భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 03rd, 12:00 pm

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్‌జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...

భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 03rd, 11:30 am

న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఇవాళ ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార‌్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.

ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ప్రగతి’ 50వ సమావేశం

December 31st, 08:11 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఉదయం ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్- ముందస్తు చర్యలతో కూడిన పాలన, సకాలంలో అమలు) ఐసీటీ-ఆధారిత బహుముఖ వేదిక 50వ సమావేశం జరిగింది. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా సహకార, ఫలితాల ఆధారిత పాలనలో ‘ప్రగతి’ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతికతతో కూడిన నాయకత్వం, తక్షణ పర్యవేక్షణ, కేంద్ర, రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం ద్వారా జాతీయ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయిలో ఎలా విజయవంతం చేశాయో ఈ సమావేశం స్పష్టం చేసింది.

'వికసిత భారత్' సంకల్పం తప్పక నెరవేరుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

December 28th, 11:30 am

ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ ప్రయోగశాలలు మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తనదైన ముద్ర వేసిందని అన్నారు. నవసంకల్పాలతో 2026లో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, క్విజ్ పోటీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 మరియు ఫిట్ ఇండియా ఉద్యమం వంటి యువత కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జమ్మూ కాశ్మీర్‌లో జూన్ 6న ప్రధానమంత్రి పర్యటన

June 04th, 12:37 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 6న) జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంధానానికి పెద్ద పీట వేయాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధాని చినాబ్ వంతెనను ఉదయం 11 గంటలకు ప్రారంభించడమే కాకుండా వంతెనను చూడబోతున్నారు. ఆ తరువాత, ఆయన అంజీ బ్రిడ్జిని సందర్శించడంతో పాటు ఆ వంతెనను కూడా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఆయన వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. అనంతరం, రూ. 46,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కట్‌రాలో ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడంతో పాటు వాటిని జాతికి అంకితమిస్తారు.

జమ్ముాకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 13th, 12:30 pm

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు, నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ గారు, జితేంద్ర సింగ్ గారు, అజయ్ తమ్తా గారు, ఉప ముఖ్యమంత్రి సురేందర్ కుమార్ చౌదరి గారు, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ గారు, అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన జమ్మూకశ్మీర్ సోదరసోదరీమణులారా…

జమ్మూ కాశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

January 13th, 12:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ (టన్నెల్) మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్, భారత్ అభివృద్ధి కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సవాళ్లు ఎదురైనా మన సంకల్పం ఏమాత్రం తగ్గలేదని శ్రీ మోదీ అన్నారు. కార్మికులు సంకల్పంతో, నిబద్ధతతో అన్ని అడ్డంకులను అధిగమించి పనులు పూర్తి చేశారని కొనియాడారు. ఏడుగురు కార్మికుల మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

జనవరి 6న వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి

January 05th, 06:28 pm

జనవరి 6 మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.

2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 18th, 11:30 am

మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది 'మన్ కీ బాత్' శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు. నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్‌జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

ప్రధాన మంత్రికి ఫోన్ చేసి ఉరీ ఉగ్రవాద దాడి పై సంతాపం తెలిపిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ అశరఫ్ గనీ

September 20th, 04:37 pm

President Ashraf Ghani of Afghanistan spoke on telephone today with Prime Minister Shri Narendra Modi to condole the terror attack in Uri, Jammu & Kashmir. President Ghani strongly condemned the cross-border terror attack and conveyed Afghanistan’s solidarity and support with India against all actions to eliminate the threat of terrorism.

ఉరీలో ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధానమంత్రి

September 18th, 02:15 pm

Prime Minister Narendra Modi strongly condemned the terror attack in Uri, Jammu and Kashmir. The PM said, We strongly condemn the cowardly terror attack in Uri. : assure the nation that those behind this despicable attack will not go unpunished.