బీహార్ రాష్ట్ర జీవనోపాధి నిధి సహకార రుణ పరపతి సమాఖ్య లిమిటెడ్ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
September 02nd, 01:00 pm
బీహార్ ప్రజలకు అభిమానపాత్రులైన ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ కుమార్ సిన్హా, ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది సోదరీమణులారా... మీకందరికీ హృదయపూర్వక వందనం!బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 02nd, 12:40 pm
బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ మంగళప్రదమైన మంగళవారం రోజు, చాలా ఆశాజనక కార్యక్రమానికి నాందీప్రస్తావన చేసుకుంటున్నామన్నారు. జీవికా నిధి రుణ సహకార సంఘ రూపంలో బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఒక కొత్త సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం గ్రామాల్లో జీవికతో అనుబంధం కలిగి ఉన్న మహిళలకు మరింత సులభంగా ఆర్థిక సహాయ సహకారాన్ని అందుబాటులోకి తీసుకు వస్తుందని, వారు పనిలోను, వ్యాపారాల్లోను ముందడుగు వేయడానికి ఇది సాయపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. జీవికా నిధి వ్యవస్థ పూర్తి డిజిటల్ మాధ్యమంలో పనిచేస్తుందని, పనిగట్టుకొని కాళ్లరిగేలా తిరిగే అవసరం ఇక ఉండదని, ప్రతి పనినీ ఇప్పుడు చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే చక్కబెట్టవచ్చని చెబుతూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జీవికా నిధి రుణ సహకార సంఘం ప్రారంభం అయినందుకు బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ అసాధారణ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకు వచ్చినందుకు శ్రీ నీతీశ్ కుమార్‌ను, బీహార్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు.సెప్టెంబర్ 2న బీహార్ రాజ్య జీవిక నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రారంభించనున్న పీఎం
September 01st, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో మాధ్యమం ద్వారా బీహార్ రాజ్య జీవిక నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆ సంస్థ బ్యాంకు ఖాతాకు రూ.105 కోట్లను కూడా బదిలీ చేస్తారు.