బాగేశ్వర్ ధామ్ వైద్య, వైజ్ఞానిక పరిశోధన సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగం

February 23rd, 06:11 pm

కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూ, ముఖ్యమంత్రి భాయ్ మోహన్ యాదవ్ గారూ, జగద్గురు పూజ్య రామభద్రాచార్య గారూ, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి శ్రీ ధీరేంద్ర శాస్త్రి గారూ, సాధ్వి రితంబర గారూ, స్వామి చిదానంద సరస్వతి గారూ, మహంత్ శ్రీ బాలక్ యోగేశ్చర దాస్ గారూ, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు శ్రీ విష్ణుదేవ్ శర్మ గారూ, ఇతర ప్రముఖులూ... ప్రియమైన సోదరీ సోదరులారా!

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

February 23rd, 04:25 pm

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా గఢా గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఇంత తక్కువ సమయంలోనే రెండో సారి బుందేల్‌ఖండ్‌కు రావడం తనకు దక్కిన సౌభాగ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కేంద్రం బాగేశ్వర్ ధామ్ త్వరలోనే ఆరోగ్య కేంద్రంగా కూడా రూపుదాల్చుతుందని ఆయన అన్నారు. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తారని, మొదటి దశలో 100 పడకల సదుపాయం అందివస్తుందని ఆయన తెలిపారు. ఈ పవిత్ర కార్యానికిగాను శ్రీ ధీరేంద్ర శాస్త్రిని ఆయన అభినందిస్తూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.

ఈనెల 23 నుంచి 25 వరకు మధ్య ప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి

February 22nd, 02:05 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 23 నుంచి 25 వరకు మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈమేరకు 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోనిచత్తర్‌పూర్ జిల్లాలో మధ్యాహ్నం 2గంటలకు బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు భోపాల్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రధానమంత్రి బీహార్‌లోని భాగల్‌పూర్‌ చేరుకుని 19వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు, అలాగే ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఆయన సాయంత్రం 6గంటలకు గౌహతి చేరుకుని జూమోయిర్ బినందిని (మెగా జూమోయిర్) 2025 కార్యక్రమానికి హాజరవుతారు. 25వ తేదీ ఉదయం 10:45గంటలకు గౌహతిలో అడ్వాంటేజ్ అస్సాం 2.0 పెట్టుబడి, మౌలిక సదుపాయాల సదస్సు 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.