సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
May 11th, 12:28 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. పునర్నిర్మాణం తర్వాత సోమనాథ్ ఆలయంలోకి భక్తులను అనుమతించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ సందర్శనకు వెళ్లటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.గుజరాత్‌లోని ప్రభాస్ పటన్ వద్ద జరిగిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగం
May 11th, 10:20 am
గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణానంతర ప్రతిష్ఠాపనోత్సవానికి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన అమృత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ అమృత మహోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 11th, 10:15 am
గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణానంతర ప్రతిష్ఠాపనోత్సవానికి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన అమృత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.కాంగ్రెస్ ఎప్పుడూ అస్సాం ప్రయోజనాలతో రాజీ పడింది: బిశ్వనాథ్‌లో ప్రధాని మోదీ
April 01st, 11:45 am
అస్సాంలోని బిశ్వనాథ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో, కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ 'అభివృద్ధి వ్యతిరేక' పార్టీ అని, 'స్వతంత్ర భారతదేశంలో అవినీతికి మూలం' అని ఆరోపించారు. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైలైట్ చేస్తూ, వేలాది బీఘాల భూమిని అక్రమ ఆక్రమణల నుండి విడిపించి, అస్సాం వారసత్వాన్ని, పర్యావరణాన్ని పునరుద్ధరించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగేలా చూడాలని ఆయన ఓటర్లను కోరారు.గోగాముఖ్, విశ్వనాథ్‌లలో ఉత్సాహభరితమైన ర్యాలీలతో అస్సాం ఎన్నికలకు ప్రధాని మోదీ నాంది పలికారు
April 01st, 11:00 am
రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోగాముఖ్, విశ్వనాథ్‌లలో భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రకటన తర్వాత అస్సాంలో ఆయన నిర్వహించిన తొలి ర్యాలీలు ఇవే. ఈ కార్యక్రమాలకు యువత, మహిళలు, స్థానిక వర్గాల వారు ఉత్సాహంగా పాల్గొనడంతో భారీ స్పందన లభించింది. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు బలమైన ఊపునిచ్చినట్లు సంకేతాలు ఇస్తోంది.మార్చి 13-14 తేదీల్లో ప్రధానమంత్రి అస్సాం పర్యటన
March 12th, 05:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 13-14 తేదీల్లో అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కొక్రాఝర్, గువహటి, సిల్చార్ ప్రాంతాలలో రూ. 47,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజ, రైళ్ల ప్రారంభోత్సవం చేస్తారు.