న్యూజిలాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి

July 11th, 08:09 am

ఆక్లాండ్‌లోని గవర్నమెంట్ హౌస్‌లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ రోజు గవర్నమెంట్ హౌస్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాంప్రదాయిక మావోరీ స్వాగతం లభించింది. ఈ వేడుకలో శాంతి, గౌరవం, స్వాగతానికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయిక మావోరీ ఆచారాలను ప్రదర్శించారు. సాంప్రదాయిక స్వాగతం అనంతరం, ప్రధానమంత్రి ఆ దేశ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Third India-Australia Annual Summit Joint Statement

July 09th, 10:58 am

At the invitation of Australian PM Anthony Albanese, PM Modi visited Australia from 8-10 July 2026 for the Third Australia-India Annual Summit in Melbourne. The two leaders reaffirmed their shared commitment to further consolidate and expand the India-Australia Comprehensive Strategic Partnership (CSP) and explore new areas of cooperation for the peace, prosperity and stability of the shared region.

సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

June 28th, 05:00 pm

ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.

ప్రధానమంత్రికి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారంతో సీషెల్స్‌ సత్కారం

June 28th, 03:07 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సీషెల్స్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ పాట్రిక్ హర్మినీ ఇవాళ ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ విశిష్ట పురస్కారంతో సత్కరించారు. కాలుష్య రహిత భూగోళం లక్ష్యంగా నాయకత్వం వహిస్తున్నందుకు, వర్ధమాన దేశాల ప్రయోజనాల కోసం గళమెత్తిన ఆయనను ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ బిరుదుతో గౌరవించారు. అలాగే, నీలి ఆర్థిక వ్యవస్థ వికాసం, వాతావరణ ప్రభావ ఉపశమన చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, వర్ధమాన చిన్న ద్వీపదేశాల అభివృద్ధి ఆకాంక్షలను ప్రోత్సహించడంలో ఆయన దీర్ఘకాలిక నిబద్ధతకు గుర్తింపుగా ప్రధానమంత్రికి ఈ గౌరవం లభించింది. ఈ విశిష్ట పురస్కారం ప్రత్యేకంగా ఏర్పరచి, ఒక అంతర్జాతీయ నాయకుడికి ప్రదానం చేయడం ఇదే తొలిసారి.

సీషెల్స్‌ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

June 28th, 02:02 pm

అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.

ప్రధానమంత్రి సీషెల్స్ పర్యటన (జూన్ 27-29, 2026)

June 25th, 06:05 pm

సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు, భారతదేశపు 'మహాసాగర్' దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ 2026 జూన్ 27-29 తేదీలలో సీషెల్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరై, అధ్యక్షుడు హెర్మినితో చర్చలు జరుపుతారు. ఆయన సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించి, ప్రవాస భారతీయులతో కూడా సంభాషిస్తారు.

ఎవియాన్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షునితో సమావేశమైన ప్రధానమంత్రి

June 18th, 05:04 am

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో 2026 జూన్ 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.

జీ7 సదస్సు నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

June 17th, 12:38 am

2026 జనవరిలో అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భారత్‌లోనూ, 2026 మేలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూఏఈలోనూ పర్యటించారు. ఈ పర్యటనల అనంతరం రెండు దేశాల ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని, సానుకూల మార్పులను ఇద్దరు నాయకులు సమీక్షించారు. వాటిలో సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ రంగాలున్నాయి. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నాయకులిద్దరూ తమ ఆలోచనలను పంచుకున్నారు.

జీ7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ప్రధానమంత్రి భేటీ

June 16th, 10:36 pm

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జూన్ 16, 2026న జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశం

June 15th, 05:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్లోవాక్ పర్యటన సందర్భంగా చారిత్రాత్మక బ్రాటిస్లావా కోట వద్ద ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో అధికార లాంచనాలతో ఘనస్వాగతం పలికారు.

India and Slovakia are moving forward in close coordination on the global stage: PM Modi at the India-Slovakia Joint Press Meet

June 15th, 03:00 pm

At the joint press meet in Bratislava, PM Modi and Slovak Prime Minister Robert Fico announced the elevation of India-Slovakia ties to a Comprehensive Partnership. PM Modi highlighted growing cooperation in trade, technology, defence, space, digital innovation and mobility, saying the upgraded partnership reflects shared priorities, shared trust and a shared vision for the future.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

June 14th, 04:36 pm

ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.

ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం

June 14th, 03:00 pm

ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్‌ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్‌)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

ఫ్రాన్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

June 13th, 11:19 pm

తన పర్యటనలోని మొదటి అంచెను ప్రారంభించేందుకు ఫ్రాన్స్‌లోని నైస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ఉన్న బలమైన, శాశ్వత సంబంధాలకు నిదర్శనంగా ఆయనకు ప్రత్యేక, ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ పర్యటన, బలపడుతున్న భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని, విభిన్న రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవాలనే ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతోంది.

Visit of Prime Minister to France and Slovakia (June 13-18, 2026)

June 09th, 07:20 pm

PM Modi will visit France from 13-14 June 2026 and again from 16-19 June 2026. During his initial visit to France, he will hold discussions with President Emmanuel Macron and jointly inaugurate the 'Bharat Innovates' event. He will then visit Slovakia from 14-16 June 2026 to hold discussions with PM Robert Fico and meet President Peter Pellegrini. The PM will once again visit France to participate in the G7 Summit and the VivaTech Summit.

మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్‌తో ప్రధానమంత్రి చర్చలు

June 01st, 08:09 pm

మయన్మార్ అధ్యక్షుడు శ్రీ యు మిన్ ఆంగ్ హలైన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఫలప్రదమైన చర్చలు జరిపారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి

May 23rd, 04:20 pm

అమెరికా విదేశాంగ మంత్రి గౌరవ మార్కో రూబియో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారత అధికారిక పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు

May 22nd, 04:11 pm

ఉగ్రవాద నిరోధంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం

సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త మీడియా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

May 22nd, 01:00 pm

పర్యటన సందర్భంగా మీ ఆప్యాయత, స్నేహం, భారతదేశంతో మీకున్న బలమైన అనుబంధాన్ని మేం మనస్ఫూర్తిగా అనుభూతి చెందాం. నేడు మీ భారత పర్యటన.. మన ఉమ్మడి ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.

భారత్‌-నార్డిక్‌ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన

May 19th, 04:25 pm

ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోంది. సాంకేతికత, సుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తిని, వేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.