జీ7 సదస్సు నేపథ్యంలో యూకే ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
June 17th, 12:36 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దైపాక్షిక సమావేశం నిర్వహించారు.‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ప్రాంగణంలో శ్రీశ్రీ రవిశంకర్‌తో ప్రధానమంత్రి సమావేశం
May 10th, 07:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రాంగణంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తో సమావేశమయ్యారు.బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
May 10th, 11:05 am
ఈ ఉదయం నాకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. వేద మంత్రోచ్చారణతో చిన్నారులు పలికిన స్వాగతం, శ్రీ గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ జన్మదినోత్సవం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం.. ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ అద్భుతమైన ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 10th, 11:00 am
కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికున్న పవిత్రత గురించి ప్రధాని తెలియజేశారు. వేద మంత్రాలతో చిన్నారులు స్వాగతం పలకడం, గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ సంవత్సరం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాలతో ఈ ఉదయం ప్రత్యేకంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.కాంగ్రెస్ అధికార దాహపు పుస్తకంలో 'పాలన' అనే అధ్యాయమే లేదు: బెంగళూరులో ప్రధాని మోదీ
May 10th, 09:46 am
కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రశంసిస్తూ, అస్థిరత మరియు కుంభకోణాల కంటే 'స్థిరత్వం, వేగం మరియు పరిష్కారాల'కే దేశ ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారని ఉద్ఘాటించారు. బెంగళూరు గడ్డపై నేడు కాషాయ సూర్యుడు ఉదయించాడని ఆయన పేర్కొన్నారు.కర్ణాటకలోని బెంగళూరులో భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
May 10th, 09:45 am
కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రశంసిస్తూ, అస్థిరత మరియు కుంభకోణాల కంటే 'స్థిరత్వం, వేగం మరియు పరిష్కారాల'కే దేశ ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారని ఉద్ఘాటించారు. బెంగళూరు గడ్డపై నేడు కాషాయ సూర్యుడు ఉదయించాడని ఆయన పేర్కొన్నారు.మే 10న కర్ణాటక, తెలంగాణలో పీఎం పర్యటన
May 09th, 11:17 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10, 2026న కర్ణాటక, తెలంగాణల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు బెంగళూరులో జరిగే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన కారణంగా ప్రాణ నష్టం... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
April 29th, 11:22 pm
కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన దురదృష్టకర ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.Tiruchirappalli turns out in huge numbers for PM Modi’s public meeting
March 11th, 06:00 pm
At a massive public meeting in Tamil Nadu’s Tiruchirappalli, Prime Minister Narendra Modi hailed Tiruchirappalli as a land of courage and faith, recalling the bravery of the Marudu Brothers and paying tribute to Major M. Saravanan for his sacrifice during the Kargil War. “Trichy is a land of courage and faith,” he said, adding that the Centre proudly honours Tamil Nadu’s culture and heritage. He also highlighted that C. P. Radhakrishnan, a son of the state, serves as the Vice President of India.ఇండియా-కెనడా సీఈఓ ఫోరమ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
March 02nd, 02:30 pm
ఇండియా-కెనడా సీఈఓ ఫోరమ్‌లో మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి కార్నీ సానుకూల ఆలోచనలను పంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.తమిళనాడులోని మధురైలో వివిధ మౌలిక సదుపాయాల పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
March 01st, 03:30 pm
పవిత్రమైన, చారిత్రక నగరమైన మధురైని సందర్శించడం గౌరవంగా భావిస్తున్నాను. మీనాక్షి అమ్మవారికీ, భగవాన్ సుందరేశ్వరుడికీ భక్తిపూర్వక ప్రణామాలు. తమిళనాడు అభివృద్ధి ప్రస్థానంలో నేటి ఈ కార్యక్రమం గర్వించదగ్గ ఘట్టం. దాదాపు రూ. 4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసుకున్నాం. ఈ ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉద్యోగావకాశాలను కల్పించి, లక్షలాది జీవితాల్లో మార్పును తెస్తాయి. రైతులు మార్కెట్లకు చేరుకోవడానికి మెరుగైన రోడ్లు, భక్తులకూ పర్యాటకులకూ సులభతరమైన ప్రయాణం, వ్యాపారులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించడమంటే ప్రజలను సాధికారత దిశగా నడిపించడమే.మదురైలో రూ.4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభం సహా దేశానికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
March 01st, 03:00 pm
“గడచిన పన్నెండేళ్లుగా తమిళనాడు హైవే నెట్‌వర్క్‌లో కేంద్ర ప్రభుత్వం గణనీయ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో 2014 నుంచి 4 వేల కిలోమీటర్లకు పైగా హైవేలు నిర్మితమయ్యాయి” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మరక్కణం-పుదుచ్చేరి సెక్షన్ 4 వరుసల రహదారితోపాటు తీరప్రాంత పర్యాటకం, వాణిజ్యల బలోపేతానికి రూ.2,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, పరమకుడి-రామనాథపురం మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించేందుకు రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడి పెడతారని పేర్కొన్నారు. ఈ రెండో ప్రాజెక్ట్ వల్ల రామేశ్వరం, ధనుష్కోటి వంటి ప్రదేశాలకు ప్రయాణ సౌలభ్యం గణనీయంగా మెరుగవుతుందని చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల నిరంతర రవాణాకు భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు.పుదుచ్చేరిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 01st, 12:00 pm
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె. కైలాస నాథన్, స్పీకర్ శ్రీ ఆర్.సెల్వం, ముఖ్యమంత్రి శ్రీ ఎన్.రంగసామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ మన్సుఖ్ మాండవీయ, పుదుచ్చేరి హోంశాఖ మంత్రి శ్రీ ఎ.నమశ్శివాయం, ఇతర నాయకులుసహా ప్రియమైన సోదరీసోదరులారా... వణక్కం! (నమస్కారం)పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 11:45 am
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. “ సిద్ధులు, సాధువులు, కవులు, స్వాతంత్ర్య సమరయోధుల నిలయం పుదుచ్చేరి. ఇక్కడే మహాకవి సుబ్రహ్మణ్య భారతి జాతీయవాద స్ఫూర్తిని రగిలించగా.. శ్రీ అరబిందో, మదర్... ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించారు” అని వ్యాఖ్యానించారు.మొదటి ఓటు నుండి స్టార్టప్ ఇండియా వరకు, మన్ కీ బాత్‌లో భారతదేశ యువత పట్ల ప్రధానమంత్రి మోదీ ఉత్సాహం
January 25th, 11:30 am
ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు జరిగిన మొదటి మన్ కీ బాత్‌లో, ప్రధానమంత్రి మోదీ ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. స్టార్టప్‌లు, నీటి సంరక్షణ, నాణ్యత, సంస్కృతి & పండుగలు మరియు పరిశుభ్రత వంటి కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు పాల్గొనే రాబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ప్రధాని హైలైట్ చేశారు.సైకిలింగ్‌లో శ్రీ ఎస్. సురేశ్ కుమార్ గారి స్ఫూర్తిదాయక విజయం.. అభినందించిన ప్రధానమంత్రి
January 01st, 10:01 pm
శ్రీ ఎస్. సురేశ్ కుమార్ గారు సాధించిన అసాధారణ విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. శ్రీ సురేశ్ కుమార్ బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
October 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.అనువాదం: జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
September 21st, 06:09 pm
శక్తిని ఆరాధించే పండగ అయిన నవరాత్రి రేపు ప్రారంభమవుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. నవరాత్రి మొదటి రోజే.. దేశం ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో ముఖ్యమైన ముందడుగు వేస్తోంది. రేపు అంటే సెప్టెంబర్ 22న నవరాత్రి మొదటి రోజు నాడు సూర్యుడు ఉదయించే మాదిరిగానే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు కూడా అమలులోకి రానున్నాయి. ఒక విధంగా దేశంలో రేపటి నుంచి జీఎస్టీ పొదుపు అనే పండగ ప్రారంభం కానుంది. ఈ జీఎస్టీ పండగ మీ పొదుపులను పెంచుతుంది.. మీరు కావలసిన వస్తువులను మరింత తక్కువ ధరకు కొనుక్కునేలా చూసుకుంటుంది. మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, నవ- మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ పొదుపు అనే పండగ నుంచి చాలా ప్రయోజనం పొందుతారు. అంటే ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరు తీపి కబురు ఉండటంతో పాటు దేశంలోని ప్రతి కుటుంబం ఆశీర్వాదం పొందుతుందన్న మాట. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాటు పొదుపనే ఈ పండగ విషయంలో దేశంలోని కోట్లాది కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తాయి. వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.. పెట్టుబడులు పెట్టటాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది.. అభివృద్ధికి సంబంధించిన పోటీలో ప్రతి రాష్ట్రాన్ని సమాన స్థానంలో నిలబెడుతుంది.జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 21st, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. శక్తిని పూజించే పండుగ నవరాత్రి ప్రారంభం సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రి మొదటి రోజు నుంచే దేశం ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో కీలక ముందడుగు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 22న సూర్యోదయం నుంచే దేశంలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలవుతాయన్నారు. ఇది భారత్ అంతటా జీఎస్టీ బచత్ ఉత్సవ ప్రారంభాన్ని సూచిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ పండుగ పొదుపును పెంచుతుందనీ.. ప్రజలు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తుందనీ ఆయన స్పష్టం చేశారు. ఈ పొదుపు పండుగ ప్రయోజనాలు పేదలు, మధ్యతరగతి, నవ మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సమానంగా చేరుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సీజన్‌లో ప్రతి కుటుంబం రెట్టింపు ఆనందాన్ని, మాధుర్యాన్ని పొందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు, జీఎస్టీ పొదుపు పండుగ కోసం దేశంలోని కోట్లాది కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంస్కరణలు దేశ వృద్ధిని వేగవంతం చేస్తాయని.. వ్యాపార కార్యకలాపాలనూ సులభతరం చేస్తాయని.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని ప్రధానమంత్రి వివరించారు. అభివృద్ధి పోటీలో ప్రతి రాష్ట్రం సమాన భాగస్వామిగా మారుతుందనీ ఆయన ఆకాంక్షించారు.కర్ణాటకలోని బెంగళూరులో వివిధ మెట్రో ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 10th, 01:30 pm
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారూ, కేంద్రంలోని నా సహచరులు మనోహర్ లాల్ ఖట్టర్ గారూ, హెచ్ డీ కుమారస్వామి గారూ, అశ్విని వైష్ణవ్ గారూ, వి. సోమన్న గారూ, శోభ గారూ, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారూ, కర్ణాటక మంత్రి బి. సురేశ్ గారూ, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ గారూ, ఎంపీ తేజస్వి సూర్య గారూ, డాక్టర్ మంజునాథ్ గారూ, ఎమ్మెల్యే విజయేంద్ర యడియూరప్ప గారూ, కర్ణాటక సోదర సోదరీమణులారా...