అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న హర్యానాలో పర్యటించనున్న ప్రధానమంత్రి

April 12th, 04:48 pm

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్యానాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు హిసార్‌కు చేరుకుని, అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లే వాణిజ్య విమానాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అలాగే హిసార్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.