బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సు.. నేపాల్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

April 04th, 04:17 pm

బిమ్స్‌టెక్ 6వ శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

బిమ్స్ టెక్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారుతో సమావేశమైన ప్రధానమంత్రి

April 04th, 03:49 pm

బ్యాంకాక్ లో ఏర్పాటైన బిమ్స్ టెక్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు.

చర్యల జాబితా: ఆరో బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

April 04th, 02:32 pm

బిమ్స్‌టెక్ ప్రాంతంలో స్థానిక కరెన్సీలో వ్యాపార నిర్వహణ సాధ్యపడుతుందా అనే అంశాన్ని అధ్యయనం చేయడం.

6వ బిమ్స్ టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 04th, 12:59 pm

ఈ సదస్సు కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిన థాయిలాండ్ ప్రభుత్వానికి, గౌరవనీయ షినవత్ర గారికి నా కృతజ్ఞతలు.

థాయ్‌లాండ్‌లో జరిగిన బిమ్స్‌టెక్ ఆరో సదస్సులో పాల్గొన్న ప్రధాని

April 04th, 12:54 pm

థాయ్‌లాండ్‌లో నిర్వహించిన బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) ఆరో సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రస్తుతం థాయ్‌లాండ్ అధ్యక్షత వహిస్తోంది. ‘‘బిమ్స్‌టెక్: సంక్షేమం, స్థిరత్వం, బహిరంగం’’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. బిమ్స్‌టెక్ ప్రాంత నాయకుల ప్రాధాన్యాలు, ప్రజల ఆకాంక్షలను ఇది ప్రతిపలిస్తుంది. అలాగే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో ఉమ్మడి వృద్ధి సాధిండచంలో బిమ్స్‌టెక్ ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.

బిమ్స్‌టెక్ దేశాల మధ్య సహకారానికి వివిధ అంశాలతో 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక.. ప్రధానమంత్రి ప్రతిపాదన

April 04th, 12:53 pm

బిమ్స్‌టెక్ ఆరో శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్బంగా బిమ్స్‌టెక్ సభ్యదేశాల మధ్య సహకారానికి సంబంధించిన వేర్వేరు అంశాలతో కూడిన 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. బిమ్స్‌టెక్ దేశాల వాణిజ్య స్థాయిని పెంచాలని, సమాచార సాంకేతిక విజ్ఞాన (ఐటీ) రంగానికున్న వాస్తవ శక్తిసామర్థ్యాలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. థాయిలాండ్, మయన్మార్‌లలో ఇటీవల భూకంపం వచ్చిన నేపథ్యంలో విపత్తు నిర్వహణ రంగంలో అంతా కలసి పని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. అంతరిక్ష రంగంలో మరింత కృషి చేయాలని, భద్రత వ్యవస్థను బలపరచుకోవాలని శ్రీ మోదీ స్పష్టం చేశారు. బిమ్స్‌టెక్‌కు ఉమ్మడి శక్తిని సమకూర్చడంతోపాటు ముందుండి నాయకత్వాన్ని వహించాల్సిందిగా యువజనులను ఆయన కోరారు. సాంస్కృతిక సంబంధాలు బిమ్స్‌టెక్ సభ్యదేశాలను మరింత సన్నిహితం చేయగలవన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ చైర్మన్ సీనియర్ జనరల్ మింగ్ ఆంగ్ హ్లాయింగ్‌తో ప్రధానమంత్రి భేటీ

April 04th, 09:43 am

మయన్మార్‌లో విధ్వంసకర భూకంపం తరువాతి స్థితినీ, మయన్మార్‌కు మానవతాపూర్వక సహాయంతోపాటు వైద్యసహాయం అందించడానికీ, ఉపశమన చర్యలు చేపట్టడానికీ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’లో భాగంగా భారత్ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించీ నేతలిద్దరూ చర్చించారు. భారత్ సహాయ కార్యకలాపాలకుగాను సీనియర్ జనరల్ కృతజ్ఞ‌త వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో.... మొదటి ప్రతిస్పందన దేశంగా భారత్.. మయన్మార్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుందనీ, అవసరమైతే మరింత సహాయక సామగ్రిని, వనరులను కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉందనీ ప్రధాని శ్రీ మోదీ తెలిపారు.

థాయిలాండ్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

April 03rd, 08:42 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అధికారిక థాయిలాండ్‌ పర్యటనలో భాగంగా ఈరోజు బ్యాంకాక్‌లో థాయిలాండ్ ప్రధాని శ్రీ పేటోంగ్‌టార్న్ షినవత్రాతో భేటీ అయ్యారు. ప్రభుత్వ అధికారిక నివాసానికి చేరుకున్న ప్రధానమంత్రికి షినవత్రా సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. వీరిరువురి మధ్య ఇది రెండో సమావేశం. 2024 అక్టోబర్‌లో వియంటియాన్‌లో జరిగిన ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ఇరువురు నేతలు తొలిసారిగా భేటీ అయ్యారు.

పాళీ భాషలో త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయిలాండ్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ

April 03rd, 05:43 pm

పాళీలో ఉన్న త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయ్ లాండ్ ప్రధానమంత్రి శ్రీమతి పేతోంగ్‌తార్న్ షినవత్రకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పాళీ అందమైన భాష అని, అది బుద్ధ భగవానుడి బోధనల సారాంశాన్ని కలిగివుందని ఆయన ప్రశంసించారు.

థాయ్ లాండ్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

April 03rd, 03:01 pm

మార్చి 28న ఇక్కడ సంభవించిన భూకంపం వల్ల జరిగిన ప్రాణ నష్టానికి భారత ప్రజల తరఫున నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

థాయ్ రామాయణం ‘రామకియేన్’ మనోహర ప్రదర్శనను చూసిన ప్రధానమంత్రి

April 03rd, 01:02 pm

భారతదేశానికి, థాయిలాండుకు మధ్య ప్రగాఢమైన సాంస్కృతిక, నాగరికత బంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆయన ఈ రోజు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో థాయి రామాయణం ‘రామకియేన్’ మనోహర ప్రదర్శనను వీక్షించారు.

థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

April 03rd, 11:01 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ చేరుకున్నారు. ఆయన BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రాతో కూడా చర్చలు జరుపుతారు.

థాయ్ లాండ్ , శ్రీలంక పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన

April 03rd, 06:00 am

థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేతోంగ్‌తార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు ఆ దేశంలో అధికారిక పర్యటనతో పాటు ఆరో బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొనేందుకు ఈ రోజు బయలుదేరుతున్నాను.

2025 ఏప్రిల్ 03-06 వరకు థాయిలాండ్ మరియు శ్రీలంకలలో ప్రధానమంత్రి పర్యటన

April 02nd, 02:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి (ఏప్రిల్ 3-4, 2025) థాయిలాండ్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఆహ్వానం మేరకు (ఏప్రిల్ 4-6, 2025) శ్రీలంకకు రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు.