ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 14th, 01:25 pm

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, కార్యశీలుడైన ప్రజాదరణగల యువ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ అజయ్ టమ్టా, సాంకేతిక మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ మహేంద్ర భట్ సహా వేదికను అలంకరించిన మాజీ గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, మాజీ ముఖ్యమంత్రులైన సోదరులు శ్రీ రమేష్ పోఖ్రియాల్, శ్రీ విజయ్ బహుగుణ, శ్రీ తీరథ్‌ సింగ్ రావత్, శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీసోదరులందరికీ అభివందనం.

ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 14th, 01:20 pm

ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధిలో కీలక ఘట్టమిది. డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బైశాఖి, బోహాగ్ బిహు, పుతాండు పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పండుగ శోభ నెలకొన్న వేళ ఈ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 22nd, 01:30 pm

బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.

భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్‌ జాతికి అంకితం

February 22nd, 01:12 pm

మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్' కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.

ఎన్ హెచ్-334బి లో భాగం గా 40.2 కి.మీ. భాగాన్ని నిర్మించడంలో దీర్ఘకాలం పాటు మన్నిక ను కలిగివుండేటటువంటి సామగ్రి ని ఉపయోగించడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి

June 14th, 10:57 pm

ఎన్ హెచ్-334బి లో 40.2 కిలో మీటర్ ల మేర రహదారి ని నిర్మించడం కోసం ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఫ్లయ్ ఏశ్ వంటి దీర్ఘకాలం పాటు మన్నిక కలిగివుండేటటువంటి సామగ్రి ని ఉపయోగించడాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇలా చేయడం వల్ల ఖర్చు తక్కువ కావడం తో పాటుగా పర్యావరణ అనుకూల ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. ఈ రహదారి భాగం యుపి-హరియాణా సరిహద్దు సమీపం లో బాగ్ పత్ వద్ద మొదలై, హరియాణా లోని రోహ్ నా వద్ద ముగుస్తున్నది.

డిసెంబర్4న దేహ్ రాదూన్ లో అనేక పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధాన మంత్రి; ఈ పథకాల విలువ సుమారు 18,000 కోట్ల రూపాయలు

December 01st, 12:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.