బీహార్ కోకిల శారదా సిన్హాకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

November 05th, 10:36 am

బీహార్ కోకిల శారదా సిన్హా ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. జానపద పాటల ద్వారా ఆమె బీహార్ కళలు, సంస్కృతికి కొత్త గుర్తింపునిచ్చారు. దీని కోసం ఆమెను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఛఠ్ పండగతో అనుబంధం గల ఆమె మధురమైన పాటలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి అని శ్రీ మోదీ పేర్కొన్నారు.