న్యూఢిల్లీలో ఎన్డీటీవీ ‘ప్రపంచ సదస్సు-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 11:09 pm
శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య గారికి, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి, నా స్నేహితుడు టోనీ అబాట్ గారికి, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ గారికి, గౌరవ అతిథులకు, సోదరీ సోదరులకూ నా నమస్కారం!న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025 లో ప్రధాని ప్రసంగం
October 17th, 08:00 pm
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ వాతావరణంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు జరుగుతోందని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘అన్‌స్టాపబుల్ ఇండియా’’ను ప్రశంసిస్తూ.. ప్రస్తుత భారత్‌కు తన వేగాన్ని ఆపే ఉద్దేశం లేనందున ఈ అంశం సందర్భోచితంగా ఉందన్నారు. ‘‘భారత్ ఆగదు.. లేదా విరామం తీసుకోదు. 140 కోట్ల మంది భారతీయులంతా కలసికట్టుగా, వేగంగా ముందుకు సాగుతున్నారు’’ అని తెలియజేశారు.ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవం ఆరో ఎడిషన్‌లో ప్రధాని ప్రసంగం
October 09th, 02:51 pm
గౌరవ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్, ఆవిష్కర్తలు, నాయకులు, ఫిన్‌టెక్ రంగ పెట్టుబడిదారులు, సోదరీ సోదరులారా! మీ అందరికీ ముంబయికి హృదయపూర్వక స్వాగతం!ముంబయిలో నిర్వహించిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 09th, 02:50 pm
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’ (అంతర్జాతీయ సాంకేతికార్థిక సదస్సు)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ తొలుత ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ముంబయిని ఇంధన, వాణిజ్య నగరంగా, అపార అవకాశాల కూడలిగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధానమంత్రి, తన మిత్రుడైన గౌరవనీయ కీర్ స్టార్మర్‌ను ప్రత్యేకంగా స్వాగతిస్తూ- ఈ కార్యక్రమానికి సమయం కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు.బీహార్‌లో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
September 26th, 11:30 am
ఈ నవరాత్రి పర్వదిన సమయాన ఇవాళ బీహార్ రాష్ట్ర నారీశక్తి ఆనందంలో పాలుపంచుకునే అదృష్టం నాకు దక్కింది. ఇక్కడ టీవీ తెరపై లక్షలాదిగా తల్లులు..చెల్లెమ్మలు నాకు కనిపిస్తున్నారు. ఈ పండుగ వేళ మీ ఆశీస్సులే మాకు ఎనలేని ఉత్సాహాన్నిస్తాయి. ఇందుకుగాను మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. రాష్ట్రంలో “ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం” నేటి నుంచి అమలులోకి వచ్చింది. నాకు లభించిన సమాచారం ప్రకారం... ఇప్పటికే 75 లక్షల మంది అక్కచెల్లెళ్లు ఈ పథకంలో చేరగా, ఇప్పుడు వారందరి బ్యాంకు ఖాతాలకు ఏకకాలంలో తలా రూ.10,000 వంతున నగదు జమ చేశారు.బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 26th, 11:00 am
బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నవరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ మహిళలతో కలిసి వారి వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ఈ రోజు ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇప్పటికే 75 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమంలో చేరారని శ్రీ మోదీ తెలిపారు. ఈ 75 లక్షల మంది మహిళల్లో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలకు ఒకేసారిగా రూ. 10,000 బదిలీ చేసినట్లు ఆయన ప్రకటించారు.భారత్ - సింగపూర్ సంయుక్త ప్రకటన
September 04th, 08:04 pm
గౌరవ సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ లారెన్స్ వాంగ్ భారత్‌లో అధికారికంగా పర్యటించిన సందర్భంగా భారత్, సింగపూర్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళికపై సంయుక్త ప్రకటన:సింగపూర్ ప్రధానితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం
September 04th, 12:45 pm
ప్రధానమంత్రి శ్రీ వాంగ్ పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత మొదటిసారిగా భారత్ అధికార పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ పర్యటన మరింత మహత్తరమైంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత ప్రస్తుతం 60వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.భారత్-జపాన్ ఆర్థిక ఫోరంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
August 29th, 11:20 am
ఈ ఫోరంలో చేరినందుకు ప్రధానమంత్రి ఇషిబాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విలువైన ప్రసంగాన్ని అభినందిస్తున్నాను.భారత్- జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ప్రధాని
August 29th, 11:02 am
భారత పరిశ్రమల సమాఖ్య, కీడాన్రెన్ (జపాన్ వాణిజ్య సమాఖ్య) టోక్యోలో 2025 ఆగస్టు 29న నిర్వహించిన భారత్ - జపాన్ ఎకనామిక్ ఫోరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబా పాల్గొన్నారు. భారత్ -జపాన్ వాణిజ్యాధినేతల ఫోరం సీఈవోలు సహా భారత్, జపాన్ నుంచి పారిశ్రామిక ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
August 02nd, 11:30 am
నమఃపార్వతీ పతయే.. హర హర మహాదేవ.. పవిత్ర శ్రావణ మాసంలో కాశీలోని నా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఈ రోజు నాకు లభించింది. ఈ సందర్భంగా మీకందరికీ ఇదే నా ప్రణామం.వారణాసిలో దాదాపు రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 02nd, 11:00 am
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వారణాసిని సందర్శించడం, ఇక్కడి ప్రజలను కలవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వారణాసి ప్రజలతో తనకు భావోద్వేగ అనబంధముందన్న శ్రీ మోదీ.. ఆదరాభిమానాలను కనబరిచిన నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులతో సంభాషించడంపై శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.బీహార్లోని మోతీహారీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
July 18th, 11:50 am
ఈ పవిత్ర శ్రావణ మాసంలో నేను బాబా సోమేశ్వర నాథ్ పాదాలకు శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను. ఆయన ఆశీర్వాదంతో బీహార్ ప్రజలందరికీ సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తున్నాను.బీహార్లోని మోతీహారిలో రూ.7,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 18th, 11:30 am
బీహార్‌లోని మోతీహారీలో రూ.7,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా బాబా సోమేశ్వరనాథ్‌కు నమస్సులు అర్పిస్తూ.. బీహార్ ప్రజల జీవితాల్లో సంతోషం, సంక్షేమం నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. చరిత్ర గతిని మార్చిన భూమి... చంపారన్ అనీ, స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహాత్మాగాంధీకి ఈ నేల కొత్త దిశను చూపించిందని చెప్పారు. ఈ నేల అందించిన స్ఫూర్తే ఇప్పుడు బీహార్ భవిష్యత్తును తీర్చిదిద్దుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సమావేశానికి హాజరైన వారికి, బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.2025-26 లో సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం: ప్రస్తుత వడ్డీ రాయితీ 1.5% యథాతథం
May 28th, 03:45 pm
2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కింద వడ్డీ రాయితీ (ఐఎస్) కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకూ ఆమోదం తెలిపింది.ఏబీపీ నెట్వర్క్ ఇండియా@2047 సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
May 06th, 08:04 pm
ఈరోజు పొద్దున్న నుంచీ భారత్ మండపం ఒక శక్తిమంతమైన వేదికగా మారింది. కొద్ది నిమిషాల క్రితం మీ బృందాన్ని కలిసే అవకాశం నాకు లభించింది. ఈ సదస్సు పూర్తి వైవిధ్యంతో కూడినది. ఇక్కడ హాజరైన చాలా మంది ప్రముఖులు ఈ సదస్సుకు నిండుదనం తెచ్చారు. మీ అనుభవం కూడా చాలా విలువైనదని నేను నమ్ముతున్నా. ఈ సదస్సులో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక విధమైన ప్రత్యేకత సంతరించుకుంది. ముఖ్యంగా మన డ్రోన్ దీదీలు, లఖ్పతి దీదీలు ఉత్సాహంగా తమ అనుభవాలను పంచుకోవడాన్ని నేను ఇప్పుడే ఈ వ్యాఖ్యాతలందరినీ కలిసినప్పుడు చూడగలిగాను. వారు తమ ప్రతి మాటా గుర్తుంచుకున్నారు. ఇది నిజంగా స్ఫూర్తిదాయకమైన సందర్భం.Prime Minister Shri Narendra Modi addresses ABP Network India@2047 Summit
May 06th, 08:00 pm
PM Modi, at the ABP News India@2047 Summit in Bharat Mandapam, hailed India's bold strides towards becoming a developed nation. Applauding the inspiring journeys of Drone Didis and Lakhpati Didis, he spotlighted key reforms, global trade pacts, and the transformative impact of DBT—underscoring his government's unwavering commitment to Nation First.హర్యానాలో హిసార్ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 11:00 am
నేను బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాను, మీరంతా రెండుసార్లు చెప్పండి - అమర్ రహే! అమర్ రహే! (దీర్ఘాయుష్షు! దీర్ఘాయుష్షు!)హిసార్లో రూ.410 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
April 14th, 10:16 am
దేశ ప్రజలందరికీ సురక్షిత, సౌలభ్య విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలన్న సంకల్పం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్యానాలోని హిసార్‌లో రూ.410 కోట్లపైగా వ్యయంతో నిర్మించే మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- హర్యానా ప్రజల శక్తిసామర్థ్యాలు, క్రీడాస్ఫూర్తి, సోదరభావం రాష్ట్రానికి ప్రతీకలుగా అభివర్ణిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ముమ్మర పంట కోతల వేళ కూడా పెద్ద సంఖ్యలో ఆశీర్వదించేందుకు వచ్చారంటూ ప్రజలకు తజ్ఞతలు తెలిపారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్-ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ ప్రతినిధివర్గం భేటీ
March 05th, 07:52 pm
జపాన్-ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ (జేఐబీసీసీ) చైర్మన్ శ్రీ తాత్సువో యాసునాగా నాయకత్వంలో ఆ కమిటీ సభ్యులు 17 మందితో కూడిన ప్రతినిధివర్గం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమైంది. ఈ ప్రతినిధివర్గంలో తయారీ, బ్యాంకింగ్, విమానసంస్థలు, ఔషధ రంగం, ప్లాంట్ ఇంజినీరింగ్‌లతోపాటు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) వంటి ముఖ్య రంగాలకు చెందిన కీలక జపాన్ కంపెనీల సీనియర్ నేతలు ఉన్నారు.