బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్సీపీ) మూడో దశకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
October 01st, 03:28 pm
బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్సీపీ) మూడో దశను కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మూడో దశ (2025-26 నుంచి 2030-31 వరకు), అలాగే తరువాతి ఆరు సంవత్సరాల వరకు (2031-32 నుంచి 2037-38 వరకు) బయోటెక్నాలజీ విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ.. డీబీటీ), బ్రిటన్ కు చెందిన వెల్కం ట్రస్ట్ (డబ్ల్యూటీ)లతో పాటు ఎస్పీవీ, ఇండియా అలయన్స్ల మధ్య భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. రూ.1500 కోట్ల మొత్తం వ్యయంతో 2030-31 వరకు అనుమతించిన ఫెలోషిప్, గ్రాంట్లను మంజూరు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దీనిలో రూ.1,000 కోట్లను డీబీటీ, రూ.500 కోట్లను యూకేకు చెందిన డబ్ల్యూటీ సమకూరుస్తాయి.