సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారత అధికారిక పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
May 22nd, 04:11 pm
ఉగ్రవాద నిరోధంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందంసైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త మీడియా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
May 22nd, 01:00 pm
పర్యటన సందర్భంగా మీ ఆప్యాయత, స్నేహం, భారతదేశంతో మీకున్న బలమైన అనుబంధాన్ని మేం మనస్ఫూర్తిగా అనుభూతి చెందాం. నేడు మీ భారత పర్యటన.. మన ఉమ్మడి ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.భారత్-నార్డిక్ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన
May 19th, 04:25 pm
ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోంది. సాంకేతికత, సుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తిని, వేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.స్వీడన్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి
May 18th, 12:10 am
స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో స్వీడన్ యువరాణి విక్టోరియా కూడా పాల్గొన్నారు. స్వీడన్ రాజు కార్ల్ XVI గుస్టాఫ్, రాణి సిల్వియాల తరఫున ఆమె ప్రధానమంత్రి మోదీకి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజు కార్ల్ XVI గుస్టాఫ్ 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.ఎంపిక చేసిన స్వీడన్ వ్యాపార దిగ్గజాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భేటీ
May 17th, 11:16 pm
భారత్, స్వీడన్ దేశాలు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, సుస్థిరత వంటి ఉమ్మడి విలువల ద్వారా అనుసంధానమయ్యాయని, ఇవి ఉన్నత లక్ష్యాలను కలిగి భవిష్యత్ ఆధారిత ఆర్థిక భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు భారత్, స్వీడన్ భాగస్వామ్యం కేవలం ఒక ఆర్థిక సంబంధం మాత్రమే కాదని, అది ఆలోచనలు, సాంకేతికత, ఆవిష్కరణలు, సహ సృష్టి ల భాగస్వామ్యమని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. భారతదేశ వృద్ధికి స్వీడిష్ కంపెనీలు సుదీర్ఘకాలంగా అందిస్తున్న సహకారాన్ని ఆయన స్వాగతించారు. పరిశోధన, ఆవిష్కరణలు, ఇంధన మార్పు, తయారీ ఉత్పాదక రంగాలలో మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఆఫ్స్లూయిట్‌డైక్ డ్యామ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి
May 17th, 03:38 pm
నెదర్లాండ్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీటి నిర్వహణ కట్టడమైన 'ఆఫ్స్లూయిట్‌డైక్' ఆనకట్టను నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు.India-Netherlands Joint Statement on the visit of Prime Minister of India to Netherlands
May 17th, 03:45 am
At the invitation of Netherlands PM Rob Jetten, PM Modi paid an official visit to the Netherlands. They held discussions and expressed their desire to further expand and deepen the multifaceted relationship between the two countries. Noting with satisfaction the progress achieved in recent years, they elevated bilateral ties to a 'Strategic Partnership' and welcomed the adoption of a Strategic Partnership Roadmap.భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక [2026-2030]
May 17th, 03:15 am
2026 మే 16న హేగ్ నగరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్దిష్ట లక్ష్యాలు, కాలపరిమితితో కూడిన కార్యక్రమాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికల ద్వారా భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ లక్ష్య సాధన కోసం రాబోయే 5 సంవత్సరాల కాలానికి (2026-2030) ‘భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక’ను ఇరు దేశాలు ఆమోదించాయి.నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్ ఎటెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక చర్చలు
May 17th, 02:35 am
ఈ సమావేశంలో భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, విశ్వాసంతోపాటు సమన్వయం, సహకారం ఇనుమడించడాన్ని ప్రతిబింబిస్తూ, ఈ స్నేహబంధాన్ని “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, అత్యాధునిక-కీలక సాంకేతికతలు, సముద్ర రంగం, పునరుత్పాదక ఇంధనం, విద్యా రంగాల్లో సహకార విస్తృతి దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యంపై భవిష్యత్ ప్రణాళిక ఆమోదానికి నిశ్చయించారు. ఉభయ పక్షాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత-ఆవిష్కరణల భాగస్వామ్య విస్తరణ సహా భారత వృద్ధి ప్రస్థానం డచ్ కంపెనీలకు ఆశావహ వ్యాపార అవకాశాలను కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.డచ్ ‘సీఈవో’లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
May 16th, 10:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్ జెట్టెన్‌తో సంయుక్తంగా ఆ దేశంలోని వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈవో)తో సమావేశమయ్యారు. ఇంధనం, ఓడరేవులు, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పలు రంగాల్లోని ప్రసిద్ధ కంపెనీల ‘సీఈవో’లతో అనేక అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్లు, సాంకేతికత-ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, రవాణా, సముద్ర రంగం, సుస్థిరత, ఇంధనం, వ్యవసాయ రంగాలపై తమ ఆలోచనలను పంచుకుంటూ, భారత్‌కు సంబంధించి తమ వ్యాపార వ్యూహాలను వివరించారు.ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అలీ ఫాలిహ్ కాధిమ్ అల్-జైదీకి ప్రధానమంత్రి అభినందనలు
May 16th, 01:35 pm
ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫాలిహ్ కాధిమ్ అల్-జైదీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఇరాక్‌తో దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలకు భారత్ ఎంతో విలునిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయటానికి భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
May 16th, 01:30 pm
ఇంతటి అపారమైన ఆదరాభిమానాలు.. ఇంతటి అద్భుతమైన ఉత్సాహం. నిజం చెప్పాలంటే ఒక్క క్షణం నేను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే విషయమే మర్చిపోయాను. భారత్‌లోనే ఎక్కడో ఒక పెద్ద పండుగ జరుగుతున్నట్లు అనిపిస్తోంది.Prime Minister addresses the Indian Diaspora in the Netherlands
May 16th, 01:20 pm
Addressing a massive community programme in The Hague, Netherlands, PM Modi praised the Indian diaspora for its contributions to Dutch society and for serving as a living bridge between India and the Netherlands. He highlighted the sporting linkages that contribute to close people-to-people ties between the two countries. He also called upon the diaspora to actively contribute to India's journey towards Viksit Bharat.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రధానమంత్రి పర్యటన
May 15th, 03:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్, వియత్నాం దేశాల సంయుక్త ప్రకటన
May 06th, 05:24 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.వియత్నాం అధ్యక్షుడి అధికారిక భారత పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
May 06th, 03:44 pm
ఐఆర్ఈఎల్ (భారత్), వియత్నాంకు చెందిన రేడియోధార్మిక - అరుదైన మూలకాల సాంకేతిక సంస్థ (ఐటీఆర్ఆర్ఈ) మధ్య పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందంవియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం అధ్యక్షుడితో ఉమ్మడి మీడియా సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
May 06th, 01:00 pm
భారత్-వియత్నాం భాగస్వామ్యంలో వారసత్వం, అభివృద్ధి రెండూ కీలకమే. గతేడాది భారత్ నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాలను వియత్నాంకు తీసుకువెళ్లినప్పుడు అక్కడి జనాభాలో సుమారు పదిహేను శాతం మంది అంటే.. పదిహేను మిలియన్లకు పైగా ప్రజలు వాటిని దర్శించుకున్నారు. మన ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించేందుకు, వియత్నాంలోని మై సన్, న్హాన్ టవర్స్ వద్ద ప్రాచీన చాం నాగరికత దేవాలయాల పునరుద్ధరణను మేం చేపడుతున్నాం. చాం నాగరికతకు సంబంధించిన రాతప్రతులను కూడా డిజిటలైజ్ చేసి, ఈ అమూల్యమైన వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరుస్తున్నాం.ఇంధన వనరుల భద్రతపై భారత్, కొరియా సంయుక్త ప్రకటన
April 20th, 10:56 pm
బహిరంగ, సమ్మిళిత, సంపన్న ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడి దార్శనికత కలిగిన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వాములు భారత్, కొరియా.నౌకానిర్మాణం, షిప్పింగ్, నౌకా రవాణాపై భాగస్వామ్యానికి భారత్-ఆర్‌వోకే సమగ్ర విధానం
April 20th, 10:51 pm
భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా కొరియా రిపబ్లిక్ (ఆర్‌వోకే) అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యుంగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో 2026 ఏప్రిల్ 20న సమావేశమయ్యారు. ఈ చర్చల్లో నౌకా నిర్మాణం, షిప్పింగు, నౌకా రవాణా భాగస్వామ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారంపై ఉభయపక్షాలు ఫలవంతమైన, విస్తృతమైన ఆలోచనలను పంచుకున్నాయి.కొరియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
April 20th, 01:05 pm
భారతదేశానికి తొలిసారి వచ్చిన అధ్యక్షుడు లీని స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉంది. . ఆయన జీవితం పట్టుదల, సేవ, అంకితభావాలకు స్ఫూర్తిదాయక నిదర్శనం. ఆయన ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రజలకు సేవ చేయాలనే ఆయన సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇది ఆయన తొలి భారత పర్యటన అయినప్పటికీ, మా మొదటి సమావేశం లోనే దేశంపై ఆయనకున్న అభిమానం, ఆత్మీయత స్పష్టంగా కనిపించింది.