వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగం
December 08th, 12:30 pm
ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు, ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తి, త్యాగస్పూర్తి, నిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్ని, ఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవం. వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణం. ఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు, ప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్ సభ ప్రత్యేక చర్చలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 08th, 12:00 pm
జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు లోకసభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ విశేష సందర్భంలో సమష్టి చర్చకు అంగీకరించిన గౌరవ సభ్యులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నీ, ప్రేరణనూ అందించి.. త్యాగనిరతి - దృఢసంకల్పంతో కూడిన మార్గాన్ని నిర్దేశించిన ‘వందేమాతరం’ మంత్రాన్ని స్మరించుకుంటున్నామని, సభలో ఉన్న వారందరికీ ఇదో గొప్ప గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన ఈ చరిత్రాత్మక సందర్భం దేశానికి గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. ఈ వేళ అనేక చారిత్రక సంఘటనలు మన కళ్లెదుట కదలాడేలా నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చ సభ అంకితభావాన్ని చాటడమే కాకుండా, భావి తరాలు అవగాహన పెంచుకునే జ్ఞానసంపదగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సభ్యులంతా ఈ చర్చను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.