 pm
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో ఘన విజయాల అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ క్షణం చారిత్రాత్మకమైనదని, భావోద్వేగభరితమైనదని, ప్రజాస్వామ్యంపై, పనితీరు ఆధారిత పాలనపై నమ్మకానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనమని అభివర్ణించారు. ధోవతితో కూడిన సాంప్రదాయ బెంగాలీ దుస్తులలో కనిపించిన ప్రధాని, బెంగాల్‌తో తనకున్న గాఢమైన సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ, ఆ రాష్ట్రానికి లభించిన చారిత్రాత్మక తీర్పు యొక్క ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచారు.కేరళానికి కృతజ్ఞతలు! ప్రగతి పట్ల బీజేపీ-ఎన్డీఏ నిబద్ధత స్థిరంగా ఉంది
May 04th, 06:56 pm
కేరళ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ-ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి కీలకమైన సమస్యలను కూటమి లేవనెత్తుతూనే ఉంటుందని, వికాసిత కేరళం దార్శనికత దిశగా నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.