సంయుక్త ప్రకటన: యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ భారతదేశ పర్యటన

January 19th, 08:10 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారంలోని అన్ని అంశాలను సమీక్షించారు. గత దశాబ్ద కాలంగా భారత్-యూఏఈ 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' నిరంతరం బలపడుతూనే ఉందని ఇద్దరు నాయకులు పేర్కొన్నారు.

దుబయి లోనిజెబెల్ అలీ లో భారత్ మార్ట్ కు వర్చువల్ పద్ధతి లో శంకుస్థాపన చేయడమైంది

February 14th, 03:48 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు దుబయి ఉపాధ్యక్షుడు, ప్రధాని మరియు పాలకుడు అయిన శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ లు దుబయి లోని జెబెల్ అలీ స్వేచ్ఛా వ్యాపార మండలం లో డిపి వరల్డ్ ద్వారా నిర్మాణం జరుగనున్న భారత్ మార్ట్ కు 2024 ఫిబ్రవరి 14 వ తేదీ నాడు వర్చువల్ పద్ధతి లో శంకుస్థాపన చేశారు.