తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 11th, 05:45 pm

తమిళనాడు భవిష్యత్తుకు నేటి కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఇది ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు సంబంధించినది. ఈ ప్రాజెక్టులు: స్వచ్ఛ ఇంధనం కోసం మౌలిక సదుపాయాలు, పెట్రోలియం సంబంధిత తయారీ రంగాలు, రహదారులు, రైల్వేలు, గ్రామీణ రోడ్లకు సంబంధించినవి. ఇవి ఇంధన లభ్యతను, అనుసంధానాన్ని పెంచుతాయి తమిళనాడు యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి.

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో దాదాపు ₹5,650 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 11th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తమిళనాడులోని చారిత్రక నగరం తిరుచ్చిలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా పరిణామాత్మక అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ మేరకు రూ.5600 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్య రహిత ఇంధనం, పెట్రోలియం సంబంధిత తయారీ, హైవే-రైల్వే, గ్రామీణ రహదారుల రంగాల్లో ఈ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- “ఇవన్నీ తమిళనాడు యువతకు ఇంధన లభ్యత, బహుళ రవాణా అనుసంధానం సహా వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి” అని పేర్కొన్నారు.

మార్చి 11న కేరళ, తమిళనాడులో పర్యటించనున్న ప్రధానమంత్రి

March 09th, 09:54 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 11న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కేరళలోని ఎర్నాకుళంలో సుమారు రూ. 10,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం కార్యక్రమాలు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5:45 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో సుమారు రూ. 5,650 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

జులై 18న... బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటన

July 17th, 11:04 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 18న బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం 11:30 గంటలకు బీహార్ లోని మోతీహారీలో రూ. 7,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు. అనంతరం, ఒక బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

జూలై 12న దియోఘ‌ర్‌, పాట్నాల‌ను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

July 09th, 09:35 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ 2022 జూలై 12న దియోఘ‌ర్‌, పాట్నాల‌ను సంద‌ర్శించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 1.15 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి 16,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా విలువ‌గ‌ల ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు దియోఘ‌ర్ లో శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అనంత‌రం 12.40 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి బాబావైద్య‌నాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించి పూజ‌లు చేయ‌నున్నారు. బాబా వైద్య‌నాథ ఆల‌యం 12 జ్యోతిర్లింగాల‌లో ఒక‌టి. సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి పాట్నాలో బీహార్ శాస‌న‌స‌భ శ‌త‌వార్షికోత్స‌వాల‌లో ప్ర‌సంగిస్తారు.

ఈ నెల 14న త‌మిళ నాడు ను, కేర‌ళ ను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

February 12th, 06:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 14న త‌మిళ నాడు, కేర‌ళ రాష్ట్రాల‌ ను సంద‌ర్శించ‌నున్నారు. ప‌గ‌టి పూట 11 గంట‌ల 15 నిముషాల‌ కు చెన్నై లో ప్ర‌ధాన మంత్రి అనేక కీల‌క‌మైన ప్రాజెక్టుల కు ప్రారంభోత్స‌వం/శంకు స్థాప‌న చేస్తారు. అర్జున్ ప్ర‌ధాన యుద్ధ ట్యాంకు (ఎమ్‌కె-1ఎ)ని సైన్యాని కి అప్ప‌గిస్తారు. సాయంత్రం 3 గంట‌ల 30 నిముషాల‌ కు కొచ్చి లో వివిధ ప్రాజెక్టుల ను దేశానికి అంకితం చేయ‌డంతో పాటు, కొన్ని ప‌థ‌కాల కు శంకు స్థాప‌న కూడా చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల వృద్ధి గ‌తికి కీల‌క‌మైన వేగాన్ని జ‌త ప‌ర‌చ‌డ‌మే కాకుండా, పూర్తి స్థాయి అభివృద్ధి సామ‌ర్ధ్యాన్ని సంత‌రించుకోవ‌డానికి తోడ్పడుతాయి.