నేపాల్ ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి వరదల్లో ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

August 26th, 06:02 pm

నేపాల్ ప్రధాని శ్రీ బాలేంద్ర షాతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నేపాల్‌లో వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌లోని తమ సోదరీసోదరులకు భారతీయులంతా అండగా నిలుస్తారని శ్రీ మోదీ పేర్కొన్నారు.

భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు

August 15th, 05:48 pm

భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు తెలిపిన హృదయపూర్వక శుభాకాంక్షలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అందిన అభినందన సందేశాల పట్ల ఆయన హర్షం, కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.

నేపాల్ ప్రధానిగా శ్రీ బాలేంద్ర షా ప్రమాణస్వీకారం.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

March 27th, 01:27 pm

నేపాల్‌కు ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ బాలేంద్ర షాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘ఈ పదవీ బాధ్యతలు నేపాల్ ప్రజలు మీ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకానికి అద్దం పడుతున్నాయి. భారత్, నేపాల్ ప్రజల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు దేశాల మైత్రినీ, సహకారాన్నీ మరింత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి మీతో కలిసి పనిచేయాలనుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

నేపాల్ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నాయకులకు ప్రధాని శుభాకాంక్షలు

March 09th, 10:04 pm

రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్‌పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడారు.