ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి

March 02nd, 07:20 am

ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహూతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత ప్రాంతీయ స్థితిపై శ్రీ నెతన్యాహూతో ప్రధానమంత్రి చర్చించారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ప్రధానమంత్రి భేటీ

February 26th, 08:56 pm

భారత్ - ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలపై వారు సమగ్రమైన చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని, స్నేహాన్ని ప్రతిబింబిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను శాంతి, ఆవిష్కరణ, అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ స్థాయి పెంపు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర ప్రయోజనాల కలయికకు, సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం ఇరు దేశాలకున్న ఉమ్మడి దార్శనికతకు చిహ్నంగా నిలుస్తుంది.

భారత్‌-ఇజ్రాయెల్‌ సంయుక్త ప్రకటన

February 26th, 07:44 pm

భారత్‌-ఇజ్రాయెల్ దేశాల మధ్యగల సాన్నిహిత్యం, సద్భావన, ప్రగాఢ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆయనతో పాటు సీనియర్ మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. ఈ సందర్భంగా 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ చారిత్రక పర్యటనను, 2018లో ప్రధానమంత్రి నెతన్యాహు భారత పర్యటనను వారిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఈ పర్యటనలతో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారంలో నవశకం ప్రారంభమైంది. తద్వారా అత్యాధునిక సాంకేతికతలు, సైబర్ భద్రత, వ్యవసాయం, జల నిర్వహణ, ఆరోగ్యం, వ్యవస్థాపన, రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక బంధం విశేషంగా పురోగమించడంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని “శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు దిశగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించేందుకు ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఫలితాలు

February 26th, 07:41 pm

భూభౌతిక అన్వేషణ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో భారత ప్రధాని చేసిన ప్రకటన

February 26th, 03:30 pm

తొమ్మిదేళ్ల క్రితం, ఇజ్రాయెల్‌ను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా నిలిచే గౌరవం నాకు దక్కింది. ఈ చారిత్రక ఇజ్రాయెల్ గడ్డపై మరోసారి అడుగు పెట్టడం నాకు గర్వకారణం. ఇంకా అత్యంత భావోద్వేగపూరితమైన క్షణంగా అనిపిస్తోంది.

జెరూసలెంలో సాంకేతిక ప్రదర్శనను చూసిన ప్రధానమంత్రి

February 26th, 10:37 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్‌లో ఒక ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహూ ఉన్నారు. వివిధ రంగాల్లో ఇజ్రాయెల్ మార్గదర్శక నవకల్పనలను ఈ ఎగ్జిబిషన్లో కళ్లకు కట్టారు. వ్యవసాయ సంబంధిత సాంకేతికత, జల సాంకేతికత, వాతావరణ సాంకేతికత, ఆరోగ్య రంగ సాంకేతికత, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, క్వాంటమ్ సాంకేతిక రంగాలకు చెందిన అగ్రగామి కంపెనీలూ, పరిశోధన సంస్థలూ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి.

ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు చేరుకున్నారు

February 25th, 04:43 pm

ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి 2026 ఫిబ్రవరి 25-26 వరకు ఇజ్రాయెల్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఆయనకు ప్రధాని నెతన్యాహు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు మరియు విమానాశ్రయంలో సంప్రదాయ స్వాగతం పలికారు.

ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన

February 25th, 08:28 am

నా మిత్రుడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ ఆహ్వానం మేరకు ఆ దేశంలో 2026 ఫిబ్రవరి 25, 26 తేదీల్లో అధికారికంగా పర్యటిస్తాను.

ఇజ్రాయెల్‌‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

February 24th, 05:34 pm

ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించడంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 25వ, 26వ తేదీల్లో ఇజ్రాయెల్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఇజ్రాయెల్‌‌కు వెళ్లడం ఇది రెండో సారి కానుంది.

భారత ప్రధానికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని

January 07th, 03:03 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గౌరవ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ లో సంభాషించారు.

భారత ప్రధానమంత్రికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి

December 10th, 07:56 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడారు.

ఇజ్రాయెల్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలియజేసిన ప్రధానమంత్రి

October 21st, 11:23 am

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజిమన్ నెతన్యాహూకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే ఆయన అందించిన దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు చెబుతూ.. రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహాన్ని పునరుద్ఘాటించారు.

బందీల విడుదలను స్వాగతించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 13th, 07:59 pm

రెండు సంవత్సరాలకు పైగా బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. బందీల కుటుంబాల ధైర్యానికీ, శాంతి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.

అధ్యక్షుడు శ్రీ ట్రంప్ శాంతి ప్రణాళిక అమలులో పురోగతి...

October 09th, 10:17 pm

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహూతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక సజావుగా ముందుకు వెళ్లడంపై శ్రీ నెతన్యాహూకు అభినందనలు తెలిపారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రికీ, ఇజ్రాయెల్ ప్రజలకూ, యూదులకు రోష్ హషానా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

September 22nd, 10:45 pm

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి, ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi expresses gratitude to world leaders for birthday wishes

September 17th, 03:03 pm

The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.

జెరూసలేం‌లో జరిగిన ఘోర ఉగ్రదాడిని ఖండించిన ప్రధానమంత్రి

September 08th, 10:28 pm

జెరూసలేంలో అమాయక ప్రజలపై ఈ రోజు జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘‘అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, దాన్ని వ్యక్తపరిచే విధానాలను భారత్ ఖండిస్తోంది. అలాగే ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించని విధానంపై దృఢంగా నిలబడుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని

June 13th, 07:42 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది

April 24th, 03:29 pm

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలు బలిగొంది, ప్రపంచ నాయకుల నుండి బలమైన సంఘీభావం లభించింది. ప్రపంచ మద్దతుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు, భారతదేశం ఉగ్రవాదులను మరియు వారి మద్దతుదారులను భూమి చివరల వరకు వెంబడిస్తుంది అని ప్రతిజ్ఞ చేశారు.

బెంజిమన్ నెతన్యాహూకి హనుక్కా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

December 25th, 06:27 pm

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో పాటు ప్రపంచవ్యాప్తంగా హనుక్కా పర్వదినాన్ని జరుపుకొంటున్న వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.