మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
January 28th, 11:22 am
మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ తీవ్ర విషాద సమయంలో మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని శ్రీ మోదీ పేర్కొన్నారు.