ప్రధానమంత్రి భూటాన్ అధికారిక పర్యటనపై సంయుక్త పత్రికా ప్రకటన

November 12th, 10:00 am

పర్యటనలో భాగంగా నవంబర్ 11న చాంగ్లిమిథాంగ్‌లో భూటాన్ నాలుగో రాజు 70వ జన్మదిన వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. అలాగే థింపులో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రార్థన ఉత్సవంలో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలు పూజలర్పించడానికి భారత్ నుంచి బుద్ధ భగవానుని పవిత్ర పిప్రాహ్వా అవశేషాలను ఈ ఉత్సవంలో ఉంచడాన్ని భూటాన్ రాజు అభినందించారు.

Prime Minister receives audience with the Fourth King of Bhutan and participates in the Global Peace Prayer Festival

November 12th, 09:54 am

PM Modi met with His Majesty Jigme Singye Wangchuck, the Fourth King of Bhutan, in Thimphu. The PM extended his best wishes on the occasion of His Majesty’s 70th birth anniversary and lauded him for his leadership in further strengthening India-Bhutan friendship. The PM also joined His Majesty the King of Bhutan, His Majesty the Fourth King of Bhutan, and the Prime Minister of Bhutan at the Kalachakra initiation ceremony at Changlimethang Stadium.

భూటాన్ రాజుతో ప్రధానమంత్రి సమావేశం

November 11th, 06:14 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు థింఫు నగరంలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్‌ వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌-భూటాన్‌ ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంతోపాటు పటిష్ఠం చేయడంపై వారిద్దరూ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండు దేశాల ప్రయోజనాలతో ముడిపడిన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపైనా వారు చర్చించారు. ఢిల్లీ దుర్ఘటనలో ప్రాణనష్టంపై మాననీయ భూటాన్‌ రాజు సంతాపం ప్రకటించారు.

ప్రధానమంత్రి భూటాన్‌ పర్యటన: ముఖ్య నిర్ణయాలు

November 11th, 06:10 pm

పునరుత్పాదక ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని వ్యవస్థీకృతం చేయడమే ఈ అవగాహన ఒప్పంద లక్ష్యం. ఇది సౌరశక్తి, పవన శక్తి, బయోమాస్, శక్తి నిల్వ, గ్రీన్ హైడ్రోజన్ మరియు సామర్థ్య నిర్మాణం వంటి రంగాలలో కలిసి పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఢిల్లీ ఘటనపై భూటాన్ సంఘీభావానికి కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధాని

November 11th, 03:01 pm

గౌరవ భూటాన్ నాలుగో రాజు 70వ జన్మదిన వేడుకలో భారత్‌కు సంఘీభావం తెలిపిన ఆ దేశ ప్రజలకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో.. బాధితులు, వారి కుటుంబాల కోసం భూటాన్ ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘‘ఈ సానుభూతిని నేనెన్నటికీ మరచిపోలేను’’ అంటూ.. కరుణను, ఐక్యతను చాటిన ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

భూటాన్ రాజు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ప్రధాని ప్రసంగం

November 11th, 12:00 pm

బాధ్యులందరినీ చట్టం ఎదుట నిలబెడతాం.

భూటాన్‌లోని థింఫులో చాంగ్లిమెథాంగ్ సెలబ్రేషన్ గ్రౌండ్‌లో జరిగిన సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 11th, 11:39 am

భూటాన్ కు, భూటాన్ రాజ కుటుంబానికి, ప్రపంచశాంతిని కోరే ప్రతి ఒక్కరికీ ఇవాళ ముఖ్యమైన రోజని ప్రధానమంత్రి అన్నారు. భారత్, భూటాన్ మధ్య శతాబ్దాలుగా ఉన్న బలమైన భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాలను ఆయన వివరించారు. ఇలాంటి కీలక సందర్భంలో తాను ఇక్కడికి రావడం భారతదేశపు ప్రాధాన్యత మాత్రమే కాదు..అది తనది కూడానని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందని, ఈ క్రమంలో తాను బరువెక్కిన హృదయంతో భూటాన్ కు వచ్చినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. బాధిత కుటుంబాల దుఃఖాన్ని తాను అర్థం చేసుకోగలనని, దేశం మొత్తం వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలతో రాత్రంతా సంప్రదింపులు జరిపినట్లు ప్రధానమంత్రి తెలిపారు. భారత ఏజెన్సీలు ఈ కుట్రను బయటపెడతాయని, దాడికి కారణమైన వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. కుట్రదారులను న్యాయస్థానం ఎదుట నిలబెడతామని తెలిపారు.

PM Modi arrives in Bhutan for a two-day state visit

November 11th, 10:42 am

PM Modi arrived in Bhutan a short while ago. His two-day visit seeks to strengthen the special ties of friendship and cooperation between the two countries. The PM was given a warm welcome by Prime Minister of Bhutan Mr. Tshering Tobgay at the airport.

భూటాన్‌కు బయలుదేరే ముందు ప్రధానమంత్రి ప్రకటన

November 11th, 07:28 am

2025 నవంబర్ 11 నుంచి 12వ తేదీ వరకు నేను భూటాన్‌లో పర్యటిస్తాను.

భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను గౌరవపూర్వకంగా స్వాగతించినందుకు

November 09th, 03:43 pm

భారత్ నుంచి పంపిన భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను గౌరవపూర్వకంగా స్వాగతించినందుకు భూటాన్ ప్రజలకూ, భూటాన్ నాయకత్వానికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ అవశేషాలు... శాశ్వతమైన శాంతి, కరుణ, సద్భావనలకు ప్రతీక అని శ్రీ మోదీ అన్నారు. ‘‘భగవాన్ బుద్ధుని ప్రబోధాలు మన ఇరు దేశాల ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వాల మధ్య ఒక పవిత్ర బంధాన్ని ఏర్పరిచాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 నవంబర్ 11-12 తేదీలలో భూటాన్‌లో రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు

November 09th, 09:59 am

రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ 2025 నవంబర్ 11-12 తేదీలలో భూటాన్‌లో రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో, ప్రధానమంత్రి భూటాన్ రాజు మరియు భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గేను కలుస్తారు. భూటాన్ నాల్గవ రాజు హిజ్ మెజెస్టి జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 70వ జయంతి వేడుకలకు మరియు ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవానికి కూడా ప్రధాని హాజరవుతారు.

Prime Minister welcomes visit of Bhutan Prime Minister to Shri Ram Janmabhoomi Mandir

September 06th, 08:28 pm

The Prime Minister, Shri Narendra Modi has expressed his pleasure to see PM Tobgay and his wife pray at the Shri Ram Janmabhoomi Mandir in Ayodhya.The ideals of Prabhu Shri Ram give strength and inspiration to millions across the globe, Shri Modi stated.

భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి

August 15th, 07:26 pm

మన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో నగర గ్యాస్ సరఫరా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 29th, 01:30 pm

ఈ చారిత్రాత్మక అలీపుర్‌దువార్ గడ్డ నుంచి బెంగాల్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను!

పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దౌర్‌లో రూ.1010 కోట్లకుపైగా విలువైన ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన

May 29th, 01:20 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దౌర్‌లో నగర గ్యాస్ సరఫరా (సిజిడి) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నగర గ్యాస్ సరఫరా (సిజిడి) నెట్‌వర్క్‌ విస్తరణలో ఇదొక కీలక ముందడుగు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో- చారిత్రక అలీపూర్‌దౌర్‌ గడ్డమీదినుంచి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత సుసంపన్న సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దీని సరిహద్దులే కాకుండా ఇక్కడి ప్రాచీన సంప్రదాయాలు, సంబంధాలు కూడా ఈ అంశాన్ని స్పష్టంగా నిర్వచిస్తాయని చెప్పారు. మన పొరుగు దేశం భూటాన్‌తో అలీపూర్‌దౌర్‌ సరిహద్దును పంచుకుంటుండగా, దీనికి సరసనేగల అస్సాం ఈ ప్రాంతాన్ని అక్కున చేర్చుకుంటుందన్నారు. మరోవైపు జల్పాయ్‌గురి ప్రకృతి సౌందర్యం, కూచ్బెహార్ ప్రతిష్ఠ ఈ ప్రాంతంలో అంతర్భాగాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాల్ వారసత్వం, ఐక్యతలోనూ విశిష్ట పాత్రగల ఈ సుసంపన్న అలీపూర్‌దౌర్‌ నేలను సందర్శించడం తనకు దక్కిన గౌరవమని ఆయన హర్షం ప్రకటించారు.

భూటాన్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

April 04th, 01:30 pm

బిమ్స్‌టెక్ 6వ శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా భూటాన్ ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

2025 ఏప్రిల్ 03-06 వరకు థాయిలాండ్ మరియు శ్రీలంకలలో ప్రధానమంత్రి పర్యటన

April 02nd, 02:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి (ఏప్రిల్ 3-4, 2025) థాయిలాండ్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఆహ్వానం మేరకు (ఏప్రిల్ 4-6, 2025) శ్రీలంకకు రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు.

భారత్, భూటాన్ దేశాల మధ్య గల విలక్షణమైన చారిత్రక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధానమంత్రి

February 21st, 07:16 pm

న్యూఢిల్లీలో ఏర్పాటైన సోల్ నాయకత్వ సదస్సులో భూటాన్ ప్రధానమంత్రి శ్రీ షెరింగ్ టోగ్బే ప్రసంగించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, భారత్, భూటాన్ దేశాల మధ్య గల విలక్షణమైన చారిత్రక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు.

న్యూఢిల్లీలో సోల్‌ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 21st, 11:30 am

భూటాన్ ప్రధానమంత్రి, నా సోదరుడు దషో షెరింగ్ టోబ్‌గే, సోల్ (స్కూల్‌ ఆఫ్‌ అల్టిమేట్‌ లీడర్‌షిప్‌) బోర్డు చైర్మన్ సుధీర్ మెహతా, వైస్ చైర్మన్ హన్స్ముఖ్ అధియా, జీవితాల్లో, ఆయా రంగాల్లో నాయకత్వాన్ని అందించడంలో విజయం సాధించిన ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, ఇంకా ఇక్కడ నేను చూస్తున్న అలాంటి గొప్ప వ్యక్తులు, అలాగే భవిష్యత్తు ఎదురుచూస్తున్న నా ఇతర యువ సహచరులారా…

సోల్ నాయకత్వ సదస్సు మొదటి సంచికను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 21st, 11:00 am

స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్) సదస్సు-2025 మొదటి సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు, భవిష్యత్తులో నాయకులుగా ఎదగబోతున్న యువతకు శ్రీ మోదీ స్వాగతం పలికారు. కొన్ని కార్యక్రమాలు మనసుకు దగ్గరగా ఉంటాయని ఈ రోజు జరుగుతున్న సదస్సు కూడా అలాంటిదే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘దేశ నిర్మాణానికి మెరుగైన పౌరులను తయారు చేయడం, ప్రతి రంగంలోనూ అద్భుతమైన నాయకులను తీర్చిదిద్దడం అవసరం’’ అని ప్రధాని అన్నారు. ప్రతి రంగంలోనూ గొప్ప నాయకులను తయారుచేయడం ప్రస్తుతం చాలా అవసరమని ఆయన తెలిపారు. ఈ దిశగా సాగుతున్న వికసిత్ భారత్ అభివృద్ధి ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్‌ను ఓ ముఖ్యమైన మైలురాయిగా వర్ణించారు. ఈ సంస్థ పేరుకి తగినట్టుగానే తనలో భారతీయ సామాజిక జీవన ఆత్మను నిలుపుకొని, దానిని కొనసాగిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అనుభవ సారాన్ని సోల్ అందంగా ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. సోల్ సంస్థకు సంబంధించిన అన్ని విభాగాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థకు భవిష్యత్తులో గుజరాత్‌లో ఉన్న గిఫ్ట్ సిటీలో విస్తృతమైన క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.