ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ప్రధానమంత్రి భేటీ
February 26th, 08:56 pm
భారత్ - ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలపై వారు సమగ్రమైన చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని, స్నేహాన్ని ప్రతిబింబిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను శాంతి, ఆవిష్కరణ, అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ స్థాయి పెంపు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర ప్రయోజనాల కలయికకు, సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం ఇరు దేశాలకున్న ఉమ్మడి దార్శనికతకు చిహ్నంగా నిలుస్తుంది.ముంబైలో భారత్-ఫ్రాన్స్ ఇన్నొవేషన్ ఫోరమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 18th, 12:07 pm
ప్రపంచంలోని రెండు అద్భుత ఆవిష్కరణ కూడళ్ల సంగమం ఇవాళ ఇక్కడ ఆవిష్కృతమైంది. భారత్, ఫ్రాన్స్ దేశాల ప్రస్తావన వచ్చినపుడు మన బంధం ఆవిష్కరణలకు మాత్రమేగాక.. పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలకు సంబంధించినదిగా ఉంటుంది. ఈ స్ఫూర్తితోనే 2026ను భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల ఏడాదిగా నిర్వహించాలని అధ్యక్షుడు మాక్రాన్, నేను సంకల్పించాం. ఇదొక వేడుకకు కాదు... ఇది మా సంయుక్త కట్టుబాటు- ఆవిష్కరణలకు కర్తవ్య సహిత నాయకత్వ నిబద్ధత!ఫ్రాన్స్ అధ్యక్షుడితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
February 17th, 04:00 pm
ముంబయికి నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు మాక్రోన్‌ను స్వాగతించడం నాకు అమితానందాన్ని కలిగిస్తోంది. గతేడాది, ఏఐ యాక్షన్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన నన్ను ఫ్రాన్స్‌కు ఆహ్వానించారు.Cabinet approves Startup India Fund of Funds 2.0 to Mobilize Venture Capital for India’s Startup Ecosystem
February 14th, 01:11 pm
The Union Cabinet chaired by PM Modi, has approved the establishment of the Startup India Fund of Funds 2.0 with a total corpus of Rs. 10,000 crore. Aligned with the national vision of Viksit Bharat @ 2047, the Fund represents the Government’s continued commitment to empowering entrepreneurs, fostering innovation and unlocking the full potential of India’s startup ecosystem.అహ్మదాబాద్‌లో ‘భారత్-జర్మనీ సీఈఓ ఫోరమ్’ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 01:35 pm
భారత్-జర్మనీ ‘సీఈఓ’ల ఫోరం సమావేశంలో పాలుపంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మన దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు నిండగా, ఉభయ పక్షాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అటు వజ్రోత్సవం (ప్లాటినం జూబ్లీ), ఇటు రజతోత్సవం (సిల్వర్ జూబ్లీ) కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ జంట విశేషాల కీలక సందర్భంలో ఏర్పాటైన ఈ సమావేశం ప్లాటినం మెరుపులకు వెండి అంచు తొడిగినట్టుగా ఉంది.మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు- 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 24th, 10:35 am
ముందుగా నేను ఇక్కడికి రావడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరుతున్నాను. 10, 12వ తరగతి విద్యార్థులకు ఈ రోజు పరీక్షలున్నాయని నిన్న నేనిక్కడికి వచ్చినప్పుడు తెలిసింది. వారి పరీక్షల సమయం, రాజ్ భవన్ నుంచి నేను బయలుదేరే సమయం ఒకేసారి ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా రోడ్లను మూసేస్తే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడతారు. వారికి అసౌకర్యం కలగకుండా విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నాకే రాజ్ భవన్ నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆలస్యమైంది. అలా కావాలనే నేను నా ప్రయాణాన్ని 15-20 నిమిషాలు ఆలస్యం చేశాను. ఇది మీకు కొంత అసౌకర్యాన్ని కలిగించింది. నన్ను మన్నించాలని మరోసారి మీ అందరినీ కోరుతున్నాను.మధ్యప్రదేశ్ భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు-2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 24th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యప్రదేశ్ భోపాల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్-2025 (జీఐఎస్)ను ప్రారంభించారు. సదస్సుకు ఆలస్యంగా చేరుకున్నందుకు క్షమాపణలు తెలియచేసిన ప్రధాని, బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10వ, 12వ తరగతి విద్యార్థులు, తన రాక కోసం ఇదే మార్గంలో చేసే భద్రతాపరమైన ఏర్పాట్ల వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆలస్యంగా బయలుదేరినట్లు చెప్పారు. భోజరాజు పాలించిన ప్రాంతంలో ఏర్పాటైన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు మదుపర్లను, వ్యాపారవేత్తలను ఆహ్వానించడం తనకు గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వికసిత్ మధ్యప్రదేశ్ కీలకం కాబట్టి నేటి కార్యక్రమం ముఖ్యమైందని ప్రధాని అన్నారు. సదస్సు నిర్వహణ కోసం అద్భుతమైన ఏర్పాట్లను చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా శ్రీ మోదీ అభినందించారు.భారత్ - అమెరికా సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రకటనకు తెలుగు అనువాదం
February 14th, 04:57 am
ముందుగా నాకు ఆత్మీయ స్వాగతాన్ని, ఆతిథ్యాన్ని అందించిన నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్ తన నాయకత్వ పటిమ ద్వారా భారత్-అమెరికా మధ్య సంబంధాలను పునరుజ్జీవింపచేశారు.ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు మన ఓటింగ్ ప్రక్రియను బలోపేతం చేసింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 19th, 11:30 am
In the 118th episode of Mann Ki Baat, PM Modi reflected on key milestones, including the upcoming 75th Republic Day celebrations and the significance of India’s Constitution in shaping the nation’s democracy. He highlighted India’s achievements and advancements in space sector like satellite docking. He spoke about the Maha Kumbh in Prayagraj and paid tributes to Netaji Subhas Chandra Bose.The Genome India Project marks a defining moment in the country's biotechnology landscape: PM
January 09th, 06:38 pm
PM Modi delivered his remarks at the start of the Genome India Project. “Genome India Project is an important milestone in the biotechnology revolution”, exclaimed Shri Modi. He noted that this project has successfully created a perse genetic resource by sequencing the genomes of 10,000 inpiduals from various populations.జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 09th, 05:53 pm
జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి ఇవాళ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. పరిశోధన రంగంలో భారత్ నేడు చారిత్రకంగా ముందంజ వేసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 5 సంవత్సరాల కిందటే ఆమోదం లభించిందని ప్రధాని గుర్తుచేశారు. అయితే, కోవిడ్ మహమ్మారి ఎన్నో సవాళ్లు విసిరినా, మన శాస్త్రవేత్తలు అత్యంత శ్రద్ధాసక్తులతో దీన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ‘ఐఐఎస్సీ, ఐఐటీ’, ‘సిఎస్ఐఆర్’, ‘డిబిటి-బ్రిక్’ వంటి 20కిపైగా విశిష్ట పరిశోధనా సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయని శ్రీ మోదీ వివరించారు. దీని ఫలితంగా 10,000 మంది భారతీయుల జన్యు క్రమంతో కూడిన సమాచారం నేడు భారత బయోలాజికల్ డేటా సెంటర్‌లో అందుబాటులో ఉందన్నారు. జీవ సాంకేతిక పరిశోధన రంగంలో ఈ ప్రాజెక్టు ఓ కీలక మలుపుగా నిలవగలదని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తంచేస్తూ, దీనితో ముడిపడిన భాగస్వామ్య సంస్థలన్నిటికీ అభినందనలు తెలిపారు.